ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో.....అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టాయి...!!!
అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండే వారు...!!
అ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా బ్రతకడానికి కావలసిన నీతి నీ బోధించేవారు...!!
అప్పట్లో డబ్బు మాత్రమే కొంచెం సమస్య గా ఉన్నా కుడా ఉన్నదంట్లో నే బ్రతుకుతూ అందరు కలిసి సంతోషంగా వుండేవారు...!!
అమ్మమ్మ-తాతయ్య
నానమ్మ-తాతయ్య
పెద్దనాన్న-పెద్దమ్మ
బాబయ్- పిన్ని
అత్త మామ అంటూ ఒక బంధాల అల్లికలు ఉండేవి...!!
పిల్లలు తప్పూ చేస్తే కుటుంభం అ పిల్లలని వారించి దెగ్గర తీసుకునేది...!
పిల్లలకి కూడా అ కుటుంబంలో ప్రతి ఒక్కరు అంటే భయం భక్తి ప్రేమ అభిమానం ఉండేవి..!!
అ ఇంటికి కొత్తగా వచ్చే అల్లుడు కానీ
కోడలు కానీ అ ఉమ్మడి కుటుంబంతో సరదాగా గడుపుతూ కుటుంబంలో చాలా తక్కువ సమయంలోని కలిసిపోయే వాళ్ళు...!!
అల్లుడికి తగిన మర్యాద
కోడలికి తగిన బాద్యత
యిలా ప్రతిది ఒక పద్దతిలో జరిగేవి...!!
కుటుంబంలో ఒకరితో ఒకరు బాధ్యతగా మేలుగుతూ...ఆదరణ కలిగించే వారు...!!
అలాంటపుడు అ కుటుంబం పరువు మర్యాదలతో వర్ధిల్లేవి...!!
అ ఉమ్మడి కుటుంబాలు పెద్దల చేత నడిచే ఒక గొప్ప రథాలు...!!
అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు దేవాలయాల్లాగా కళకళలాడుతుండేవి....!!
అ ఇంటి పెద్దలే ఆలయశిఖరాల్లాగా వెలిగిపోయేవాళ్లు...!!
ఇప్పట్లో అ ఆలయశిఖరాలని తీసి పక్కన పెట్టేసారు...!!
ఇంటి పెద్దలని భారంగా భావించి దూరంగా విసిరేస్తున్నారు...!!
వాళ్ళకేమి వాళ్ళు హాయిగానే కాలం వెళ్లబుచ్చుకొని దేవతామూర్తులుగా కాలం చేస్తున్నారు...!!
ఈనాడు స్వేర్చగా బ్రతకాలని పల్లెటూరు నుండి ఎగిరిపోయి పట్టణాలకు చేరిన జంటలు.
వాళ్ళు కట్టుకున్న ఇరుకుగదులలోనే సుఖం ఉందని భావిస్తున్నారు...!!
కానీ
డబ్బు కోసం పరుగులెత్తే భర్త,
బాధ్యతలు మరిచిపోతున్నా బార్య,
తల్లిదండ్రులని గౌరవించలేని పిల్లలు,
బాగుపడితే ఒర్చుకోలేని అన్నదమ్ములు,
దుమ్మెత్తి పొసే బంధువులు....!!
ఇప్పటిలో మంచి చెప్పేవాళ్ళు లేరు,
వినేవాళ్ళు అంతకంటే లేరు..!!
భయం లేదు.
భక్తి అంతకంటే లేదు.
ప్రేమ ఒక నాటకం.
అభిమానం ఒక భూటకం..!!
నవ్వు నీ కుడా నటిస్తూ బ్రతికేస్తున్నారు...!!
అవసరంలేని చీకటీ బంధాలని వరిస్తూ....,
అవసరమైన బంధాలని విసిరిపారేస్తూ...
బంధీలుగా బ్రతికేస్తున్నారు...!!
ప్రతిరోజు వార్తలలో కొన్ని సంఘటనలు చూస్తుంటే నాకు బాధగలుగుతుంది.
చాల వరకు కుటుంబాలు రొడ్డున పడిపోవడానికి కారణం మంచి చెడు చేప్పే పెద్దలు అ కుటుంబంతో కలిసి లేకపోవడం. (ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నమవ్వడం).
బలమైన ఉమ్మడి కుటుంబాలను వదులుకుని...
మన ఇంటి పునాదులని మనచేతులారా మనమే బలహీనపరుచుకుంటున్నాము.
ఉమ్మడికుటుంబాలని తిరిగి స్వాగతిద్దాం..!
మన పెద్దలని గౌరవిద్దాం..!!
మన తల్లిదండ్రులని ప్రేమిద్దాం...!
మన బిడ్డలకు సంస్కారం నేర్పిద్దాం...!!
మనం మన సమాజానికి మంచి పంచుదాం....!!
🙏🌺🕊🌹🌸🕉️🌸🌹🕊🌺🙏
No comments:
Post a Comment