Tuesday, September 1, 2026

భర్త నుండి భార్య - భార్య నుండి భర్త కోరుకునే లక్షణాలు | Wife and Husband Relationship | Garikapati

భర్త నుండి భార్య - భార్య నుండి భర్త కోరుకునే లక్షణాలు | Wife and Husband Relationship | Garikapati

Author Name:Sri Garikipati Narasimha Rao Official

Youtube Channel Url:https://www.youtube.com/@Garikipati_Offl

Youtube Video URL:https://www.youtube.com/watch?v=p5hqpYrU9MU



Transcript:
(00:00) ఓం [సంగీతం] భర్తలు ఎలా ఉండాలో భార్యలు ఎలా ఉండాలో రెండు చెబుతా భార్య ఎటువంటి భర్తని కోరుకుంటుందండి పనుల యందు తోడు పట్టుదలకు పోడు పెళ్లి కాని వాళ్ళందరూ ఈ నిర్ణయం తీసుకోండి పెళ్లిఅయిన వాళ్ళందరూ ఇలా ఉండకపోతే ఉండే ప్రయత్నం చేయండి ఉంటే మీకు నమస్కారం ఒక స్త్రీ ఎటువంటి భర్తని కోరుతుంది అలాగే భర్త ఉంటున్నాడా పనుల యందు ందుతోడు పట్టుదలకు పోడు రక్షణమున హరుడు రాత్రిమరుడు రక్షణమున హరుడు రాత్రిమరుడు మనసునెరుగువాడు
(00:45) మాట తప్పనివాడు మనసు నెరుగువాడు మాట తప్పనివాడు భర్తయైన రమణి భాగ్యలక్ష్మి ఇది భార్య కోరుకునే లక్షణం పెళ్లి చూపుల్లో ఆడవాళ్ళు ఈ ప్రశ్న వేయండి నేను ఇంటి పనులు చేస్తాను నాకు నువ్వు సాయం చేస్తావా చేయాలండి పూర్వకాలం విధానం కాదు ఇక్కడ కాఫీ పెట్టాయి పట్టుకురా నలుగురు వస్తారో పోయినా ఉండయి అంటే ఉండేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ వాళ్ళు కూడా బాగా నేర్చుకున్నారు ఇంకా కళ్యాణ దుర్గంలో ఎలా ఉందో నాకు తెలియదు హైదరాబాద్లో అయితే ఎంతమందికి 20 మందికా సుగ్గి జొమాటో ఆర్డర్ పెట్టు అయిపోయింది అంతేలే లెక్క నన్ను అడుగుతాను అన్న అర్థాంగ అంటే అన్నం
(01:31) పెడుతుందా ఆర్డర్ పెడుతుందా ఆర్డర్ పెట్టడానికి అర్ధంగ ఎందుకంటే స్మార్ట్ ఫోన్ చాలు ఈ మాత్రానికి పెళ్లి ఎందుకండి ఇక్కడ నేను బిర్యానీ పెట్టుకుంటున్నాను నీకు స్మశానం పెట్టమంటావా ఇంతే ఇది సంసారమా ఇదే సంసారం అంటే అందుకే నాకు ఒళ్ళు మండి చెప్పి హైదరాబాదులో భార్యా భర్తలు కాపురం చేయట్లేదండి స్విగ్గి జొమాటోలు కాపురం చేస్తున్నాయి.
(01:55) ఇందు వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటారు మగపిల్లలు పొటాటో ఆడపిల్లలు టొమాటో అదే అడుగుతుంది ఇక్కడ చెప్పాను ఇంకా కాపురం ఎందుకండి హైదరాబాద్లో బ్రహ్మాండంగా నాలుగు కోట్లు ఉండేటువంటి అపార్ట్మెంట్ల సముదాయంలో నేను మొన్న ఎప్పుడో మాట్లాడడానికి వెళితే ఆ అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు నాకు ఒక మాట చెప్పాడు అయ్యా ఒక్క మాట చెప్పండి మీ మాట చెప్తే జనం వింటున్నారు ఏమిటయ్యా అంటే ఈ మధ్య కొత్తగా వంచే దంపతులు అడుగుతున్నారుట వాళ్ళ దగ్గర మాకు కిచెన్ వద్దని చెబుతున్నారుట నమఃశివాయ మేము బ్రహ్మాండమైన సామ్రాజ్యం వచ్చింది అసలు వంటశాల వద్దో ఎవడు ఉండుతాడో కాఫీ
(02:27) సీతం తెప్పించుకుంటాం ఆర్డర్ ఇస్తాం వంటశాల ఎందుకు అక్కడ కూడా ఓ బెడ్రూమ్ వేసేయండి అంతేలేక కిచెన్ వద్దు నాలుగు కోట్లు పెట్టుకుంటున్నారండి కిచెన్ వద్దని చెబుతున్నారండి ఏమైపోతుంది సార్ భవిష్యత్ భారతం మీలాంటి వాళ్ళు చెప్పండి అవునా నిజమా అన్నాను నేను మొన్న రైల్లో ఇంకో కొత్త మాట విన్నాను విచిత్రంగా ఇద్దరు ఆడపిల్లలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఒక అమ్మాయి రెండో అమ్మాయితో అంటుంది వాళ్ళది కంబైన్డ్ ఫ్యామిలీ కదా వాళ్ళది కంబైన్డ్ ఫ్యామిలీ కదా అంటే నాకు ఆనందం అయింది ఆ మాట కంబైన్డ్ ఫ్యామిలీ అంటే ఉమ్మడి కుటుంబం కదా అవునమ్మా ఎవరిదమ్మా
(02:58) కంబైన్డ్ ఫ్యామిలీ ఎంతమంది ఉంటారో అన్నాను నేను కంబైన్డ్ ఫ్యామిలీ అంటే అదేం లేదండి భార్య భర్త కలిసి ఉంటారు కదా అని చెప్పింది ఆవిడ నమఃశివాయ లోకంఅంతా మారిపోయింది భార్య భర్త కలిసి ఉంటే కంబైన్డ్ ఫ్యామిలీ ఏమిటండి అంటే అదే విచిత్రం ఇంక మళ్ళీ అమ్మ నాన్న ఉండం ఇదంతా ఎవడ కావాలి అసలు వాళ్ళద్దరూ కలిసి ఉంటే కంబైన్డ్ ఫ్యామిలీ అందుకని ఆ అమ్మాయి వాళ్ళది కంబైన్డ్ ఫ్యామిలీ ఏంటి ఎవరి గురించి చెబుతుందో వాళ్ళద్దరూ కలిసి ఉన్నారు అక్కడ ఎందుకంటే ఆ అమ్మాయి చదివే కాలేజీలో ఎక్కువ భాగం సింగిల్ పేరెంట్స్ అండి భార్య లేదా భర్త ఇది లోకం పరిస్థితి
(03:31) వీళ్ళఏం ఆశ్చర్యకరంగా లేదు ఇది అన్ని చోట్లకి వ్యాపిస్తుంది కుటుంబ అనుబంధాలు బాగులేకుండా మన దేశం బాగుండాలంటే బాగుండదండి ప్రభుత్వం వారు ఎన్ని పథకాలు ప్రకటించినా ఎంత సేవ చేసినా మన మనసులు బాగా లేకపోతే అన్ని నిర్వీర్యం అయిపోతాయండి అనుమానం వల్ల అన్ని దుర్వినియోగం అయిపోతాయి కచ్చితంగా బాగుండాలంటే ముందు మన మనసులు బాగుండాలి ప్రజలకి ఏ కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వాలు బాగుచేస్తాయి ండి భగవంతుడు ఎందుకు ఇచ్చాడో తెలియదమ్మా నాకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి మా మిత్రుడు అనుజుడు సామవేదం షర్ణముఖ శర్మ లాంటి విద్వాంసులకి ఒక ముగ్గురు నలుగురికి
(04:03) అవకాశం ఇచ్చాడమ్మ ఆంధ్రదేశంలో మీరు చెప్పండి మీరు చెప్పండి జనం వస్తున్నారని అందుకని మేము ఎంతో శ్రమిస్తున్నాం నేను నా సోదరులు తిరుగుతున్నాం తిరుగుతున్నాం శ్రమిస్తూ ఉన్నాం కచ్చితంగా దానికి ఫలితం ఎప్పుడు అంటే ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు ఆలోచించండి ఆలోచించండి మీకు నచ్చినవే ఆచరిం చండి నచ్చకపోతే వదిలేయండి నచ్చినవి ఆచరించినా కూడా మీ జీవితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కనీసం 90% బాగుంటుందండి అనుమానం ఏం లేదు ఇక్కడ 90% బాగుంటుంది.
(04:35) లోకానికి ఉపయోగపడిన మాట మేమఎందుకు చెబుతామఅండి మాకేం పని భర్త ఎలా ఉండాలి అంటే స్త్రీ ఎలా ఆశిస్తుందిఅంటే పనుల యందు తోడు ఆవిడ చేసే పనుల్లో కాస్త తోడుగా ఉండాలి అనుభవం మీద చెబుతున్నా మగాళ్ళు పెద్ద ఓ తోడు ఉండక్కల తొందర పెట్టకుండా దగ్గర ఉండి మెచ్చుకుంటూ ఉంటే అన్ని అయిపోతాయి అనుభవం మీద చెబుతున్నా కాఫీ పెట్టేటప్పుడు మనం అక్కడికి వెళ్ళామ అనుకోండి చెక్క కాఫీ బ్రహ్మాండంగా ఉంది కాఫీ బ్రహ్మాండంగా ఉంది అంటే చాలు బ్రహ్మాండం ఇంకా మనమేం పని చేయక్క మా ఆయన ఎంత మంచివాడో ఏమిచ్చినా తాగేస్తాడు అంటారు వెంటనే ఈ మాత్రం ప్రశంసక ఏమనా నెప్పే ఏమన్నాను ఆ రోజు తింటున్నాం కదా రోజు
(05:13) మెచ్చుకో రోజు తింటున్నావ్ రోజు మెచ్చుకో ఏమైంది ఇక్కడ పట్టుదలకు పోడు ఆడ మొగ ఇద్దర నేర్చుకోవలసింది దంపతుల మధ్యలో ఏది వచ్చినా సరే పట్టుదలకు పోవద్దండి కాపురం నిలబడడం మనకి ముఖ్యం ఇక్కడ మన మాట నెగ్గడం ముఖ్యం కాదండి ఇక్కడ అలా పట్టుదలకి మొగాడు పోవద్దు ఆడవాళ్ళు పోవద్దు రక్షణము నహరుడు రాత్రిమరుడు ముఖ్యంగా స్త్రీలు కోరుకునేది రక్షణ ఇవేళ ఇంత అభివృద్ధి చెందింది అనుకుంటున్న సమాజంలో స్త్రీలు కూడా బీటెక్లు ఎంటెక్లు చదువుతూ పోలీసుల్లో సైన్యాల్లో కూడా ఉన్న సమాజంలో ఇప్పటికీ ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయండి ఇప్పటికీ చిన్న పిల్లల మీద కూడా
(05:54) జరుగుతున్నాయే ఆడపిల్లల మీద మనం మనుషులమేనా స్త్రీ ముందు ఎంత ధైర్యంగా మాట్లాడినా ఇంట్లో భర్త ఉంటే తనకి తోడుగా ఉంటే ఆవిడ భావనే వేరుగా ఉంటుందండి ఆ రక్షణ కోరుకుంటుంది మొగాడు అంటే ఎలా ఉండాలి నీకు ఎందుకు నువ్వు కూర్చో నేను చూసుకుంటా అన్నట్టుగా ఉండాలి అంతే తప్ప అమ్మో వాళ్ళ ఎవరో వస్తారు నాకే భయం అంటే ఈవిడే భయపడితే ఆవిడ ఏం చేస్తుంది ఇక్కడ ఆవిడ వెళ్లి చూసుకుంటుంది నేను ఉన్నాను కదా నీకుఎందుకు తోలు తీసేస్తా వాడెవడు రావడానికి ఇక్కడ ఈ పౌరుషాలు రాయలసీమ నేర్పడం ఎందుకండి పౌరుషమే ఈ ప్రాంతంలో పుట్టింది అనుమానం ఏం లేదు ఇక్కడ పౌరుషం అంటేనే రాయలసీమ ఇతర
(06:31) ప్రాంతాల వారు రాయల సీమను చూసి పౌరుషం నేర్చుకోవాలి అందుకని పురుషులందర నీకుఎందుకు నువ్వు లోపల ఉండవు వంటపని చూసుకొని నేను చూసుకుంటే ఎవడు వస్తాడో ఎక్కడ అన్నట్టు ఉండాలి. అదే రక్షణ అంతేకాదు సరదాగా ఒక మాట చెబుతున్న అందరూ ఆడవాళ్ళు సంతోషించే మాట రాత్రి మరుడు కచ్చితంగా ఆనందంగా సరసంగా గడిపే సమయంలో మన్మధుడులా ఉండాలని అక్కడ విరక్తులు పనికి రావండి కచ్చితంగా వాళ్ళు సరసం కోరుకుంటారు సరదా కోరుకుంటారు చమత్కారం కోరుకుంటారు అలాగే మాట్లా ఎవడు ఆడతాడో సరసం అని అడకూడదు ఇక్కడ సరసం ఆడాలి లేకపోతే దానికోసం కోచింగ్ సెంటర్ కి వెళ్లి ఎమ్మ
(07:05) సరసం అని ఒక డిగ్రీ తెచ్చుకో నాలుగు చమత్కార పద్యాలు చదివితే నాలుగు అవధానాలు చూస్తే ముని మాణిక్య నరసింహరావు గారి కాంతం కథలు చదివితే గణపతి నవల చదివితే సరసం ఎలా ఆడాలో అర్థం అవుతుంది కచ్చితంగా ఇక్కడ దానికి వాళ్ళు పాల చాలా ఆనందిస్తారు అహంకారం ఏమ ఉండదండి సరసవాడే మొగుడితో భార్య ఎలా ఉంటుంది అంటే ఆయన సరసమే చాలు నన్ను మెచ్చుకున్నాడా అంతకంటే ఏమిటి ఇక్కడ ఏం కావాలి రామచంద్రమూర్తి ఉదాహరణ అండి అరణ్యవాసం చేస్తుంటే రాముడు సీత ఇద్దరూ కలిసి అక్కడ దగ్గరలో ఒక కొలను ఉంది అక్కడికి వెళ్ళారు విహరించడానికి అన్నమాట సరదా దాకి సరోవర తీరానికి వెడతారు
(07:41) కదా వెడుతుంటే అక్కడ తామరపూలు ఉన్నాయి వెంటనే సీతాదేవి అంది రామ నాకు ఆ తామరపూలు కావాలి తామరపూలు కావాలి వెంటనే రాముడు పంచ పైకి ఎగ్గట్టేసాడు అక్కడ కోదండ రామ కళ్యాణరామ అంటే కుదరదు ఇక్కడ తామరపూలు రామ అంతే లెక్క పంచ పైకి ఎగ్గట్టేసాడు నీకుఏంటి అడిగాక మళ్ళీ ఇక్కడ ఆగుతాం ఏంటి మొత్తం చేరంతా తెచ్చేస్తా చెరువంతా తెచ్చేస్తా అని దిగాడు ఈత కొట్టాడు శుభ్రంగా రెండే తామర పువ్వులు పట్టుకొచ్చాడు ఎక్కువ పూలు కోసి చెరువు పాడు చేయకూడదు రెండే ఎక్కువ పట్టుకురాల పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు ఆవిడ ఏం చేసిందో తెలుసా ఆవిడగానే రెండు బుగ్గల దగ్గరే పెట్టుకుంది ఇలా పెట్టుకుని
(08:18) ఆడవాళ్ళ ఫీలింగ్స్ గమనించండి చాలా సున్నితంగా ఉంటాయి తామరపూల కోసం రాముణని శ్రమపడడం ఆవిడకి ఇష్టం లేదు కానీ ఎందుకోసం అంటే ఆ రెండు తామరపూలు ఇలా బుగ్గల మీద పెట్టుకొని బాగున్నాయా బాగున్నాయా అంది అది గ్రహించాడు రాముడు బాగున్నాయా అంటే అర్థం తామరపూలు బాగున్నాయా అని కాదు బుగ్గలు బాగున్నాయా అని అర్థం [నవ్వు] ఈ మాత్రం స్పృహ లేకపోతే అన్న దండం అండగా తామరపూలు ఎవడికి కావాలండి ఇక్కడ అందుకని బాగున్నాయా బావుని గ్రహించాడు సరసుడైన రాముడు కాబట్టి శ్రీ మహావిష్ణువైన రాముడు కాబట్టి ఆయన ఏమన్నాడు అంటే ఏం బాగుంటాయి ఆ తామరపూలు నీ కపోలాల కంటే అందంగా ఉంటాయా
(08:57) సీత అన్నాడు అది సంసారం అంటే అది సంసారం అంటే నీ బుగ్గల కంటే తామరపూలు బాగుంటాయా అన్నాడు వెంటనే జై శ్రీరామ అంది అంతే సీతాదేవి మొగుడు అంటే అది అదే రాత్రి మరుడు సరదాగా మాట్లాడాలి సరసంగా ఉండాలి కొత్త చీర కట్టుకొని మన దగ్గర నిలబడతారు ఇడ్లీలు పెడతారు బాగుందా అంటారు ఇడ్లీ బాగుందా అని కాదు నాయనా వెర్రి ముఖమా చీర బాగుందా అని అర్థం అక్కడ ఇడ్లీ నీ ప్రారబ్ధాన్ని బట్టి ఉంటుంది.
(09:25) [నవ్వు] వంట ఎలా ఉంది అంటే తినేవాడ దంత రుచి అన్నారు తినేవాడ దంతవాసిని బట్టి ఉంటుంది మన యోగం బాగోకపోతే అది మాడిపోతుంది. ఇడ్లీ బాగుందా అని కాదు కొత్త చీర పోదపగే మాట్లాడ [నవ్వు] అంటారు సెకలిస్తారు వెంటనే చూసి బ్రహ్మాండంగా ఉంది ఏమపోతది ఏమేమ ఉండదు అలా కూర్చోవడమే అంతసేపు బయట తిరగడమే అంటారు ఇక్కడ బాగుందంటే నీ సొమం పోయింది ఇక్కడ ఇదే సరస దీనికి పెద్ద ఆకాశం దిగిరావాలా దీనికనా కోచింగ్ సెంటర్ ఉండాలా ఇంకో మాట మనసునెరుగువాడు వాళ్ళ మనసులో ఉండేటువంటి వాంచని వాళ్ళు చెప్పకుండా మనం గమనించాలి అబ్బో ఇది పెద్ద పరీక్ష బీటెక్ పాస్ అవ్వచ్చు ఎంటెక్ పాస్
(10:03) అవ్వచ్చు పిహెచ్డిలు యూనివర్సిటీలో జయించగానే స్త్రీ మనసులో ఏముందో దేవుడికి సాధ్యం కాదు మనక ఎక్కడ తెలుస్తుంది ఇక్కడ అది శాస్త్రాలు చెప్పేయి వాళ్ళు చెప్పరు పైకి అలా కూర్చుంటారు చెప్తారఏటి తెలుసుకోవాలి చెప్తారఏంటి తెలుసుకోవాలి ఏం తెలుసుకోమంటావ్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అంతే అది మనోమీడియం మెంటల్ మీడియం అంటారు దీన్ని ఆవిడ ఏమ దానికి రామచంద్రమూర్తి ఉదాహరణ పట్టాభిషేకం అని చెప్పారు ఇంకా కైక వరాలు కోరల పొద్దున్నే సీతాదేవి దగ్గరికి వచ్చాడు చెప్పాడు సీత రేపు నాకు పట్టాభిషేకం అంటే మా నాన్నగారు చెప్పారు వెంటనే ఆవిడ ఏమో తెలుస్త్రీ
(10:39) స్త్రీ అనండి ఆవిడకి పట్టాభిషేకం సింహాసనం అది అనవసరం ఏ చీర కట్టుకోవాలి అది లెక్క ఏ చీర కట్టుకోవాలి పట్టాభిషేకానికి ఆయన ఏం చేసింది ఓపి చీరలు మంచం మీద పరిచింది అక్కడ పెద్దఏదో బట్టల షాపు లాగా 10 చీరలు పరిచి రామ ఏం కట్టుకోమంటావ్ అని అడిగింది అక్కడఏదో భర్త ఆదేశం ప్రకారం నడుచుకున్నట్టు ఈయన చాలా తెలివైనవాడు ఓ చీర తీసి ఇది కట్టుకో అన్నాడు ఎందుకు ఏదో ఒకటి కట్టు కట్టుకోవచ్చు కదా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు చెప్పాలి సెలెక్షన్ చేయాలి కానీ ఎలా చేయాలి రామచంద్రమూర్తి నుంచి నేర్చుకోవాలి ఆయన చూసాడు ఓ చీర తీసాడు ఇది కట్టుకో అయ్యో ఓబోయ్ నీకు ఎలా తెలిసింది
(11:13) నాకేదే నచ్చింది అంది ఆవిడ ఎందుకు నచ్చిందమ్మా అది వాళ్ళ నాన్న జనక మహారాజు పెట్టిన చీర అది రహస్యం [నవ్వు] భర్త లక్ష రూపాయలు పెట్టి చీర కొన్నా సరే నచ్చుతుందో నచ్చదో చెప్పలేం తండ్రి వెయ్యి రూపాయలు కద్దర చీర పెట్ట సరే నచ్చుతుంది తండ్రి తండ్రే [నవ్వు] మా నాన్న మా నాన్న బోళ కష్టపడ్డాడు బోళ కష్టపడ్డాడు ఆయన పెట్టారు అది 1000 రూపాయలే కదా 1000 అయితే ఏంటి బోడు కష్టపడ అంతే లెక్క ఎంత దగ్గర బంధం ఉన్నా సరే భార్యా భర్తల బంధం కృత్రిమమే వినండి నన్ను మన్నించండి అది తల్లి పిల్ల బంధం కాదు అన్నా చెల్లి బంధం కాదు అన్నా తమ్ముడు బంధం కాదు అది
(11:58) కృత్రిమం పాతికేళ్ళు ఆవిడ ఎక్కడో పెరిగింది పాతికేళ్ళు మనం ఎక్కడో పెరిగాం ఇప్పుడు ఇంకా దారుణ 35 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకుంటున్నారు ఇక చేసిన ఒకటే చేసుకోపోయిన ఒకటే 35 ఏళ్ళు ఆవిడ ఎక్కడో పెరిగింది 35 ఏళ్ళు నువ్వు ఎక్కడో పెరిగావు ఓ నీకోసం నేను నాకు ఇవన్నీ సినిమా పాటలు బాగుంటాయమ్మా ఉండవు అక్కడ 35 ఏళ్ళు అక్కడ పెరిగారు పుట్టింటి మమ్మకారం ఉండదా వాళ్ళకి అన్నగారి మీద ఉండదా తండ్రి మీద ఉండదా ఉంటుంది దాన్ని గౌరవించాలి దాన్ని గౌరవించాలి అస్తమాన పుట్టి అంటే ఉంటుంది అది అందుకే ఆయన గౌరవానికి ఏం చేసాడు మీరు ఆన పెట్టాడుఅని చెప్ప ఆ చీర
(12:31) తీసి ఇచ్చాడు ఇచ్చి కట్టుకో అయబోయ్ నీకు ఎలా తెలిసింది అంటే అదే నీ అభిరుచి ఏమిటో నాకు తెలుసు అన్నాడు అప్పుడు తర్వాత రాముణని ఎవరో అడిగితే చెప్పాడు అదేమిటయ్యా అది ఎంపిక చేశవ అంటే నాకు తెలుసు ఇదో పెద్ద కోచింగ్ సెంటర్ ఇది నీకు తెలిీదు అది వాళ్ళ నాన్నగారు పెట్టారు అందుకే తీశను అన్నాడు ఆవిడ ఏం కట్టుకుంటే నాకే వాళ్ళ నాన్నగారు పెట్టింది కట్టుకోమంటే సంతోషిస్తుంది అంటే సంసారంలో సత్యభాషణం కాదండి సరస భాషణం ముఖ్యం అమ్మ అప్పుడు కచ్చితంగా జీవితాలు బాగుంటాయి కచ్చితంగా జీవితాలు పనుల యందు తోడు పట్టుదలకు పోడు రక్షణమున హరుడు రాత్రి వరుడు మనసునెరుగువాడు
(13:09) మాట తప్పనివాడు మనసునెరుగువాడు మాట తప్పనివాడు భర్తయైన పడతది భాగ్యలక్ష్మి ఇప్పుడు నాకు ఇద్దరు ఓట్లు కావాలి కాబట్టి భార్య ఎలా ఉండాలో కూడా చెబుతా మృత్యకటిక నాటకంలో శూద్రకుడు అనే మహాకవి రచించాడండి మృత్యకటికం సంస్కృతంలో అద్భుతమైన నాటకం మృత్ శకటికం మృత్ అంటే మట్టి శకటికం అంటే బండి మట్టి బండి అందులో మధ్యలో ప్రవేశిస్తుంది ఒక పాత్ర ఆ మట్టి బండి మీద బంగారపు నగలు పెడతారు అదంతా కథ ఆ సందర్భం వేరే ఆ మట్టి బండి రావడంతో మలుపు తిరిగిపోతుంది మొత్తం కథ అందుకనే శూద్రక మహాకవి దానికి మృత్యకటికం అని పేరు
(13:54) పెట్టాడు మట్టి బండి అని పేరు పెట్టాడు అందులో చారుదత్తుడు అని ఒక నాయకుడు ఆయన ఆగర్భ శ్రీమంతుడు కానీ దాన ధర్మాల కారణంగా అయితే దుబారా ఖర్చుల కారణంగా అయితే పేదవాడు అయిపోయాడు. భవనం మాత్రం అలాగే ఉంది. ఆ భవనంలో ఉన్న చారుదత్తుడికి మైత్రేయుడు అని ఒక మిత్రుడు ఉంటాడు దూతాంబ అనే భార్య ఆయన కొడుకు ఒకడు ఉన్నాడు రోహనుడు అది వేరే విషయం ఉన్నారు మైత్రేయుడని మిత్రుడు ఉంటాడు మైత్రేయుడు అంటాడు మిత్రమా ఆయన మిత్రుడు దారిద్రంలో కూడా ఆయన్ని విడిచిపెట్టాడు చాలామంది ధనవంతుల ఇళ్లకి పొద్దున్నే ఓ పాతిక మంది వచ్చేస్తూ ఉంటారు సైన్యం అధికారంలో
(14:32) ఉన్నవాళ్ళ వీళ్ళకి డబ్బు బాగా ఉన్నవాళ్ళ వీళ్ళకి ఓ పాతిక మంది వచ్చేస్తారు చచ్చిపోతూ ఉంటుంది ఇంట్లో ఇల్లాలి వీళ్ళందరికీ కాఫీ టిఫిన్లు పెట్టలేక ఎంతవరకు వస్తారండి అధికారంలో ఉన్నంతవరకే వస్తారు ఒక్కసారి ఆ పదవి నుంచి జారిపోయారంటే శ్రీమద్రమారమణ గోవిందో హరి ఒక్కడు ఉండట పలకరించేవాడు అదే గుర్తుపెట్టుకోవాలి అందరూ పెద్దలు డబ్బు ఉన్నవాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోవలసింది ఒకటే అధికారం ఉన్నా లేకపోయినా డబ్బు ఉన్నా లేకపోయినా ప్రేమాని ఇచ్చేటువంటిదే భార్య ప్రేమించేవాడే భర్త ఆ బంధం శాశ్వతం ఆ బంధం శాశ్వతం అందుకే భార్య ఎలా ఉండాలో జారుదో చెబుతాడు మైత్రేయుడు
(15:11) అడుగుతాడు ఏం మిత్రమా అంత స్థితిలో నిన్ను చూశాను ఊళలో అందరికీ దానధర్మాలు చేశవు ఇవాళ ఏమీ లేవు అయినా గాని నువ్వు ప్రశాంతంగా ఉన్నావు ఎలా ఉండగలుగుతున్నావు అంటే ఆయన చెబుతాడు నా భార్య ధూతాంబ కారణంగా నేను ఉండగలుగుతున్నానయ్యా విభవానుగతా భార్య సకు సుఖ దుఃఖ సమస్సు విభవానుగతా భార్య సుఖ దుఃఖ సమసువృతు సత్యంచ నపరిత్యక్తం సత్యంచ నపరిచక్తం యదరిద్రస్య దుర్లభం అంటాడు నా భార్య దూతాంబ నాకు కోట్ల రూపాయలు నా దగ్గర ఉన్నప్పుడు ఎలా నన్ను ప్రేమించిందో ఇప్పుడు అలాగే ప్రేమిస్తుందయ్యా నాకు అన్నం పట్టే సమయానికి ఆవిడకి అన్నం ఉందో లేదో
(15:55) చూసుకోకుండా నాకు పడుతుంది ఇక్కడ ఎవరైనా నా గురించి వస్తే నా దారిద్రం బయట పడకూడదని ఉన్నంతలో మంచి పంచే మంచి లాల్చే తీసి పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు మీకోసం ఇది వేసుకోండి నాకు అది వేసుకునేంత యోగ్యత లేదయ్యా ఏ పండగలకో వేసుకుందాం అనుకుంటే పర్వాలేదు ఎవరో వచ్చారు ఎందుకు వచ్చింది ఇది వేసుకోండి అని నా గౌరవాన్ని కాపాడుతుందయ్యా అలా విభవంలో ఉన్నా దారిద్రంలో ఉన్నా అనుసరించే భార్య ఉంటే అంతకంటే గొప్ప అదృష్టం ఉందా అంతే కాదు మన మిత్రులని కూడా మనం లెక్క పెట్టుకోవాలి ధనంజయే హాటకసం పరీక్షా సుహృదాం దారిద్రయ పరీక్ష అంటాడు బంగారానికి పరీక్ష ఏమిటో తెలుసా అగ్నిలో
(16:35) కాల్చాలి నిప్పుల్లో కాల్చాలి బంగార అప్పుడే అది సరైన బంగారమో కాదో తెలుస్తుంది మిత్రుడికి పరీక్ష ఏమిటో తెలుసా మనకి కష్టం వచ్చిన సమయం మన మిత్రుడికి పరీక్ష మన కష్టాల్లో కూడా ఏ మిత్రుడు తోడుగా ఉంటాడో వాడే నిజమైన మిత్రుడు మిగిలిన వాళ్ళంతా రుబ్బురోలు పత్రాల కింద లెక్క తీసి పారేయవలసింది. అధికారం ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు మనతో ఉండడం కాదు ఇక్కడ అందుకని మైత్రుడుతో అన్నాడు నా భార్య నాతో ఉందయ్యా ఆనందంగా ఉంటుందయ్యా నన్ను ఆనందంగా ఉంచుతుంది మైత్రయ నేను రూపాయి జీతం ఇయ్యకపోయినా నువ్వు నాతో మైత్రిగా ఉన్నావు సుఖ దుఃఖ సమస్సుకు ఐశ్వర్య ఉన్నా లేకపోయినా
(17:12) గౌరవించే భార్య సుఖాల్లో దుఃఖాల్లోన నాతో సమానంగా ఉండే మిత్రుడు ఉన్నాడయ్యా ఇంకోటి కూడా ఉంది మనం గుర్తుపెట్టుకోవాలి సత్యంచనపరిత్యక్తం ఇంత దారిద్రం వచ్చినా సరే నాకు అబద్ధం ఆడాలని అనిపి చట్లేదయ్యా సత్య హరిశ్చంద్రుడు ఎలా ఉన్నాడో నేను అలాగే ఉన్నాను ఇవి ఏ దరిద్రుడికైనా పడతాయా ఎప్పుడైతే భార్య అనుకూలంగా ఉందో మిత్రుడు మనతోనే ఉన్నాడో సత్యాన్ని ధర్మాన్ని మనం విడిచిపెట్టలేదో అప్పుడు మనం దరిద్రులం కాదండి మహా సంపన్నులం కింద లెక్క మహా సంపన్నులం కింద లెక్క అటువంటి ప్రేమించే లక్షణం భార్యకు ఉండాలండి అంటే ఆడపిల్లల తల్లులకి తండ్రులకి నమస్కారం పెట్టి
(17:51) కోరుతున్నానఅమ్మ ఆడపిల్లలకు ముందే చెప్పండి కాపురంలో డబ్బు పులకి ప్రాధాన్యం ఇయ్యద్దు ప్రేమకు ప్రాధాన్యం ఇయ్యాలి సత్యానికి ప్రాధాన్యం ఇయ్యాలి ధర్మానికి ప్రాధాన్యం ఇయ్యాలి సంస్కారానికి ప్రాధాన్యం ఇయ్యాలని ఆడపిల్లల తల్లులు ఎంతమంది ఉన్నారో అంతమంది చెప్పండమ్మ హిందూ ధర్మం అంటే ఇదే హిందూ ధర్మం అంటే అదే కచ్చితంగా కాపురాలు బాగుంటాయి.
(18:13) అలా చెప్పగలిగితేనే సంసారాలు పడ లేతే ఇవాళ పెళ్లి చూపులో అనగానే ప్యాకేజీ ఎంత ప్యాకేజీ ఎంత ఇంకొంచెం మంచి కంపెనీ చూసుకోపోయావా ఇంకొంచెం ప్రమోషన్ ఎందుకు రాలేదు ఈ మాటలేనండి ఎంతసేపు ఇక్కడ అసలు నీకు సంస్కారం ఉందా నువ్వు భార్యకు కట్టుబడి ఉంటావా నువ్వు భర్తకు కట్టుబడి ఉంటావా నీకు ఉన్నదానితో సంతృప్తిగా ఉందా అని అడిగే మాటలు లేవండి అందుకే కాపురాలు దెబ్బ తింటున్నాయి గమనించండి ఇక్కడ మావిడాకుల కంటే వీడాకులు ఎక్కువైపోతున్నాయండి కట్టే మావిడాకులు తక్కువ తీసుకునే వీడాకులు ఎక్కువ పైగా పెళ్లిళ్లక ఎంత ఖర్చు పెడుతున్నారండి ఒక్కొక్కరు కోట్లు ఖర్చు పెడుతున్నారు
(18:45) ఒక్కసారి ఆలోచించుకోండి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామో కోటికి ఒక్క సంవత్సరమైనా కాపురం చేయాలి కదండీ అన్ని కోట్లు ఖర్చు పెట్టాం కదా హైదరాబాద్లో అవితే అంతేనండి అనంతపురంలో ఇక్కడ కళ్యాణ దుర్గంలో పెళ్ళతే ఇక్కడ రిసెప్షన్ ఇస్తారు హైదరాబాద్లో ఓ రిసెప్షన్ ఇస్తారు ఇన్ని రిసెప్షన్లు అవసరమా అండి ఇంతా చేస్తే వాళ్ళు కలిసి ఉంటారని ఏమనా ఉందా ఇక్కడ మనకు అప్పులు అయిపోయాయి ఇక్కడ మన గొప్పలు చెప్పుకోవడం మిగిలింది ఇక్కడ అందుకని అనురాగమయమైన దాంపత్యం ఉండాలి తప్ప ఇంకో రక కమైన ఆలోచన రాకూడదు [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment