పెళ్లి చేసుకోవాలా.. వద్దా.?#youtube#viral#viralvideo#trending#love#marriage#edit
Author Name:ajju-baipalli
Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Sx0UczwBVaM
Transcript:
(00:01) అరుణాచల శివ ఈరోజు హైదరాబాద్ నుండి స్వాతి అనే ఒక అమ్మాయి ఫోన్ చేసి ఒక ప్రశ్న అడిగింది. అజ్జు గారు ఈ భూమ్మీద పుట్టిన ప్రతి మనిషి కూడా జీవితంలో పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటేనే సంతానం ఉంటేనే ముక్తి వచ్చినట్టా మిగిలిన వాళ్ళకి ముక్తి రాదా కచ్చితంగా మనిషిగా పుట్టాక పెళ్లి చేసుకోవాలా అనే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పమని అడిగింది.
(00:37) నేను సమాధానం చెప్పే లోపలే ఇంకొక మాట చెప్పింది అజుగారు నేను ఇక్కడ హైదరాబాద్ లో హైటెక్ సిటీలో ఉంటున్నానండి హాస్టల్ లో మా హాస్టల్ లోనే దాదాపు 10 మందికి ఈ డౌట్ ఉంది కచ్చితంగా మనిషిగా పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటేనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటేనే ముక్తి వస్తుందా లిబరేట్ అవుతామా లేకపోతే ముక్తి రాదా అని మా హాస్టల్ లోనే 10 మందికి ఉంది ఈ ప్రశ్న అలా అలాంటిది మరి మా కంపెనీలో ఇంక ఎంతమందికి ఉంటుంది ఈ స్టేట్ లో ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఎంతమందికి ఉంటుంది కాబట్టి ఒక వీడియోగా చేసి పెట్టండి నాకు సమాధానం చెప్పొద్దు నేను కూడా ఆ వీడియోలోనే వింటాను కాబట్టి
(01:20) ఒక వీడియోగా చేసి పెట్టండి అంది. నాకు నిజమే అనిపించింది కరెక్టే కదా చాలా మందికి ఈ డౌట్ అనేది ఈ సందేహం అనేది ఉంటుంది. అని అన్నందుకు ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మనిషిగా పుట్టిన తర్వాత కచ్చితంగా జీవితంలో పెళ్లి చేసుకోవాలా అనే ఈ ప్రశ్నకి ఈరోజు సమాధానం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి నేను చేసుకోవాలా చేసుకోకూడదా అనే ప్రశ్నే తప్పండి పెళ్లి అనేది చేసుకోకూడదు చేసుకోవాలి అని అనుకోకూడదు పెళ్లి అనేది జరగాలి.
(02:02) ఎందుకు ఎందుకు అంటే పెళ్లి అనేది ప్రారబ్ధం అండి ఒక మనిషి జీవితమే ప్రారబ్ధం అయినప్పుడు అందులో పెళ్లి కూడా ప్రారబ్ధం కాదా అది నీ యొక్క ఇష్టం అవుతుందా ఒక్కసారి పరిశీలన చేయండి మనిషి యొక్క పుట్టుక ఆ మనిషి చేతిలో ఉండదు ఒక మనిషి యొక్క మరణం ఆ మనిషి చేతిలో ఉండదు అలాంటిది మధ్యలో ఉన్న సంఘటనలు సందర్భాలు సన్నివేశాలు వాడి చేతుల్లో ఉంటాయని అనుకోవడం మూర్ఖత్వం కాదాండి ఒక్కసారి పరిశీలన చేయండి.
(02:34) ఈ క్షణం ఈరోజు నువ్వు వాటర్ తాగుతున్నావ్ ఈ క్షణం వాటర్ తాగావు నీరు తాగావు. కరెక్ట్ గా ఒక 15 నిమిషాల తర్వాత నాకు టాయిలెట్ రూపంలో అది బయటికి వచ్చేస్తుందని నువ్వు చెప్పగలవా నీ చేతుల్లో ఉన్నప్పుడు అది నువ్వు చెప్పలేవు ఎందుకంటే అది ప్రారబ్ధం అది ఎప్పుడు ఏ క్షణం ఎలా వస్తుందో బయటికి తెలియదు పో నీ చేతుల్లో ఉందనుకొని ఒక వన్ అవర్ ఓపిక బిగబట్టు టాయిలెట్ నాపుకో అవుతుందా అవ్వదు కదా అది నీ చేతుల్లో ఉందన్నప్పుడు అది అవ్వదు కదా నీ శరీరాన్ని నువ్వే కదా కంట్రోల్ చేసుకోవాలి నీ యొక్క శ్వాస శవాస నువ్వే కదా కంట్రోల్ చేసుకోవాలి నిజంగా నీ
(03:11) యొక్క శ్వాస నీ కంట్రోల్ లో ఉంటే నువ్వు ఎప్పటికీ వదలకూడదు కదా తుదిశ్వాసని మరి ఎందుకు వదిలేస్తున్నావ్ అంటే పుట్టుక దగ్గర నుండి చనిపోయేంతవరకు మనిషి యొక్క ప్రమేయం ఏమాత్రం లేదు అది కచ్చితంగా ప్రారబ్ధం ప్రకారమే జరుగుతుంది అందులో పెళ్లి కూడా ప్రారబ్ధమే కాబట్టి పెళ్లి అనేది జరగడం జరగకపోవడం ఈ రెండే ఉన్నాయి చేసుకోవడం చేసుకోకపోవడం అనేది అసలు ఆ మాటే రాకూడదు మనిషి నోటి నుండి అయితే జరగడం లేదా జరగకపోవడం జరగడం ఎప్పుడు జరుగుతుంది అంటే పెళ్లి అనేది ఒక మనిషి జీవితంలో రుణబంధం అనేది ఉంటేనే జరుగుతుంది.
(03:49) అంటే క్రిందటి జన్మలో అంటే క్రిందటి శరీరంతో నేను మాట్లాడేది మీ యొక్క శరీరాల గురించి మీ గురించి కాదు మీ యొక్క శరీరం క్రిందటి జన్మలో ఏదో ఒక రుణబంధ మిగిలి ఉంది అంటే ఇంకొకరికి సేవ చేయడంలోనో ఇంకొకరి మీద పగతీర్చుకోవడంలోనో ఇంకొకరిని తిట్టడంలోనో ఇంకొకరిని కొట్టడంలోనో ఇంకొకరిని పెళ్లి చేసుకొని సంతానం కనాలి అనే ఒక కోరికని మిగిల్చు కోవడంలోనో అది ఈ జన్మలో తీరవలసి ఉంది అలా రుణబంధం రుణశాసం ఎవరికైతే మిగిలిఉంటుందో వాళ్ళకి పెళ్లి అనేది జీవితంలో జరుగుతుంది.
(04:29) ఆ జరిగేదాన్ని వీడు ఏమనుకుంటున్నాడు అంటే నేను పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నాడు కాదు పెళ్లి జరిగింది అంతే పెళ్లి ఎవరికి జరగదు అంటే ఎవరికైతే రుణశేషం అనేది రుణబంధం అనేది ఉండదో వాళ్ళకి పెళ్లి జరగదు. అంటే వాడు ముక్తికి దగ్గరగా ఉన్నాడు. వీడు ప్రారబ్ధాన్ని అనుభవించాలి వాడి ప్రారబ్ధాన్ని ఈ ప్రారబ్ధాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు సంసార ప్రారబ్ధాన్ని సంసార బంధాన్ని వాడు ముక్తికి చాలా దగ్గరగా ఉన్నాడు.
(04:57) ఎవరైతే పెళ్లి జరిగిందో వాళ్ళు కూడా సాక్షిగా ఉంటూ నేను కర్తను కాను నేను సాక్షిని అనే దృష్టికోణంతో సంసార బంధాన్ని ఎవడైతే ఈదుతాడో సంసార బంధాన్ని ఎవడైతే ముందుకు తీసుకెళ్తాడో వాడు కూడా వచ్చే జన్మలో కచ్చితంగా ముక్తికి దగ్గర అవుతాడు. కాబట్టి ఎప్పుడైనా పెళ్లి జరగట్లేదు అంటే ఎప్పుడు కూడా ఎవరు బాధపడొద్దు నాకు రుణబంధం లేదు నేను ఎవరికీ అప్పు లేను కిందటి జన్మలో నేను ఎవరికీ అప్పు లేను కిందటి జన్మలో నేను ఎవరికీ సేవ చేయాలి అనుకోలేదు కిందటి జన్మలో నాకు కోరికలు లేవు కాబట్టి నాకు ఇప్పుడు పెళ్లి కావడం లేదు నేను ముక్తికి చాలా దగ్గరగా ఉన్నానని
(05:31) ఆనందంతో ఉండండి. వీలైతే సెలబ్రేట్ చేసుకోండి ప్రతిరోజు కూడా సెలబ్రేట్ చేసుకోండి. ప్రతిరోజు ఎలా అయితే నిద్ర లేచిన తర్వాత అమ్మయ్యా చాలామంది నిద్రలోనే కన్ను మూస్తున్నారు. ఈరోజు నేను కళ్ళు తెరిచాను అని ఎలా అయితే ఆనందపడుతున్నారో అలా ఈరోజు ఈ జన్మలో నాకు పెళ్లి కాలేదని చెప్పి ఆనంద పడండి. ఎందుకంటే నాకు రుణబంధం లేదు కాబట్టి నాకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు పెళ్లి జరగదు అని ఆనంద పడండి అప్పుడు నువ్వు సాక్షి భావనను అనుభవించినట్టు నువ్వు ప్రారబ్ధాన్ని అనుభవించినట్టు నువ్వు శరణాగతిని పొందినట్టు కాబట్టి ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలా
(06:11) చేసుకోకూడదా అనే ప్రశ్నే ఉండకూడదు పెళ్లి జరిగిందా జరగలేదా జరిగింది అంటే నీకు రుణ బంధం రుణశేషం ఉన్నట్టు జరగలేదు అంటే నీకు ఋణ బంధం రుణశేషం లేనట్టు ముక్తికి దగ్గరగా ఉన్నట్టు నువ్వు అలా కాదండి పెళ్లి అనేది నేనే చేసుకుంటున్నానండి ఈ శరీరమే నేను ఈ ఆలోచనలే నేను ఈ మనసే నేను నేనే పెళ్లి చేసుకుంటున్నాను పెళ్లి చేసుకోవడం అనేది నా నిర్ణయం అండి అనుకునే వాళ్ళకి మాత్రం నేను ఇచ్చే సలహా ఒక్కటే పెళ్లి చేసుకోవాలనుకునేటప్పుడు ఒక క్వాలిఫికేషన్ కచ్చితంగా చూసుకోండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏంటి అంటే సాధారణంగా ఒక ఉద్యోగానికి కచ్చితంగా క్వాలిఫికేషన్ ఉంటుంది కదా ఇప్పుడు ఒక
(06:50) స్టినోగ్రాఫర్ ఉద్యోగం ఉందనుకోండి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి ఒక కలెక్టర్ అవ్వాలనుకోండి ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి ఒక ప్రొఫెసర్ అవ్వాలనుకోండి ఒక ఎంటెక్ ఉండాలి అలా ప్రతిదానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసే ఒక ఉద్యోగానికో ఒక ఉద్యోగానికే ఒక క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు ఒక నియమ నిబద్ధనలు ఉన్నప్పుడు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు అరె యార్ జీవితాంతం కలిసి ఉండాలయ్యా జీవితాంతం ఎన్నో సందర్భాల్ని సన్నివేశాల్ని ఎన్నో ప్రతిఘటనలని ఎదుర్కోవాలి దానికి క్వాలిఫికేషన్ ఉండదా కచ్చితంగా పెట్టుకోవాలి ఏంటి ఆ
(07:27) క్వాలిఫికేషన్ అంటే ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు ఈ ఆలోచనలు నేను కాదు అనే స్థితి స్థితి కలిగిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితం గట్టెక్కిపోతుంది. జీవితంలో ఎటువంటి కష్టాలు సుఖాలు ఉన్నాయని అనిపించదు. ప్రశాంతంగా జీవితం ముందుకు వెళ్తుంది. అలా కాదండి నాకు డబ్బు ముఖ్యం నాకు అందం ముఖ్యం నాకు ఆస్తులు ముఖ్యం నాకు అంతస్తులు ముఖ్యం.
(07:53) అనే ఒక భావనతో పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్న మొదట్లో బాగానే ఉంటుంది. ఎందుకంటే అందం అనేది శరీరానికి సంబంధించింది శరీరం అనేది ఎప్పుడూ కూడా మార్పు చెందుతూ ఉంటుంది ఒకానొక సందర్భంలో అందం కాస్త అందవికారం అవుతుంది. అప్పుడు ఏం చేస్తావ్ దేనితో సంసారం చేస్తావ్ అప్పుడు మొదలవుతుంది. గొడవలు అప్పుడు మొదలవుతాయి కష్టాలు అప్పుడు మొదలవుతాయి బాధలు ఆస్తులైనా అంతస్తులైనా ఏవైనా సరే అవన్నీ అశాశ్వతమైనవి కానీ నీ శరీరము నీ యొక్క ఆలోచనలు నీ యొక్క మనసు ఇవన్నీ కదలడానికి చలనం చెందడానికి ఏదైతే ఆత్మ కారణం అయిందో ఆ ఆత్మని పట్టుకోండి. ఆ స్థితిలో నిలబడండి. ఆ
(08:38) స్థితిలో నిలబడిన వాళ్ళని పెళ్లి చేసుకోండి. జీవితం బ్రహ్మాండంగా గడుస్తుంది నిజంగా చెప్తున్నా జీవితం గట్టిక్కిపోతుంది. కళ్ళు మూసి తెరిచే లోపల ముక్తిని చేరుకుంటావు నువ్వు కాబట్టి కచ్చితంగా పెళ్లి చేసుకోవాలి నేనే పెళ్లి చేసుకుంటున్నాను నేనే నా పెళ్లిని ఆపుకుంటున్నాను అనే భావనలో ఉన్న వాళ్ళు ఒక క్వాలిఫికేషన్ పెట్టుకోండి.
(09:02) ఆ స్థితికి దగ్గరగా ఉన్నవాళ్ళు ఆ స్థితిలో లేని వాళ్ళయినా సరే అంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోండి లేదు అంటే ఆ స్థితికి దగ్గరగా ఉన్నవాళ్ళని చేసుకోండి ఈ వ్యక్తి ఒక రామకృష్ణ మఠంలో ప్రతి రోజు కూడా భజనలకు హాజరవుతున్నాడురా ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉంటున్నాడు కాబట్టి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి లేదా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి వీడు దేహబ్రాంతిని తొందరగా పోగొట్టుకునే దశలో ఉన్నాడు కాబట్టి వీడిని పెళ్లి చేసుకుంటే జీవితం తొందరగా గట్టెక్కి పోతుంది అలాంటి వాడిని పెళ్లి చేసుకోండి కాబట్టి పెళ్లి అనేది ఒక మనిషిని ఊర్ద్వ స్థాయికి తీసుకెళ్తుంది అదో
(09:40) స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. అది ప్రారబ్ధమే కాకపోతే వీడు అలా అనుకుంటున్నాడు నేనే చేసుకుంటాను అన్నప్పుడు బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి. కాబట్టి నిజంగా ప్రారబ్ధం ప్రకారం జరుగుతుంది అనుకుంటే ఏ బాధలు కష్టాలు లేవు నేనే చేసుకుంటున్నాను నేనే ఈ పెళ్లి చేసుకున్నాను అనే భావనలో ఉంటే మాత్రం కచ్చితంగా ఇవన్నీ వస్తాయి.
(10:02) అయితే సాధారణంగా లోకంలో పెళ్లి అనేది ఎందుకు చేసుకుంటారండి? కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే పిల్లల కోసం లేదా ఒంటరితనం కోసం అంటే ఒంటరితనం కాస్త బలపడడం కోసం అంటే ఒంటరితనం పోయి నా యొక్క స్థితి బలపడాలి అనే ఒక భావన కోసం ఇలాంటి వాటి కోసం పెళ్లి చేసుకుంటారు. ఒక్క విషయం చెప్తానండి ఎప్పుడైనా పిల్లల కోసం పెళ్లి చేసుకునే వాళ్ళు నువ్వు పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటున్నావ్ ఈ సమాజానికి అందిస్తున్నావ్ ఈ సమాజంలో వాళ్ళని పెడుతున్నావ్ ఆ పిల్లలకు నువ్వు ఏం నేర్పిస్తావ్ నీకు ముక్తి అంటే ఏంటో తెలుసా నీకు వేదాలు అంటే ఏంటో తెలుసా వేదాల యొక్క సారం ఏంటో తెలుసా ఉపనిషత్తుల
(10:42) యొక్క సారం ఏంటో తెలుసా భగవద్గీత యొక్క సారం ఏంటో తెలుసా అసలు మనిషి యొక్క పుట్టిక ఎక్కడ మొదలైందో తెలుసా మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్ ఎక్కడ మొదలైందో తెలుసా అవి తెలియనప్పుడు అప్పుడు నువ్వు నీ పిల్లలకి ఏం చెప్తావ్ ఏబి సిడి లు టేబుల్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి కదా ఇంటర్నెట్ లో కూడా దొరుకుతాయి కదా ఫోన్ లో కూడా దొరుకుతాయి కదా పుస్తకాల్లో కూడా ఉంటాయి కదా నువ్వు ప్రత్యేకంగా ఏం చెప్తావ్ తల్లిదండ్రులుగా పిల్లల్ని నువ్వు బై ప్రొడక్ట్ గా ఈ ప్రపంచానికి అందించినప్పుడు వాళ్ళకి నువ్వు ఏం చెప్తున్నావ్ ఒక్క విషయం
(11:15) గుర్తుపెట్టుకోండి పిల్లల కోసం పెళ్లి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు మాకు పిల్లలు పుట్టిన తర్వాత కచ్చితంగా వాళ్ళకి ముక్తిని బోధిస్తామండి ముక్తి అంటే ఏంటో చెప్తాం వాళ్ళకు ముక్తి వచ్చిన తరువాతనే మేము ఈ లోకానికి వాళ్ళకి అంద చేస్తాం. అంతవరకు మేము మా ఇంట్లోనే పెట్టుకుంటాం వాళ్ళకి ముక్తి అంటే ఏంటో తెలిసిన తర్వాత వాళ్ళు ముక్తిని పొందాము అనే ఒక ఆ భావనని ఆ స్థితిని పొందాకే మేము వాళ్ళని ప్రపంచంలోకి వదులుతామండి అనే స్థితిలో ఉన్నవాళ్ళు మాత్రమే పిల్లల్ని కనాలి.
(11:47) మిగిలిన వాళ్ళు పిల్లల్ని కనకూడదు. ఒక జంతువు పిల్లల్ని కంటుంది ఒక మనిషి పిల్లల్ని కంటున్నాడు ఏమిటి ఆ తేడా మరి దానికి మనిషికి ఉన్న తేడా ఏంటి విచక్షనే కదా ఆ విచక్షణ నువ్వు దేనికోసం ఉపయోగిస్తున్నావ్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయడమా అదా తల్లిదండ్రుల బాధ్యత ఒక ఐఐటి లోనో ఎన్ఐటి లోనో సీట్ కొట్టి లక్షల ప్యాకేజీ సంపాదించడమా అదా తల్లిదండ్రులుగా నీ బాధ్యత ఏంటి నీ బాధ్యత వాడికి చెప్పు అరే నువ్వు నేను తయారు చేయలేదు మీ అమ్మ తయారు చేయలేదు నీకు నువ్వుగా తయారు అవ్వలేదు.
(12:28) జస్ట్ అది యాక్సిడెంటల్ గా జరిగింది అంతే నీకు పుట్టుగా లేదు నీకు మరణము లేదురా అని చిన్నప్పుడే పిల్లలతో చెప్పగలిగే తల్లిదండ్రులు ఉన్నవాళ్లే పెళ్లి చేసుకోవాలి ఆ స్థితిలో ఉన్నవాళ్లే పెళ్లి చేసుకోవాలి ఆ స్థితిలో ఉన్నవాళ్లే పిల్లల్ని కనాలి. కాబట్టి ఎప్పుడైనా పిల్లల కోసం పెళ్లి చేసుకుంటాం అన్నవాళ్ళు కచ్చితంగా మా పిల్లలకు ముక్తి అంటే ఏంటో చెప్తామండి ఆ స్థితిని మేము పొందామండి కాబట్టి ఇప్పుడు మేము పిల్లల్ని కంటాము అన్న భావనలో ఉన్నవాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకోవాలి.
(12:56) పిల్లల్ని కనాలి అంటే ముందు నువ్వు ముక్తిని పొంది ఉండాలి పొందిన తర్వాతే నువ్వు పిల్లల్ని కనాలి కచ్చితంగా జీవన్ ముక్తి పొందిన వాళ్లే పిల్లల్ని కనాలి అదర్వైస్ పిల్లల్ని కనకూడదు. ఎందుకు ఈ భూమి మీద ఇన్ని కోట్ల మంది ఉంటారు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి జరిగేదంతా ప్రారబ్ధమే కాదనట్లేదు కానీ నేను అనే భావనలో ఉన్నప్పుడు మరి ఎందుకు అలాంటి పనులలోకి రావడం అలాంటి ప్రపంచంలోకి ఎందుకు పిల్లల్ని ఎంటర్ చేయడం అలా కాదండి మేము ఒంటరిగా ఉండలేకపోతున్నాం ఈ ఒంటరితనాన్ని విడిపించుకోవడం కోసం పెళ్లి చేసుకుంటామండి అని అంటారా ఒక్కసారి పరిశీలన చేసుకోండి పిల్లల కోసం అన్నా సరే ఒంటరితనం కోసం అయినా సరే
(13:33) దేనికోసమైనా పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. అసలు ఒంటరిగా ఉంటున్నది ఎవరు 100 మందిలో నిలబడి ఉంటే సరిపోతుందా ఒంటరితనం పోతుందా ఒక వ్యక్తి జీవితాంతం పక్కనే ఉండి నాలుగు మాటలు చెప్తే ఒంటరితనం పోతుందా ఆ వ్యక్తి జీవితాంతం నా పక్కనే ఉంటాడని రాసి పెట్టి ఉందా ఒక్కసారి పరిశీలన చేసుకొని ఒంటరితనం నుండి బయటక వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోండి ఒంటరితనం పోవడానికి ఎప్పుడు పెళ్లి చేసుకోవద్దు ఒంటరితనం నుండి బయటక వచ్చి అప్పుడు పెళ్లి చేసుకోండి అప్పుడు మీకు ముక్తిని పొందుతారు పెళ్లి ద్వారా అసలు నిజంగా ఒక విషయం చెప్పమంటారా అసలు
(14:14) పెళ్లి అనేది శారీరక సుఖం కోసం చేసుకుంటారండి ఎందుకంటే మనకి పెళ్లి వివాహం కళ్యాణం అని మూడు ఉంటాయి. పెళ్లి అనేది పెళ్లి అనేది వేరు వివాహం అనేది వేరు కళ్యాణం అనేది వేరు ఒక్కొక్కటి ఒక్కొక్క స్థాయిలో ఉన్నవాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ మూడు కూడా ప్రారబ్ధం ప్రకారమే జరుగుతాయి. ఎలా అయితే ఒక మనిషిలో కాళ్ళు ఒక భాగం చేతిలో ఒక భాగం తల ఒక భాగం కానీ మూడిటిని అన్నిటిని కలిపే మనిషి అంటారు అలాగే పెళ్లి వివాహం కళ్యాణం మూడు కూడా ఒక మనిషి శరీరంలో భాగాలు వంటివి ఇవన్నీ కలిపితే అది ప్రారబ్ధం ఈ మూడు కూడా ప్రారబ్ధం ప్రకారమే జరుగుతుంటాయి అసలు పెళ్లి అంటే ఏంటి
(14:55) వివాహం అంటే ఏంటి కళ్యాణం అంటే ఏంటి అవి ఏ స్థితుల్లో ఉన్నవారు పెళ్లి ఆ యొక్క ఘటనకు ముందుకు వెళ్తారు అనేది కాసేపు తెలుసుకుందాం. పెళ్లి అనేది ఈ శరీరమే నేను ఈ మనసే నేను ఈ ఆలోచనలే నేను అనే ఒక భావనలో ఉండి ఒక స్థితిలో ఉండి శారీరక సుఖాల కోసం పిల్లల కోసం పెళ్లి చేసు కలిస్తే దాన్ని పెళ్లి అంటారు. అంటే ఈ శరీరమే నేను అనుకొని బ్రతుకుతూ ఈ ఆలోచనలు ఈ మనసే నేను అనుకొని బ్రతుకుతూ శారీరక సుఖాల కోసం ఎవరైతే కలుస్తారో దాన్ని పెళ్లి అంటారు.
(15:34) అలా కాకుండా ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు కానీ ఈ శారీరక సుఖాల కోసం ఒక వ్యక్తితో నేను కలుస్తాను అది కూడా ఒక కుటుంబ సభ్యుల మధ్యన ప్రతి ఒక్కరికి ఈ సమాజానికి తెలుస్తూ అందరికీ తెలియజేయపరుస్తూ నేను ఒక బంధంలోకి వెళ్తున్నాను అనే ఒక భావనలో చేసుకుంటే అది వివాహం అవుతుంది. అంటే ఒక లీగల్ గా అందరికీ తెలిసినట్టు చేసుకుంటే అది వివాహం అలా కాకుండా ఎవ్వరికీ తెలియకుండా చేసుకుంటే అది పెళ్లి అవుతుంది.
(16:10) ఇది పెళ్లికి వివాహానికి మధ్య ఉన్న తేడా ఇక కళ్యాణం అంటారా అసలు ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు ఈ ఆలోచన నేను కాదు అనే భావనలో నిరంతరం రమిస్తూ జరిగేది ఏదైనా సరే నేను అంగీకరిస్తాను అనే ఒక శరణాగతి స్థితిలో ఉండి ఎవరైనా వస్తే వాళ్ళని అంగీకరిస్తే అది కళ్యాణం అవుతుంది. రుక్మిణి కళ్యాణం సీతా కళ్యాణం బ్రహ్మం గారి కళ్యాణం సాధారణంగా ఆ స్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా జరిగేవి కళ్యాణాలు అందుకే అంటారు లోక కళ్యాణం కోసం చేసుకోవాలి ఎప్పుడైనా సరే నువ్వు ఎవరితోనైనా కలిస్తే అది లోక కళ్యాణం కోసం అయి ఉండాలి తప్ప నీ స్వార్థం కోసం అవ్వకూడదు.
(16:53) అది గుర్తుపెట్టుకోండి. ఇక అన్నిటికన్నా ఒక విషయం చెప్తానండి మనందరికీ కూడా జగద్గురువుగా మనందరం పిలుచుకునే శంకరాచార్యులు వారు ఒక మాట అంటారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జటరీ సైనం యహసంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే అంటారు. అంటే మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి వీటి కోసం కాదండి మనుష్య జన్మ ఎత్తేది అసలు శరీరమే తీసుకున్నటువంటి ఒక స్థాయికి వెళ్ళాలి ఒక స్థితికి వెళ్ళాలి అదే ముక్తి ఆ స్థితికి వెళ్ళడానికి మనిషి ప్రయత్నించాలి.
(17:32) ఆ స్థితికి వెళ్ళడానికి మనిషి పరిశీలన పరిశీలన చేయాలి. ఆ స్థితికి వెళ్ళడానికి మనిషి విచారణ చేయాలి. ఆ స్థితికి వెళ్ళడానికి ఆ ముక్తిని పొందడానికి మనిషి పెళ్లి చేసుకోవాలి. తప్ప శారీరక సుఖాల కోసం, పిల్లల కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, కొట్టుకోవడం కోసం, తిట్టుకోవడం కోసం, చంపుకోవడం కోసం ఈగోల కోసం, అహంకారాల కోసం, అహం కోసం ఏమాత్రం కాదు.
(17:54) పెళ్లి అనేది ముక్తి కోసం చేసుకోవాలి. కచ్చితంగా ఈరోజు నేను పెళ్లి చేసుకుంటున్నాను. విత ఇన్ టూ త్రీ ఇయర్స్ లో పిల్లల్ని కంటాను అనే ఒక క్లారిటీ ఎలా అయితే నీకు ఉందో అలాగే ఈరోజు నేను పెళ్లి చేసుకున్నాను కచ్చితంగా విత ఇన్ఫైవ్ టు 10 ఇయర్స్ లో నా భార్య నేను ముక్తిని పొందుతాం. ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు ఈ ఆలోచన నేను కాదు అనే స్థితిని పొంది ఇద్దరిలో ఉన్నది ఒక్కటే అన్న స్థితికి మేము చేరుకుంటాం అన్న వాళ్లే కచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అదర్వైస్ పెళ్లి చేసుకోకూడదు.
(18:21) అలాంటి వాళ్ళ వల్ల ఏ ఉపయోగం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఈ భూమికి ఏమాత్రం ఉపయోగం లేదు. వాళ్ళకి ఒక కుక్క పిల్ల ఒక కుక్క పిల్లలని కనడానికి వాళ్ళ పిల్లలని కనడానికి పెద్ద తేడా ఏమ లేదు నా దృష్టిలో మీరు తప్పుగా అనుకున్నా అనుకోకపోయినా నాకు నో ప్రాబ్లం ఎందుకంటే అది నిజం అది సత్యం కాబట్టి పెళ్లి అనేది ఒక పవిత్రత అని అంటారు కాదు పెళ్లి అనేది శారీరక సుఖం కోసం చేసుకునేది వివాహం అనేది సగం శారీరక సుఖం ఉంటుంది సగం ముక్తి ఉంటుంది.
(18:57) కళ్యాణం అనేది పూర్తిగా అక్కడ ముక్తి స్థితిలో ఉన్నవాళ్లే చేసుకుంటారు కాబట్టి పెళ్లి వివాహం ఎప్పుడూ చేసుకోవద్దు ఒకవేళ చేసుకున్న వీలైనంత వేగంగా ముక్తిని పొందే ప్రయత్నం చేయండి. జీవితాంతం కొట్టుకుంటూ తిట్టుకుంటూ గొడవలాడుకుంటూ బ్రతుకుతాను అని అనకండి అలా అనుకున్న వాళ్ళు వీలైనంత వేగంగా విడిపోండి విడాకులు తీసుకోండి నో ప్రాబ్లం ఒంటరిగా వచ్చావు ఒంటరిగా పోతావ్ ఒంటరిగా బ్రతకలేవా అసలు నిజంగా పెళ్లి అనేది ఒక్క మాట చెప్తానండి పెళ్లి అనేది ఎవరు చేసుకుంటారు అంటే నేను ఒంటరిగా బ్రతకలేను ఒంటరిగా నా పనులు నేను చేసుకోలేను నా బట్టలు నేను ఉతుక్కోలేను నా వంట నేను
(19:38) చేసుకోలేను నా ఆలోచనలు నా ఒక్కరిని నేను మొయలేను నా ఆలోచనలు నేను మొయలేను నా యొక్క కామాన్ని నాలో ఉన్న కామాన్ని నాలో ఉన్న క్రోధాన్ని నాలో ఉన్న బాధల్ని నేను మొయలేను నేను అర్థం చేసుకోలేను నేను చేతకాని వాడిని అనుకున్నవాడే పెళ్లి చేసుకుంటాడు అలా కాదు నాలో కలిగే ప్రతి ఆలోచనని ప్రతి కామాన్ని ప్రతి కోరికని ప్రతి బాధని నేను అర్థం చేసుకోగలను నా యొక్క ఆలోచనలో నాకు తెలుసు నా యొక్క మనసు ఏంటో నాకు తెలుసు నా యొక్క స్థితి ఏంటో నాకు తెలుసు వాడిని నేను అర్థం చేసుకోగలను అనుకున్న వాడు ఖచ్చితంగా వాడికి పెళ్లి చేసుకోడు.
(20:16) ఎందుకంటే వాడిలో ఉన్నది అవతల వాడిలో ఉన్నది ఒక్కటే నీకు నువ్వు ఎప్పుడైనా కౌగలించుకున్నావా నీకు నువ్వు ఎప్పుడైనా ముద్దు పెట్టుకున్నావా నీతో నువ్వు శృంగారం చేసుకోగలవా నీతో నువ్వు పిల్లల్ని కనగలవా ఆ ఒక్కటే అనే భావన ఉన్నప్పుడు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావ్ ఆ స్థితిలో వచ్చిన వాళ్ళకి కదా ఈరోజు సంతానం లేని వాళ్ళయినా సరే పెళ్లి చేసుకున్న కష్టాల్లో ఉన్నామ అనుకునే భావనలో ఉన్నవాళ్ళ అయినా సరే ఆ రమణాశ్రమానికి పరిగెడతారు రామకృష్ణ పరమహంస మటానికి పరిగెడతారు.
(20:42) ఒక పెళ్లి చేసుకున్నవాడు ఇంకో పెళ్లి చేసుకున్న వాడి దగ్గరికి వెళ్లి ఎప్పుడు సలహా తీసుకోడు ఒక సన్యాసి దగ్గరికి వెళ్లి ఎందుకు సలహా తీసుకుంటాడు ఎందుకంటే వాడిని వాడు తెలుసుకున్నాడు వాడిని వాడు ఎరిగాడు ఆ ఎరుగులో వాడు ఉన్నాడు అందుకు అతను మనక ఇచ్చే అతనికి మనం ఇచ్చే గౌరవం ఈ లోకం అతనికి ఇచ్చే గౌరవం అందుకు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకున్న వాడి దగ్గరికి వెళ్లి వాడి యొక్క కష్టాల్ని సుఖాలని చెప్తారు ఎందుకు ఒక్కసారి పరిశీలన చేయండి.
(21:07) ఒక పెళ్లి చేసుకున్నవాడు పెళ్లి చేసుకున్న వాడి కష్టాలని ఎలా తీరుస్తాడు ఎందుకంటే వాడికి తెలుసు ఇద్దరిలో ఉన్నది ఒక్కటే ఆ విషయం వీళ్ళకి చెప్తే వీళ్ళ మధ్యలో ఉన్న కష్టాలు పోతాయి అని ఈరోజు రోజుకి దాదాపు 10 మంది ఫోన్ చేస్తున్నారండి 10 మందిలో ఒక ఐదు నుండి ఆరుగురు మా సంసారంలో కాస్త బాధలు ఉన్నాయండి ఇబ్బందులు ఉన్నాయండి ఈగో ప్రాబ్లం అండి ఇవే ఉంటాయి నిజంగా పెళ్లయి 40 సంవత్సరాలు అయినా ఇంకా ఈగో ప్రాబ్లం తో బాధలు కషట కష్టాలు ఉన్నాయి అనుకుంటున్నావ అంటే ఏం సాధించినట్టు నువ్వు ఉద్యోగంలో చేరగానే వితిన్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లో ఒక ప్రమోషన్ పొందాలని అంత ఆతృతగా ఉంటావే జీతం
(21:46) పెరగాలనే అంత ఆతృతగా ఉంటావే బోనసులు రావాలని అంత ఆతృతగా ఉంటావే నా కూతురు నా కొడుకు వీలైనంత వేగంగా ఫస్ట్ ర్యాంక్ పొందాలి వీలైనంత వేగంగా స్కూల్లో కాలేజీలో టాప్ ర్యాంకులో నిలబడాలని అంత ఆశపడతావే మరి పెళ్లి చేసుకున్న భార్యతో భర్త భర్తతో భార్య ఇద్దరం ఒక్కటే అన్న స్థితికి చేరుకోవాలన్న చేరుకో నే స్థితికి రావడానికి మాత్రం అన్ని సంవత్సరాలు ఎందుకు వీలైనంత వేగంగా పొందలేవా ఆ స్థితిని ఎవరు చెప్పలేక లేకపోతే నువ్వు ఆలోచించక ఆలోచించుకోలేకపోతున్నావ్ ఒక్కసారి పరిశీలన చేసుకో మిత్రమా ప్రతిదాన్ని పరిశీలన చెయ్ నువ్వు టాయిలెట్ కి వెళ్ళే దగ్గర నుంచి నీకు హెయిర్ కట్
(22:25) చేసుకునే దగ్గర వరకు ప్రతిదాన్ని పరిశీలన చెయి జుత్తు నా అంతట నేను పెంచుకుంటున్నానా అది పెరుగుతుందా గోళ్ళు నా అంతట నేను పెంచుకుంటున్నానా అవి పెరుగుతున్నాయా పెళ్లి నాకు జరుగుతుందా అది నేను చేసుకుంటున్నానా ప్రతిదీ కూడా పరిశీలన చెయి ముక్తిని పొందు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా చేసుకోవడం లేదా ఇక్కడ అది కాదు ముఖ్యం ముక్తిని పొందుతున్నావా పొందట్లేదా అది పెళ్లి ద్వారా అయినా సరే ఉద్యోగం ద్వారా అయినా సరే వ్యాపారం ద్వారా అయినా సరే సంతానం ద్వారా అయినా సరే అది ముఖ్యం కాబట్టి ఈ భావోద్వేగమైన ఈ ప్రసంగం అనండి మాటల్ని అనండి దేన్నైనా అనండి పరిశీలన చేయండి
(23:05) దేన్నైనా సరే పెళ్లి చేసుకొని గొడవలు ఆడుతున్నారు అంటే మీ భార్యతో గాని భర్త భర్తతో గాని భార్య అసలు గొడవలు ఎవరు పడుతున్నారు అదే గొడవలు నిద్రలో ఎందుకు ఉండట్లేదు మెలుకోలో గొడవపడిన మాటలు నిద్రలో ఎందుకు ఉండట్లేదు అని ఒక ప్రశ్న వేసుకోండి పరిశీలన చేయండి మనఇద్దరిలో ఉన్నది ఒక్కటే అని గుర్తించండి ఇద్దరు చేతిలో చెయ్యి వేసుకొని నెలకొక్కసారి తిరుపతి అలిపిరి మెట్లెక్కండి మెట్టు మెట్టికి గోవిందా గోవిందా అంటూ అరచేతిలో చెయ్యి వేసుకొని చక్కగా నడవండి చాలదా ఈ జీవితానికి అది కదా సంసారం అంటే అది కదా సుఖం అంటే అది కదా సంతోషం అంటే అది కదా
(23:41) బ్రహ్మానందం అది కదా పరమానందం అది కదా ఆత్మానందం అందుకు కదా ఈ మనుష్య జన్మ కొట్టుకోవడానికి తిట్టుకోవడానిక ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడానిక అందుకా పెళ్లి చేసుకునేది కాబట్టి పెళ్లి అనేది ఒక ప్రారబ్ధం మీ చేతుల్లో అది లేదు ఒకవేళ మీ చేతుల్లో ఉంటే ఉంటే కచ్చితంగా నేనే చేసుకుంటున్నాను అని ఒక భావనలో మీరు ఉంటే వీలైనంత వేగంగా ఆ పెళ్లి ద్వారా ముక్తిని పొందే ప్రయత్నం చేయండి.
(24:12) నిజానికి అది అది తప్పు అది ప్రారబ్ధం ప్రకారమే జరుగుతుంది లేదు నేనే చేసుకుంటున్నాను అనే భావనలో మీరు ఉంటే మీదే రైట్ అని మీరు అనుకుంటే కచ్చితంగా వీలైనంత వేగంగా ముక్తిని పొందే ప్రయత్నం చేంది ఆ పెళ్లి ద్వారా సంతానం ద్వారా ఉద్యోగం ద్వారా భార్య ద్వారా భర్త ద్వారా ఆ స్థితికి అందరూ చేరుకుంటారని కోరుకుంటూ అందరూ పెళ్లిళ్లు వివాహాలు మానేసి కళ్యాణమే చేసుకుంటారని ఆ భావనలోకి అందరూ వెళ్తారు ఆ స్థితిలోకి అందరూ వెళ్తూ ఈ సమస్త ప్రపంచం కూడా సుఖసంత తో వర్గెల్లాలని కోరుకుంటూ అరుణాచల శివు ఇట్లు మీ అజ్జు బైపల్లి
No comments:
Post a Comment