*🌺 శ్రీరంగ మండపం 🌺*
వేంకటేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలోని తిరుమల కొండపై ఉన్న ఒక ముఖ్యమైన వైష్ణవ దేవాలయం. ఈ ఆలయం వెంకటాచలం యొక్క ఏడు కొండలలోని ఒక కొండపై భూమి నుండి సుమారు 853 మీటర్ల ఎత్తులో ఉన్నది. ఈ మందిరం దక్షిణ భారత దేశ మందిర నిర్మాణ పద్దతిలో ఆగమ శాన్తానునారంగా నిర్మించబడింది.
అనేకమైన పుణ్య పర్వతాలలోని వేంకట పర్వతం పైననే నారాయణుడు వేంకటేశ్వర స్వామిగా వెలిశాడు. తిరుమలలో వేంకటేశ్వర స్వామి వెలసినందున తిరుమల క్షేత్రమును కలియుగ వైకుంఠం అని అంటారు. తిరుమలపై నారాయణుడు స్వయంగా వెలశాడు. ఆ నారాయణుడినే వేంకటేశ్వరుడని, శ్రీనివాసుడని, సప్తగిరీశుడని, ఏడుకొండలవాడని, బాలాజీ అని, తిరుమలప్ప అని, తిరుమలేశుడని ఇలా ఎన్నెన్నో పేర్లతో పిలుస్తారు.
తిరుమలలో వెలసిన వేంకటేశ్వరస్వామిని మరియు తిరుపతిలోని గోవిందరాజ స్వామిని చోళ రాజులు, విజయనగర రాజులు, గద్వాల్ రాజులు, మైసూర్ రాజులు, పల్లవ రాజుల వంటి ఎందరో రాజులు మరియు రాణులు దర్శించి, సేవించి గోపురాలను మరియు మందిర నిర్మాణ-పునర్నిర్మాణ కార్యాలను చేయించారు. వారు భూములను దానం చేసి బంగారు ఆభరణాలను సమర్పించి ఎంతో సుకృతిని కూడా పొందిరి.
మహమ్మదీయుల దాడికి భయపడి 1320 నుండి 1360 వరకు శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవ విగ్రహాన్ని వేంకటేశ్వర స్వామి మందిరంలోనే ఉంచి పూజించారు. శ్రీరంగనాథ స్వామిని ఉంచి పూజించినందువలన ఈ మండపానికి “శ్రీరంగ మండపం” అని పేరు వచ్చింది. దీపావళి సమయంలో నెల రోజుల పాటు శ్రీవేంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ విగ్రహమైన శ్రీ మలయప్ప స్వామి శ్రీదేవి-భూదేవి సమేతంగా శ్రీరంగ మండపంలో ఉండి పూజలను స్వీకరిస్తారు. *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment