Thursday, August 20, 2026

ప్రతిరోజూ మనతో మనం ఇలా సంకల్పం చెప్పుకోవాలి.

 

Rushivani ఋషివాణి
50 minutes ago
ప్రతిరోజూ మనతో మనం ఇలా సంకల్పం చెప్పుకోవాలి.
1.నేను తక్కువగా మాట్లాడుతాను, మరియు సత్యం మాట్లాడుతాను.
2.నేను సాత్త్వికమైన మరియు నియమబద్ధమైన ఆహారం తీసుకుంటాను.
3.అనవసరమైన విషయాలకు నన్ను నేను దూరంగా ఉంచుకుంటాను.
4.క్రమం తప్పకుండా శ్రీ దత్త మంత్రాన్ని నియమిత సంఖ్యలో (కనీసం పూటకు 32 సార్లు) జపిస్తాను.
5.ప్రతిరోజూ గురుదేవులను ధ్యానిస్తాను. 
6.సేవ మరియు కరుణను నా జీవితంలో భాగంగా చేసుకుంటాను.
7.కోపం, లోభం, మోహం మరియు అహంకారాన్ని.. ఇలా నాలోని లోపాలను గుర్తించి వాటిని తగ్గించడానికి ప్రయత్నిస్తాను.
8.ప్రతి జీవిలో గురుతత్త్వాన్ని దర్శించడానికి ప్రయత్నిస్తాను.
9.నా ప్రతి కర్మను శ్రీ గురుదేవ దత్తాత్రేయుల వారి దివ్య చరణాలకు సమర్పిస్తాను.
జై గురుదేవ దత్త.

http://youtube.com/post/Ugkx0lWOfrJTHGFHgVjHMmDgy2dqoTIkhZzI?si=TjKHOxhoT9z3qGyc

No comments:

Post a Comment