🌺 హరి 🌺
దేవుని ద్వారమున క్షణ కాలము నిలబడిన వారికి నాలుగు విధములైన ముక్తులు సాధ్యము కాగలవు. హరి అని నోటితో పలుకుము. హరి హరి అని పలికిన వారికి లభించిన పుణ్యము లెక్కించుట ఎవ్వరి తరము కాదు. సంసారములోనే ఉండి హరి ప్రాప్తికి మనసును త్వరపర్ప వలెనని వేదశాస్తాలన్ని సదా చేతులెత్తి ఘోషిస్తున్నాయి. ఇది వ్యాసుడు తెలిపిన మర్మము.
త్రివేణి సంగమములో స్నానము, నానా తీర్థాల భ్రమణము చేసినను చిత్తమందు శ్రీహరి భావము లేకపోతే అది వ్యర్థము.
నామస్మరణ చేయడానికి విన్ముఖము అయిన వాడు పాపాత్ముడు. ఈ పాపాత్ములను కూడా పరుగున వచ్చి రక్షించుట శ్రీహరికి తప్ప ఎవరికి సాధ్యము కాదు.
పురాణ ప్రసిద్ధుడైన వాల్మికి చెప్పుచున్నారు, నామ జపము చేసేవారు ముల్లోకాలలో ఉద్ధరించగలరని.
ప్రపంచము కోసం రాత్రి పగలు వృధా ప్రయాసము చేయుచున్నావు. ఏ గుణము ఆధారముగా హరి భజన చేయుట లేదు? (బలమా? ధనమా?).
హరి జపము చేయుట వలన భవబంధాలు తొలగి మాయ ప్రపంచపు పట్టు తెగిపోవునని జ్ఞాన దేవులు తెలిపినారు.
హరి భక్తి లేని వాడు పతితుడు, భక్తిహీనుడు హరి భజన చేసే భాగ్యము కోల్పోవును.
ఆత్మయే తరగని దైవనిధి. సర్వపుటములలో హరి ఒక్కడే క్రీడించుచున్నాడని జ్ఞాన దేవులు తన అనుభవమును తెలిపినారు.
No comments:
Post a Comment