🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి...
*ఆచార్య సద్బోధన*
➖➖➖✍️
```
మానవులు సాధారణంగా “మాకు దుఃఖములు పోవాలి, సంసార బంధనములు తొలగాలి. మోక్షము రావాలి” అని దేవుడిని కోరుకుంటూ ఉంటారు.
ఇది ఎవరికి వారు చేసుకోవాలి కానీ సరైన ప్రయత్నము లేకయే!
దేవుడేం చేస్తాడు! మానవుడు తన ఇంద్రియములను మనస్సును అదుపుచేయక ఎటు బడితే అటు తిప్పుతుంటే ఇంకా ఎక్కువగా సంసారము అనే ఊబిలో కూరుకుపోతాడు.
ఎలా అంటే సముద్రములో ఒక నావ ఉంది. దాని ఇష్టం వచ్చినట్టు దానిని పోనిస్తే, గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోతుంది.
అలా కాకుండా నావను చుక్కానితో నడిపితే సక్రమమైన మార్గంలో నడుస్తుంది. సరైన గమ్యం చేరుకుంటుంది.
అలాగే మన మనసు ఇంద్రియములను, విషయములలో దూరకుండా ఉండేలా చూసుకుంటే బుద్ధి భగవంతుని యందు స్థిరంగా ఉంటుంది.
మానవుని బుద్ధి స్థిరంగా ఉంటే ఏ సంసార బంధనములూ ఉండవు.
పలు రకాలుగా ఆలోచనలు చేయకుండా ముందు బుద్ధిని స్థిరం చేసుకుంటే సకల దుఃఖములు తొలగిపోతాయి. మోక్షము దానంతట అదే వస్తుంది.✍️```
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment