వైద్య వృత్తిని వదిలేసి 144 దేశాలు తిరగడానికి కారణాలు ఇవే | Dr Newton Kondaveeti Latest Interview
Author Name:it's UTV Spiritual
Youtube Channel Url:https://www.youtube.com/@itsUTVSpiritualChannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=s3u-03w5haE
Transcript:
(00:03) సర్ ఒకటి విషయం అడగొచ్చా సార్ అడగండి మేడం మీరు మంచి డాక్టర్ సర్ ఆ ఎంబిబిఎస్ చదువుకున్నారు మంచి ట్రీట్మెంట్స్ అందిస్తారు సో మంచి జ్ఞానము ఇవే కాకుండా మనిషి యొక్క సైకాలజీని కూడా మీరు ఇట్టే పట్టేస్తారు. సో ఆ డాక్టర్ వృత్తిలో ఉంటూ ఒక హాస్పిటల్ పెద్దది పెట్టి పేషెంట్స్ ని చూస్తూ అట్లా రాణించొచ్చు కదా అవన్నీ వదిలేసి మీరు ధ్యానము శాఖహారము అలాగే ఒక సుప్రీమ్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ తర్వాత స్పిరిచువల్ వరల్డ్ అలాగే మీరు ఒక సైంటిఫిక్ గా మీరు ఎన్నో రీసెర్చ్ చేస్తూ యూనివర్సిటీని పెట్టారు.
(00:45) అందులో ఉన్న ఆంతర్యం నేను ఒక డాక్టర్ గా ఎంబిబిఎస్ అయిపోయిన తర్వాత కూడా నేను ఎండి కూడా చదువుకున్నాను ఎండి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ లో నేను హైదరాబాద్ లోనే ఇక్కడ ఎండి చేశాను నేను కానీ నాకు లోపల ఎప్పుడు కూడా నా మార్గము ఈ మార్గము ధ్యాన మార్గము ఈ ఆధ్యాత్మిక శాస్త్రము నేను అందరికీ తెలియచెప్పాలి అయితే ఒక స్టూడెంట్ మీలా లాగా ఇంకొకరికి ఇచ్చుటే వాళ్ళన్నా [నవ్వు] సో ఆ క్వెస్ట్ ఎప్పుడు ఉండింది.
(01:23) సో దానివలన నాకు ఎప్పుడూ కూడా డాక్టర్ గా ఆ వృత్తిలో ఉంటూ సేవలు అందించడానికి చాలా మంది డాక్టర్లు ఉన్నారు. మ్ కానీ ఒక డాక్టర్ గా చదివి నాకు మెడికల్ సైన్స్ తెలుసు స్పిరిచువల్ సైన్స్ నేను నేర్చుకున్నాను ధ్యాన సాధన చేశాను. నాకు ఈ రెండిటిని సమ్మిళితం చేయడం కూడా తెలుసు అందుకే సేవల్ని ఈ విధంగా అందించాలని నేను నేను అనుకున్నాను సంకల్పించాను.
(01:53) ఎందుకంటే ఎంతోమంది ఆ వృద్ధి చక్కగా చేస్తారు సర్జరీలు చేస్తారు లైఫ్ సేవ్ చేయగలరు క్రిటికల్ ఇల్నెస్సెస్ గాని లేకపోతే ఎమర్జెన్సీస్ క్యాజువాలిటీస్ వాళ్ళకి కచ్చితంగా సర్వీసెస్ కావాలి. వాళ్ళు చేస్తారు కానీ నేను చేయాల్సిన సేవ వేరేది నాకు ధ్యాన స్థితుల్లో నాకు అర్థమయింది. నాకు తృప్తిని ఇచ్చేది నా జీవిత ధ్యేయము నేను ఫాలో అయినప్పుడు మాత్రమే అని నేను అర్థం చేసుకున్నాను.
(02:22) నా జీవిత ధ్యేయము ఇదే ఈ మార్గంలో ఉంటూ ధ్యానము శాఖహారము మరి ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేను అందరికీ తెలియచెప్పాలి ఎంతమందికి వీలైతే అంతమందికి తెలియచెప్పాలి. ఏదైతే భారతదేశంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాలకి నిలయం మన భారతదేశం అలాంటి ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం మల్ల పునర్నిర్మించాలి ఆ పునర్వైభవం మన భారతదేశానికి తీసుకురావాలి అని ఈ క్వాంటం లైఫ్ యూనివర్సిటీ పెట్టడం కూడా నా జీవిత ధ్యాయంలో భాగమే దాని వలనే వైద్యవృత్తిని పక్కన పెట్టాను కానీ ఆ వైద్యశాస్త్రం అనేది ది నాలో బాగా
(03:09) జీర్ణించుకున్నాను నేర్చుకున్నది ఎప్పుడుకి వెళ్ళిపోదు ఆ జ్ఞానం ఎప్పుడూ ఉంటుంది. అది కూడా నాకు చాలా ఆ కొంతమంది కలిసినప్పుడు నాకు ఈ రోగం వచ్చింది ధ్యానంతో ఎలా తగ్గించుకోవచ్చు అది సైకోసమాటిక్ గా లేకపోతే ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అనేది మేము ఈజీగా నిర్ధారణ చేయగలుగుతాం. ఓకే ఎందుకంటే మాకు అనాటమీ తెలుసు ఫిజియాలజీ తెలుసు లోపల పెథాలజీలో తెలుసు ఏం జరుగుతుంది ఏం చేంజెస్ అయినాయి ఇవన్నీ తెలుసు ఫిజికల్ లెవెల్లో కానీ ఎనర్జీ లెవెల్లో ఆధ్యాత్మికంగా ఉండడం వలన ఎనర్జీ లెవెల్లో శక్తి క్షేత్రంలో వాళ్లో ఏ మార్పులు వచ్చాయి ఇవి కూడా మనం తెలుసుకోగలుగుతాం.
(03:50) ఇందాక మీరు చాలా చక్కగా చెప్పారు ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ గా ఉంటూనే కూడా మీరు ఒకవేళ మామూలు డాక్టర్ అయి ఉంటే 150 దేశాలు తిరిగేవారు కాదేమో కరెక్ట్ కరెక్ట్ ఎందుకంటే కేవలం ఒక ప్రాంతంలో ఒక హాస్పిటల్ కే పరిమితం అయ్యేవారు కానీ 150 దేశాలు తిరిగారు చెప్పారు అనింటే ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్ మీరు ఒక్కరే కాకుండా మీ సతీమణిగా డాక్టర్ లక్ష్మీ మేడంతో కలిసి మీరు ప్రయాణం చేస్తున్నారే ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్ సర్ ఈ అవకాశం మాకు ఇవ్వబడింది.
(04:22) మేము సంకల్పం చేశము ఇది ఆధ్యాత్మిక శాస్త్రం మన భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మొత్తం విశ్వవ్యాప్తం చేయాలి అని ఎప్పుడైతే సంకల్పించామో ఆ యూనివర్సే ఆ విశ్వము ప్రకృతినే అన్ని డోర్స్ ఓపెన్ చేసింది. భారతదేశంలో కూడా విస్తృతంగా పర్యటించాం మేము అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని గ్రామాలు సిటీస్ అన్ని తిరిగాం పవర్ స్పాట్స్ వెళ్ళాం ఎందుకంటే మన భారతదేశము అన్ని దేశాల కన్నా మాకు అన్ని దేశాలు తిరిగిన తర్వాత కూడా భారతదేశం ఎంత గొప్ప దేశమో ఎంత గొప్ప దేశమో మన భారతదేశంలో ఉన్నది ఎక్కడా లేదు ఈ ఆధ్యాత్మిక సంపద
(05:10) ఎక్కడ దొరకదు నాకున్న డౌట్ ఏంటంటే సార్ ఇప్పుడు ఋషులు మునులు కాలంలో వాళ్ళు నిలబడో కూర్చోనో ఏదో రకంగా భంగిమతోటి తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారం పొందారు. ప్రస్తుతం ఉన్న కాలంలో భగవంతు సాక్షాత్కారం పొందాలి అనిఅంటే నోములు, వ్రతాలు, పూజలు, ముడుపులు, మొక్కులు ఇవన్నీ సాధనాలుగా ఎంచుకుంటున్నారు. ఇవి ఎంతవరకు కరెక్ట్ అంటారు మామూలుగా ప్రారంభ దశలో అవన్నీ కరెక్టే ఆహ ప్రారంభ దశ ఇప్పుడు ఎల్కేజీలో ఉన్నప్పుడు మనం దేవతా విగ్రహము తర్వాత మంత్రాలు మన జపాలు లేకపోతే స్తోత్రాలు లేకపోతే మనం దీపారాధన దండాలు పెట్టడము మనం అన్నీ కూడా చేస్తాం
(05:58) అవన్నీ కరెక్ట్ ప్రారంభ దశ కానీ మనం ఆధ్యాత్మికతలో మనం ఎల్కేజీ లోనే ఎప్పుడు ఇప్పుడు ఉండం కిండర్ గార్డెన్ ఉన్నాయి ఉండం ఇప్పుడు అక్కడి నుంచి మన వేరే తరగతి మారుతాం కొంచెం మిడిల్ స్కూల్ హై స్కూల్ వచ్చినప్పుడు మనం పూజలు, నోములు, వ్రతాలు ముడుపులు ఇవన్నీ కూడా దాన్ని మించినటువంటి ఆ యొక్క ధ్యాన ధ్యానం గురించి మనకి పరిచయం అవుతుంది.
(06:27) ఆ ధ్యానం చేస్తామ అన్నమాట. అంటే అంతర్ముఖం కావడం అనేది మనకి తెలుస్తుంది. అంతవరకు ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం ప్రారంభం ప్రారంభ దశలో అవన్నీ కరెక్టే మేడం అందుకే చెప్పబడింది ఉత్తర రామాయణంలో కోటి పూజా సమ స్తోత్రం కోటి జప సమం జపం కోటి జప సమం ధ్యానం జ్ఞాన కోటి మనోదయం కోటి పూజలు స్తోత్రానికి కోటి స్తోత్రాలు జపానికి కోటి జపాలు ధ్యానానికి ధ్యాన ఞానకోటి మనోలయం ధ్యానంతో మరి ఈ మనసే లయం అయిపోతుంది మనసు లయం కావడమే కావాల్సింది
(07:13) ఈ పాత్ క్లియర్ గా చెప్పబడింది అన్నిటికంటే ఉత్తమోత్తమమైనది ఏంటి కానీ ప్రారంభంలో ఉండేవాళ్ళు చేయలేరు ఒక్కొక్కసారి ప్రారంభ దశలో ప్రారంభం వాళ్ళ తమోగుణం ఎక్కువ ఉంది. వాళ్ళు ఈ పూజలు వ్రతాలు ఇవన్నీ ఒకే అప్పుడు ఒకే కానీ ఎప్పటికీ ఒకే కాదు అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ స్తోత్రాలు విష్ణు నామ స్తోత్రము లలితా సహస్రనామ స్తోత్రాలు కొన్ని స్తోత్రాలు ఉంటాయి చేయాలి చేస్తారు తర్వాత జపాలు మంత్రం మంత్ర దీక్ష తీసుకుంటారు జపం చేస్తారు.
(07:49) అది అక్కడ ఆ స్థాయిలో అది కరెక్ట్ దాని తర్వాత నెక్స్ట్ స్థాయి ఈ అన్నిటికంటే అజప జపం అజప జపం అజప గాయత్రి అంటాం ఈ శ్వాసే ఈ శ్వాసే మహా మంత్రం అవుతుంది. హిమాలయ యోగులంతా ఈ శ్వాసలో ఉండే రహస్యాలన్నీ కనుక్కుంటారు ఈ శ్వాసే శక్తి ప్రాణశక్తి అంతా ఈ శ్వాసలోనే ఉంది. ఈ శ్వాసని ఆ ఈ విద్యని తెలుసుకుంటారు. ఓకే సో ఇది గ్రాడ్యువల్ ఎవల్యూషన్ ప్రోగ్రెషన్ అన్నమాట ఒక స్థితి నుంచి నెక్స్ట్ స్టేట్ కి అన్ని కరెక్టే మనం ఏమి ఈ డినై చేయడంనికి లేదు ఇది తప్పని కాదు ఏది తప్పు కాదు కానీ ఏ స్థాయిలో వాళ్ళకి ఆ స్థాయి
(08:35) ప్రారంభంలో వాళ్ళకి ప్రారంభం అడ్వాన్స్ మనం వెళ్ళిన తర్వాత ఈ ప్రారంభ స్థాయి మనకి ఇంకా అవసరం లేదు. మనం హై స్కూల్ జాయిన్ అయిన తర్వాత ఎల్కేజీ బుక్స్ మనం ఇంకా చదవం అప్పుడు ఇర్రెలవెంట్ అయిపోతుంది ఓన్లీ హై స్కూల్ సబ్జెక్ట్స్ మనం ఆ ఏ సాధనలు ఉంటాయో అవి నేర్చుకుంటాం చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
(09:06) ధన్యవాదాలు థాంక్యూ వీక్షించారు కదండీ ఇప్పటివరకు డాక్టర్ న్యూటన్ గారు చెప్పినట్టుగా సాధన అనేది చాలా ముఖ్యం. ఒక సాధన చేయటం ఒక మంచి పుస్తకాన్ని మీరు చదవటం ఒక మంచి స్నేహితులతోటి మీరు సంచారం చేయటం ఇటువంటి వాటి వల్ల మీలో ఉన్న నెగిటివిటీ అంతా వెళ్ళిపోయి ఒక చక్కటి పాజిటివిటీ తోటి మీ జీవితంలో మీరు అనుకున్న సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
(09:38) చాలా అంశాల గురించి చాలా విస్తారంగా చెప్పారు. మీరు మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ యు టీవీ నేను మీ డాక్టర్ శ్రృతి సైనింగ్ ఆఫ్ నమస్తే. [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment