*🔔 సాధన 🔔*
*జపం అనేది మంత్రాన్ని లేదా దైవనామాన్ని పదే పదే ధ్యానించడం.నిరంతరం ఎంత ఎక్కువగా భగవన్నామాన్ని జపిస్తూ ఉంటామో భగవంతునికి అంత దగ్గరగా జరుగుతూ ఉంటాము.*
*దీని వల్ల ,సర్వసమర్పణబుద్ధి, శరణాగతి అలవడుతుంది.*
*శరణాగతి చేసిన భక్తుని బాగోగులు భగవంతుడే చూసుకుంటాడు. పిల్లి తన పిల్లల బాధ్యత రక్షణ తానే వహించినట్లు. ఇక కోతి పిల్ల, తల్లి ఎక్కడ ఏపరిస్థితిలో ఉన్నా తాను స్వయంగా తల్లిని గట్టిగా పట్టుకొని ఉండాలి. తల్లికి అందులో బాధ్యత ఉండదు. దీనినే శాస్త్రంలో మార్జాల కిశోర న్యాయం—మర్కట కిశోర న్యాయం గా పేర్కొంటారు. ఇది ఒక శక్తివంతమైన సాధనంగా పని చేసి, మనలను పాపాలనుండి రక్షించి, మనసును నిర్మలంగా చేసి, మన శరీరానికి, మనసుకు మరియు ఆత్మకు శ్రేయస్సును అందిస్తుంది.*
*జపం మన దుఃఖాలను, కష్టాలను తొలగించి, అన్ని కలిగించడమే కాకుండా భగవంతునితో అనుసంధానిస్తుంది. ప్రారంభంలో యాంత్రికముగా అనిపించినా పోస్ట పోను ఈ జపం మనలను భగవంతునికి అత్యంత ఇష్టుని గా చేస్తుంది. ఇది ఎవరికి వారు నిత్యమూ సాధన చేస్తూ ఉంటే వారికి బుద్ధిపూర్వకముగా అనుభవములోకి వస్తుంది.*
*┈┉┅━❀꧁హరే కృష్ణ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🙏🙏🙏 🔔🕉️🔔 🙏🙏🙏
No comments:
Post a Comment