Tuesday, April 15, 2025

 *పుట్టినరోజుకి విలువ లేని కొన్ని ఖరీదు అయినా బహుమతులు కొనే బదులు మీకు జీవితాన్ని మరియు జ్ఞానాన్ని అందించే గొప్ప గ్రంధం భగవద్గీత. అటువంటి భగవద్గీతని పుట్టినరోజు నాడు బహుమతిగా ఇవ్వండి.*

*‘‘బాల్యంలో పిల్లలకు భగవద్గీతను దగ్గర చేయండి... అప్పుడు అవి మనకు, మన సంస్కృతికి దూరం కావు.. భగవద్గీత మనసులోని బలహీనతను తొలగించి బలాన్ని ఇస్తుంది. మనిషిని ఉన్నత స్థాయికి మారుస్తుంది. తల్లిదండ్రులు మీ విలువైన సమయాన్ని పిల్లలతో గడపండి. మన సంస్కృతి, సంప్రదాయాలు, మన ఆధ్యాత్మిక విలువల ఔన్నత్యం గురించి చెప్పండి... ఈ ఆధ్యాత్మిక పునాది లేకపోవడం, కుటుంబ వ్యవస్థలు లేకపోవడం వల్ల డిప్రెషన్‌, యాంగ్జయిటీకి గురవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. విదేశీ కల్చర్‌తో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి మానసిక వ్యాధులకు భగవద్గీత ఒక్కటే మందు...* 

*ఇందులోని ప్రతి శ్లోకం మనల్ని ఎంతగానో ప్రభావితం చేసి మనల్ని మరింత దృఢంగా మారుస్తుంది.!!’’ లవ్‌ జిహాద్‌, మత మార్పిడుల పేరుతో ఇతర మతస్తులు చేస్తున్న దౌర్జన్యాలు హిందువుల ఉనికినే ప్రశ్నిస్తున్నాయి., దీనిపై హిందువులు అప్రమత్తంగా ఉండాలి.*

*ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ భగవద్గీతను "ప్రపంచానికి భారతదేశం యొక్క అతిపెద్ద బహుమతి" అని పేర్కొన్నారు.*

*'ఇవ్వడానికి నా దగ్గర భగవద్గీత కంటే గొప్పది ఏదీ లేదు మరియు ప్రపంచానికి స్వీకరించడానికి మరేదైనా లేదు' : మోడీ జీ*
🕉️🙏🕉️ 🙏🕉️🙏 🕉️🙏🕉️

No comments:

Post a Comment