ఇంటిలో వండిన ఆహారం రుచిగా వుండదు. కానీ హోటళ్ళలో వడ్డించే సది, కుళ్ళిపోయిన ఆహారం రుచిస్తుంది. ఈ ప్రపంచం అంతే. మనం అంతా ఈ వేగంతో తాత్కాలికమైన వాటికోసం పరుగులు పెడతాము. ఈ కనిపించే దృశ్యాల వెనుక వున్న శాశ్వతత్వాన్ని చూడలేని అంధులం మనం. కనిపించే ప్రతి వస్తువులోనూ దైవత్వాన్ని చూడడం మనం - నేర్చుకోవాలి.
సన్యాసికి, ఇంద్రియసుఖాన్ని కోరుకునే వ్యక్తికి ఉన్న తేడాని చూడండి. గొప్పవారు, సంత్ లు, భక్తులు, ఋషులు, మునులు కూడా మనలాగే దుస్తులు ధరిస్తారు. మనలాగే ఆహారం తీసుకుంటారు. వారు ఈ ప్రాపంచిక విషయాలలో మనలాగే ఉంటారు. అయినా తేడా వుంది. వారిలో కూడా వివాహితులు, కుటుంబీకులు ఉన్నారు. కానీ భేదం వుంది. మనం బాహ్యత్వాన్ని చూస్తాము. వారు విషయాలను లోతుగా చూస్తారు. వారి ఆలోచనలు శుద్దమైనవి, నిజమైనవి, ప్రేమతో నిండినవి మరియు అన్నింటిలోనూ దైవత్వాన్ని దర్శిస్తారు. మన ఆలోచనలు అపవిత్రమైనవి. ఆపద్ధర్మాలు, ధర్మానికి వ్యతిరేకం. మనం అజ్ఞానులం, మోసగాళ్ళం. నా గురువు నన్ను నిండు హృదయంతో రాయటాన్ని ప్రేరేపించారు. నేను పాఠకులను నిండు మనసుతో చదవాలని కోరుతున్నాను. నేను సత్యాల గురించి మాట్లాడుతున్నాను!!
మనం మన పరిశీలనకు తిరిగి వెళదాము. కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. ఒక సన్యాసి స్త్రీ యొక్క నడుము పై భాగము చూసే విధానం, ఇంద్రియ సుఖం కోరుకునే వ్యక్తి చూసే విధానం చూడండి. సన్యాసికి స్త్రీ స్తనం అనేది ఒక పిల్లవాడిని పెద్దవాడిగా చేయగల ప్రాణశక్తికి చిహ్నంగా కనిపిస్తుంది. సన్యాసి ప్రతి స్త్రీలోను ఒక దైవశక్తిని దర్శిస్తాడు. మామూలు మనిసి "ఆమె స్తనాన్ని తాకాలనుకుంటున్నాను, తద్వారా ఆ పనిని చేయగలను'' అని యోచింపగలడు. సన్యాసి స్త్రీలో చైతన్యరూపాన్ని చూస్తాడు. భోగి స్త్రీలోని ఆడతనాన్ని చూస్తాడు అతడు ఆమె శరీరాన్ని ఊహాత్మకంగా స్పర్శిస్తూ అనుభవిస్తుంటాడు. అతని ప్రవర్తన జంతువువలె మారుతుంది. అతడు ఆ తలపులలో ఎంత మునిగి ఉంటాడంటే అవి కొన్నిసార్లు అతనితో వింతపనులు చేయడానికి ప్రోత్సాహిస్తాయి. అతడు పిచ్చివాడిగా మారుతాడు. ఆ వ్యక్తి లేని జీవితం అర్థం లేనిదని ఆత్మహత్య కూడా చేసుకుంటాడు. ఏ స్త్రీని చూసినా అతనిలోని కోరిక బలీయమౌతుంది. సన్యాసి వేరేవిధంగా ఉంటాడు. అతడు అన్ని వస్తువులలోను దైవత్వాన్ని చూస్తాడు. మామూలు మనిషి తనను తనవారిని మోసం చేస్తుంటాడు.
మీరు ఇతరులకు స్త్రీయొక్క అందం గురించి ఆలోచించడం. దానిలో మునగటం తప్పు అని చెప్పితే వారు మీతో కవులు, సాధువులు పూర్వకాలములో చేసేవారు, మేము చేస్తే తప్పేమిటి; అని వాదిస్తారు. ఈ స్త్రీ వర్ణన అనబడేదానిలో ఉన్న తేడాను గమనించండి. వీరిలో చాలామంది స్త్రీ రూపాన్ని ముందు రచయితలను ఆధారంగా చేసుకొని వర్ణిస్తారు. మొదటినుండి తుదివరకు ఆ విషయాన్ని గురించే మాట్లాడు తారు. వీరు రచించే గ్రంథాలలో అభివృద్ధి ఉండదు. స్త్రీ నగ్న సౌందర్య రచనతోనే వీరు సంతోషిస్తారు. వీరి జీవితంలో ఏదైనా ధ్యేయం ఉన్నదా? అన్న విషయం మనకు అర్థం కాదు. ఇలాంటి రచనలు కుర్రకారు మనస్సుని పాడు చేస్తాయి. అందుకనే మనం యుక్త వయస్కులలో ఎంతో అసహనం చూస్తున్నాము. ఒక వ్యక్తి ఎంతోమంది స్త్రీలను ప్రేమించటం, విడాకులు తీసుకోవటం, హత్యలు చేయటం, దహనాలు చేయడం, ఎక్కువ వివాహాలు, కొన్నిసార్లు మూడు, ఐదు చేసుకోవటంలాంటి ఉదంతాలు ఎన్నో వింటూ వుంటాము. ఎంతోమంది చిన్నపిల్లలకు ముసలివారితో వివాహం గురించి మీరు వినేవుంటారు. వీరికి ఏమి ఆనందం లభిస్తుంది? ఈ వృద్ధులు: వయస్సులో వున్న ఆడవారి జీవితం నాశనం చేస్తున్నారు. ఈ వయస్సులోవున్న ఆడపిల్లలు యువకుల ఆకర్షణలో పడడం సాధారణమే. ఈ మొత్తం వలయాన్ని నేను మోసం అంటాను!! ఈ వ్యక్తులలో అంధకారం నిండి వుంది. వీరికి కుటుంబo గురించి ఆసక్తి, బాధ్యత అన్నవి లేవు. ఎన్నో ఉదంతాలలో తండ్రులు, సోదరుల తమ కూతుళ్ళను, చెల్లెళ్ళను శరీర వ్యాపారంలోకి తోయడం జరుగుతోంది. చెట్ట విత్తు ద్వారా తెలుస్తుంది.
పూర్వకాలపు వ్యక్తుల గురించి చూద్దాం. ఉదాహరణకు - వాల్మీకి సీత గురించి, కాళిదాసు శకుంతల గురించి, వ్యాసర్షి సత్యవతి, అంబిక, అంబ, అంబాలిక, సుభద్ర, గోపికలు లేక గృహిణులు, ఎందరెందరో స్త్రీల గురించి వ్రాసారు. ఈ పురాణ కావ్యాలలో వారి శరీరాల గురించి వివరంగా వర్ణించబడినది. వారి ధ్యేయం ఈ భౌతిక వర్ణనలతో తృప్తిపడడం కాదు. వీరంతా వారిని గొప్ప మాతృమూర్తులుగా చెప్పారు. వారిలోపలి గుణాలు, ప్రవర్తనను ఈ బాహ్య సౌందర్యం ద్వారా చూపించారు. వారు ఎలా కనబడుతున్నారు అనేదానికంటే వారెలాంటి వారు అనేదానికి ప్రాముఖ్యత నిచ్చారు. వీరందరూ స్త్రీజాతికి ఆదర్శంగా చిత్రీకరింపబడినారు. ఇది వారి వర్ణనలో ఉన్న బేధం. వారు గొప్ప గుణాల కోసం బాహ్యరూపానికి అతీతంగా వెళ్ళారు. మన సమకాలికులు వారి భౌతిక వర్ణనలో మునిగి పోతున్నారు. దీనిని అధిగమించి వారు వెళ్లరు. స్త్రీలు ఇంద్రియ సుఖాలనిచ్చే బొమ్మలు కారు. వారు తిరుగుబాటు చేస్తారు. 'మాతృత్వం' అనే గౌరవహోదా వారికక్కర్లేదు. గారడీవాని చేతిలోని కోతిలాగా ఆడడానికి ఇష్టపడతారు. ఇది మన నాగరికతలో ఉన్న గొప్పస్థానం! మనం మన జీవిత ధ్యేయాన్ని, దాని విలువను కోల్పోయాము. సినిమాలు, నాటకాలు, కళలు, రచనలను తిలకించండి. ఇది అసభ్య చిత్రీకరణతో నింపబడి వుంది. లోతైన విలువలు ప్రదర్శింప బడుట లేదు. దైవత్వ ప్రమాణంలో చూపబడిన ' ప్రేమ' ఇదికాదు. ఇది కామం, ఇంద్రియలోలత మాత్రమే.
పూర్వపుకవులు అంకిత భావంకలవారు. వారి ఆధ్యాత్మ మట్టములో సూచించే భావనలు దైవత్వాన్ని తెలుపుతాయి. వాల్మీకి ఒక గొప్ప ఋషి, భాగవతాన్ని మనకు అందించిన వ్యాసుడుకూడా మహానుభావుడు. శుకముని పుట్టుకతో యోగి. ఆయన లింగ భేదాలు చూడలేదు. తన ఆయుఃపరిమితి తెలిసిన 'పరీక్షిత్తు' ముక్తికోసం అనేక గాధలు విన్నాడు. (మా గురువుగారు నాతో ఒకసారి చెప్పారు, వీరికి కామదృష్టి లేదు, వారి ఏకాగ్రత ఈ సృష్టిలో ఇమిడివున్న దైవీక ప్రేమపైన ఉన్నది). మన సమకాలికులు దీనిని అర్థం చేసుకోకుండా ఈ సమాజాన్ని వినాశనం వైపు లాగుతున్నారు. మన ఋషులు పవిత్రమైన స్త్రీ పురుష సంబంధానికి వ్యతిరేకంగా ) ఎప్పుడూ మాట్లాడలేదు. వారు ఏకపత్నీ వ్రతమును ఉపదేశించారు. పురుషుడు ఒకే ఒక్క స్త్రీకి సమర్పించుకోవాలి. ఆమెతో ఆనందమైన జీవితం గడిపి శాశ్వత సుఖం వైపు వెళ్ళాలి. పురుషుని ఏకైక అభివృద్ధి' ఆత్మవిశ్వాసం'. ఇది లేకుండా మిగతాది అంతా అసంపూర్ణం, ఆకృతి లేనిది.
- నేటి మహానుభావులైన శ్రీ రాజగోపాలాచారి, శ్రీ కరియప్ప, ' ఓ విద్యార్థులారా! చలన చిత్రాలు చూడకండి' అన్నారు. యువత మనస్సును సంపూర్ణంగా వుంచేందుకు కావలసిన విషయాలను మన నిర్మాతలు, ప్రభుత్వం, సెన్సారువారు ఎందుకు చూపలేరు? ఈ చలనచిత్రాలు చౌకబారు కామం, అంగ ప్రదర్శన, కర్ణకఠోరమైన సంగీతపు బారినుండి తప్పించుకొనలేవా? వివిధ కారణాలవల్ల వివిధ స్థాయిల యువతీయువకులు కలిసి జీవిస్తూ ఈ తాకిడి నుండి ఎలా విడుదల అవగలరిన మీరనుకుంటున్నారు? ఇలా యువతను చెడుత్రోవలో పెడుతున్న పుస్తకాలను, సినిమాలను మనం ఎందుకు ప్రోత్సాహిస్తున్నాము? సమాజంలో చెడు వ్యాపించకుండా దానికి వ్యతిరేకించే బాధ్యతను ఎవరూ ఎందుకు తీసుకోరు? ‘కులీన స్త్రీ' అనే పదం వాడడం లేదు. పుస్తకాలను జ్ఞానులు, సంత్ లతో పర్యవేక్షింప - చేయించాలి. వారు యువత మనస్సులో తద్వారా సమాజానికి ఆసక్తివున్న విషయాలను బహిర్గతము చేయగలరు. ఈ దిశలో తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. - ఎవ్వరూ దీనిపై సక్రమంగా తీవ్ర చర్యలు తీసుకొనకపోతే, ఎందరో మహానుభావులున్న - మనదేశపు ఘనకీర్తి కలిగిన చరిత్ర పూర్తి వినాశనానికి గురి అవుతుంది. ఇది సత్యము.
ఈ పనులు ఎలా సరిచేయాలి? దానికి సమాధానం అడుగునుండి రావాలి. ఇక్కడ అడుగు అంటే ప్రారంభదశ అని అర్థం. పిల్లల మనస్తత్వం అర్థంచేసుకొని వారికి సరైన
విద్య అందిస్తే తప్ప మనకు ఆశలేదు. మనం పాశ్చాత్యులను అనుకరించడంలో గొప్పవాళ్లం. కానీ దీనిని మనం చెడుకు మాత్రమే వినియోగించుకుంటున్నాం. వారి సత్ప్రవర్తన నేర్చుకుంటున్నామా? లేదు!
మనం చిన్నపిల్లల మనస్తత్వం తెలుసుకుందాం. శిశువు జన్మించినప్పటి నుండి శరీరము స్వతంత్ర్యముగా పనిచేయటం మొదలు పెడుతుంది. పిల్లలో వున్న ' ఆత్మ తేజస్సు' స్వచ్ఛమైనది, అమాయకమైనది. అది ఆకాశంలో ఉన్న తేజోవంతుడైన సూర్యునివలె ప్రకాశిస్తుంది. అతని జ్ఞానం తల్లిని అనుభూతుల ద్వారా గుర్తించడం వరకే పరిమితం. క్రమంగా ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహించుకోవటం నేర్చుకుంటుంది. (దృష్టి, వినికిడి, స్పర్శ, వాసన, రుచి) ఈ ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహించుకోవడం నేర్చుకుంటుంది. ఈ ముద్రలే సంస్కారం అని పిలువబడతాయి. పిల్లలకు ఈ ముద్రలు నేర్చుకొనే గొప్పశక్తి వుంటుంది. పిల్లలు పెరిగి బాధ్యతలు తీసుకొంటున్నకొద్దీ ఈ శక్తి క్షీణించటం మొదలు పెడుతుంది. మనం తీసుకు రావల్సిన మార్పులను చిన్నతనంలోనే ప్రారంభించాలి. పిల్లలు పెరుగవలసిన వాతావరణాన్ని జాగ్రత్తగా ఏర్పరచాలి. ఇదేవారి ఆలోచనలను రూపొందిస్తుంది. పిల్లలకు అనువైన వాతావరణం కల్పించడమనేది తల్లిదండ్రుల ముఖ్య బాధ్యత. ముఖ్యంగా శిశువు యొక్క మానసిక, శారీరక ఎదుగుదలకు కావలసిన అనువైన అవకాశాన్ని కల్పించే బాధ్యత తీసుకోవాలి.
ఎంతమంది తల్లిదండ్రులు బాధ్యతగా వుంటున్నారు అన్నది ఒక పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం తల్లిదండ్రుల ఆత్మపరిశీలన ద్వారా శోధించుకోవాలి. ఒక బిడ్డకు జన్మనివ్వటం ద్వారా మీరు తల్లిదండ్రులు అని పిలువబడడానికి అర్హత పొందినట్లు కాదు. శిశువు జన్మ అనేది వర్గ ఉత్పత్తి కోసం ఉన్న ప్రకృతి విధానం. అది ఒక భౌతిక చర్య. భూమి మీద వున్న జీవరాశులన్నీ పునరుత్పత్తి కోసం చర్య చేపడుతాయి. ఇది మాత్రమే మానవ జీవిత ఉద్దేశ్యమయితే మనిషికి పశువుకు తేడా ఏముంది? మనం భగవంతుని యొక్క ఉత్తమ సృష్టి అని, ప్రపంచంలోని ఉన్నత స్థాయి మనదే అని మనని స్తుతించుకొనవచ్చును. కానీ, ఈ పదానికి నిజమైన అర్థంలో ఎంత నాగరికతను మనం కలిగి ఉన్నాము? ఎంతవరకు మనం మనుషులం? ఈ ప్రపంచం ఎంత నటనలో ఉన్నది. మనం విజ్ఞాన అభివృద్ధి పేరుతో ఒకదానిని మించి వేరొక బలమైన ఆయుధం తయారుచేస్తున్నాము. ఒకవైపు శాంతి! శాంతి! అని ప్రవచిస్తూ వేరొక వైపు మారణాయుధాలను తయారుచేస్తున్నాము. ఇలాంటి వైజ్ఞానికులుగా తయారవటం కంటే అజ్ఞానులుగా మిగలటం మిన్న. ఈ ప్రపంచం యాంత్రికత అనే పందెంలో హడావిడిగా వున్నది. మన జీవిత ఆధారం 'ధర్మం' కాకపోతే ఈ నాగరిక ప్రపంచం యొక్క వినాశనం ఖాయం. 'కామ', 'అర్థా' లను అధిగమించి మనం అందరం మన జీవిత విధులను పరిపూర్ణం కావించుకుందాము. ఒకసారి తీర్మానించు కుని మనం ధర్మములో జీవించగలిగితే 'మోక్షము' అనేది తనంతట తాను అనుసరిస్తూ మనను చేరుతుంది.
హరి ఓం తత్సత్
Sekarana from book - విశ్వ రూప దర్శనం
భగవాన్ శ్రీ విశ్వేశ్వరయ్య స్వీయచరిత్ర (పూజ్య శ్రీ ఋషి ప్రభాకర్ గురూజీకి గురువులు)

