Tuesday, September 1, 2026

 *రక్షాబంధనం* 



కుటుంబ బంధాల్లో సోదరీ సోదరుల ప్రేమా నుబంధం ఎంతో గొప్పది. పది కాలాలపాటు నిలిచే ఈ బంధమే భారతీయ కుటుంబ వ్యవ స్థకు పునాది. ఆడపడుచు సర్వదా అన్నద మ్ముల క్షేమమే కోరుకుంటుంది. అందుకే ఈ రోజున వాళ్లకు రక్షాబంధనం కడుతుంది. నుదుట తిలకం దిద్ది, హారతిచ్చి, తీపి తినిపి స్తుంది. ఈ పండుగను గుజరాత్లో 'పవిత్రో పనాతిని' అని, పశ్చిమ్ బంగ, ఒడిశాలలో 'ఝులన్ పూర్ణిమ' అనీ పిలుస్తారు. గుజరాతీ బ్రాహ్మణులు తమ పోషకుల్ని దర్శించి, వారి ముంజేతికి రాఖీ కడతారు.

'రాఖీ' అంటే నూలు లేకపట్టుదారంతో తయారుచేసే తోరం. ముచ్చి బంగారం కొద్దిగా ఆ తోరానికి ముడివేస్తారు. 'ఓ రక్షా! దానవ ప్రభువైన బలి పూనుకొన్న దుష్కార్యాలను నేను నీయందు బంధిస్తు న్నాను' అని అర్ధంవచ్చే మంత్రం చదువు తారు. రక్షాబంధనం ముగిసిన తరవాత సోదరి సోదరుడికి పిండివంటలతో భోజనం వడ్డించి, సంతృప్తిగా భుజింపజేస్తుంది. సోద రుడు ఆ సందర్భంలో కానుకలిస్తాడు. అభి నందనలు తెలియజేస్తాడు.

పూర్వం దేవ దానవులకు యుద్ధం జరుగు తున్న సందర్భంలో శచీదేవి తన భర్త ఇంద్రు డికి విజయప్రాప్తి కోసం రక్ష కట్టినట్లు పురాణ కథనం. యమున తన సోదరుడైన యము డికి రాఖీ కట్టి, మృష్టాన్న భోజనం తినిపిం చగా, సంతోషించిన యముడు ఆ రోజున సోదరుడికి రాఖీ కట్టిన ప్రతి సోదరీ సకలశుభాలతో వర్ధిల్లుతుందని ఆశీర్వదించాడట. జన్మతఃతోబుట్టువులు కాకపోయినప్పటికీ సోదర వాత్సల్యానికి ప్రతీకగా యువతీ యువ కుల్లో ఈ రక్షాబంధనం అనే సంస్కారం నేటి సమాజంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. రాఖీ కట్టించుకున్న ప్రతి యువకుడు ఆ యువతిని సోదరిగా చూసుకుంటూ, ఎల్లవే ళలా ఏ ప్రమాదమూ వాటిల్లకుండా కాపాడ తానని ప్రతిజ్ఞ చేస్తాడు.

పితృవాక్య పాలన కోసం వనవాసానికి బయలుదేరిన శ్రీరాముడికి కౌసల్య రక్ష కడు తుంది. శ్రీమహాలక్ష్మి బలి చక్రవర్తికి రక్ష కట్టి, తన భర్తను రక్షించుకోగలిగిందని మరో పురాణ కథనం ఉంది. ద్రౌపదీ కృష్ణులు, యమున-యముడు, రుక్మి- రుక్మిణి, నిగమ శర్మ-అతడి సోదరి... వీరి సోదర వాత్సల్యం చిరస్మరణీయమైనది.

శత్రువులు తన దుర్గాన్ని ముట్టడించిన ప్పుడు, రాణి కర్ణావతి దిల్లీ పాదుషాకు రాఖీ పంపగా, ఆమెను సోదరిగా భావించి, శత్రువు లను తరిమికొట్టి, ఆమె ఇంట భోజనం చేసి, కానుకలు సమర్పించినట్లు చరిత్ర చెబుతోంది.

గ్రీకు వీరుడు అలెగ్జాండర్ భారతదేశం మీద దండెత్తినప్పుడు పురుషోత్తముణ్ని ఎదుర్కోవడం దుస్సాధ్యమని తెలుసుకున్న అతడి భార్య రుక్సానా మారువేషంలో వెళ్ళి పురుషోత్తముడికి రాఖీ కట్టి భర్తను కాపాడు కున్నదట. మహారాష్ట్ర, గోవా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 'అవని అవిట్టం' పేరుతో, ఉత్తరాఖండ్ లో 'జన్యోవున్యో' అన్న పేరుతో, ఛత్తీస్గఢ్, బిహార్ రాష్ట్రాల్లో 'కజారీ పూర్ణిమ' పేరుతో ఈ పండుగ జరుపుకొంటారు. పండితులు ఈ పర్వడిని విద్యారంభ దినంగా భావిస్తారు. ఈ రోజున యజ్ఞోపవీతాలు మార్చుకుంటారు. గాయత్రిని ఆరాధిస్తారు. పాల్కురికి సోమనాథుడు తన కావ్యం 'పండితారాధ్య చరిత్ర'లో శ్రావణ పూర్ణిమను 'నులిపున్నమి'గా పేర్కొన్నాడు.

కర్ణాటకలోని సముద్ర తీర వాసులు ఈ పండుగను 'నారికేళ పూర్ణిమ'గా పిలుస్తారు. ఉత్తర భారతంలో రాఖీని 'రబ్రీ' అని, 'సాలునో' అని పిలుస్తారు. సర్వ రోగోపశమ నానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు రక్షాబంధన విధి ఉపదేశించాడట. శ్రావణపౌర్ణమి నాడు చేసే వేద పఠనానికి ఎంతో ప్రాధాన్యం ఉందని చెబుతారు. భారతీయ కుటుంబ వ్యవ స్థలో మహిళా సంరక్షణకు సంబంధించిన మహత్తర సందేశమిస్తోంది రాఖీ పౌర్ణమి!

No comments:

Post a Comment