🙏🌺శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు🌺🙏
🌺హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమదాలయానికి వెళ్లిన ప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణ న మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లో కాలు చదువు కొనాలి. సకల రోగ, భూత ప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్ట కి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొంద న వారెంద రో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధ లో ఉన్న ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు, పసుపుకొమ్మలు వంటి వానిని లెక్కించుటకు వాడుట మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చతువ వలసిన ధ్యానం ' శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'🌺
🌺శ్లో|| ఆంజనేయం మహావీరం-బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం
శ్లో|| మర్కటే శ మహొ త్సాహ- సర్వశోక వినాశన
శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||
అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. 🌺
No comments:
Post a Comment