Friday, September 18, 2026

భర్త మారకపోతే... భార్య ఏం చెయ్యాలి? If Husband Won't Change, What Should The Wife Do?

భర్త మారకపోతే... భార్య ఏం చెయ్యాలి? If Husband Won't Change, What Should The Wife Do?

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=edr0dTfZlgo





Title: భర్త మారకపోతే... భార్య ఏం చెయ్యాలి? If Husband Won't Change, What Should The Wife Do?

Author Name: maruthi kiran Poruri

Description: భర్త వున్నాడు... కానీ భర్తగా లేదు. ఆమె ఏం చెయ్యాలి?
భర్త మారడు. భార్య తన మనశ్శాంతిని ఎలా కాపాడుకోవాలి?
భర్త తప్పుకు భార్య ఎందుకు శిక్ష అనుభవించాలి?
ఆయన జీవితం ఆయనది. ఇక ఆమె జీవితం ఎవరిది?
ఇలా అనేక విషయాలకు సమాధానమే ఈ వీడియోలోని విషయం.
విని అందరికీ షేర్ చేయండి.

Transcript:
(00:01) చాలామంది భారతీయ స్త్రీలు ప్రస్తుత సమాజంలో 60 దాటిన తర్వాత ఆ మాటక వస్తే 50 దాటిన తర్వాత భర్తల చేతుల్లో మానసికంగా ఇబ్బంది పడుతున్నారండి అక్కడక్కడ కూడాను శారీరక హింసకు కూడాను గురైతున్నారు. అలా ఎందుకు జరుగుతున్నది అని నేను కూడాను ఆలోచించాను. పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లల్ని అన్నప్పుడు సంసార బాధ్యతలో ఉన్నప్పుడు అలాగే వాళ్ళని పిల్లల్ని ఒక క్రమంలో పైకి తీసుకొస్తున్నప్పుడు అంతగా విజ్రమించరండి ఆ తర్వాత విజ్రంభిస్తారు.
(00:43) ఎందుకంటే అప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు ఓ పక్క పిల్లలు ఉన్నారు ఓ పక్క సభ్య సమాజం ఉంది. కానీ 50 దాటిన తర్వాత 60 దాటిన తర్వాత ఏం జరుగుతున్నది అంటే వీళ్ళద్దరు ఒంటరిగా మిగిలిపోతారు కదా అందుకని అతనిలో ఉన్న ఆలోచనలు ఇక్కడ పొలి విప్పుకుంటున్నాయండి. అందుకని చాలా చోట్ల స్త్రీలు ఈ పురుషుల చేతుల్లో బలైపోతున్నారు చెప్పాను కదా మానసికంగా శారీరకంగా అని అయితే ఇక్కడ విషయం స్త్రీల యొక్క వేదన గురించి అండి నాకు ఫోన్ వచ్చింది ఆమె నాకు ఎన్నో విషయాలు చెప్పింది.
(01:28) నేను కూడా ఆలోచించి నాకు తోచినంత గా నేను ఆమెకి మాట సహాయం చేయగలిగాను అనుకోండి అదే ఈ వీడియోలోని విషయం అన్నమాట. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ వీడియో ఇలాంటి అభాగ్యులైన స్త్రీలకి అంకితం అని చెప్పొచ్చు. పురుషులుగా ఇక్కడ కొంతమందికి అనుమానం వస్తుందండి కిరణ గారు మరి మా సంగతి ఏంటి మేము కూడాను స్థిర చేతుల్లో నానా రకాలుగా మానసికంగా ఇబ్బంది పడుతున్నాం కదా అని నిజమేనండి ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి కానీ అవకాశం వచ్చినప్పుడు ఆలోచనలు వచ్చినప్పుడు తప్పకుండా వీటి మీద కూడాను నేను వీడియో చేస్తానండి.
(02:10) అయితే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ వీడియోలోని విషయం ఏంటంటే ఒక స్త్రీ నిజంగా ఎవరు ఊహించినంత అనాదరానికి గురైిందండి నేను నోట్స్ రాసుకున్నాను ఎందుకంటే విషయ గంభీరత అలాగ ఉందండి అందువల్ల నేను చదివేస్తాను మీరు మటుకు హాయిగా వినండి అంతేనండి ఒక 59 ఏళ్ల స్త్రీ నాకు ఫోన్ చేసింది. భయభయంగా మీతో కాసేపు మాట్లాడాలి సార్ అంది చెప్పమ్మా అన్నాను ఆమె చెప్పడం ప్రారంభించింది సార్
(02:54) నాది పల్లెటూరి బాల్యం 19 వేటనే పెళ్లిఅయింది. అమాయకపు వయసు అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉందని పెళ్లి చేశారు. భర్తది కానిస్టేబుల్ ఉద్యోగం పెళ్లయిన మూడవ రోజే తెలిసింది ఆయనకు వివాహతర సంబంధాలు ఉన్నాయని కేసు విషయాల్లో మాటలతో భయపెట్టి గాని హోదాను చూపించి గాని మాయమాటలు చెప్పి గాని లేదు ఒంటరిగా జీవిస్తున్న స్త్రీలకు సహాయం చేస్తూ గాని వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు సార్ అదో అలవాటు బలహీనత నాయనకు ఎన్నో సార్లు గొడవపడ్డాను ఉపయోగ లేకపోయింది అందండి
(03:38) ఇవాళ చెప్పుకపోతూ ఉంటే మధ్య మధ్యలో నేను మరి ఆకోవాల్సి వస్తుంది కదా నేను ఏమన్నానఅంటే అప్పుడప్పుడు ఏమన్నా కొడుతూ ఉంటాడా అన్నానండి అదేం లేదు సార్ నేను ఇంతే నువ్వు సర్దుకు పోవాలి అంటాడు అని అంతే ఇంట్లో జరుగుబాటు ఎలా ఉంటుంది తల్లి అని అడిగాను అన్ని ఏర్పాటు చేస్తాడు సార్ చేతికి మటుకు డబ్బులు ఇవ్వడు ఇచ్చిన ఇంట్లో తప్పు తప్పనిసరి ఖర్చులకు మాత్రమే ఇస్తాడు అంది మరి మీకు ఇప్పుడు 59 ఏళ్ళు కదమ్మా పిల్లల సంగతి ఏంటి అని అడిగాను.
(04:14) ఇద్దరు పిల్లలు సార్ పెళ్లిళ్లు అయ్యాయి కానీ పెద్దల్లుడు నా భర్త అలవాట్లను చూసి అమ్మాయితో విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి హైదరాబాద్లో ఓ చిన్న కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నది. ఒక్కటే చిన్న అకామిడేషన్ లో ఉంటున్నది సార్ చిన్నమ్మాయి సార్ సంసారం పర్వాలేదు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరి పెద్దమ్మాయి దగ్గరికి వెళ్ళవస్తుంటారా మీరు అని అడిగితే వెళ్ళవస్తుంటాను సార్ అవి ఇవి చేసి పెట్టి వస్తూ ఉంటాను.
(04:46) [గురకలు] పెద్దమ్మాయి అయితే జీవితంలో పెళ్లి చేసుకోను అని కరాకండిగా చెప్పేసింది సార్ నేను బాగా స్థిరపడాలి ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అంది. ఆమె మాటలో స్థిరత్వాన్ని చూసి నేను సరే అన్నాను. మరి మీ భర్త అమ్మాయి దగ్గరికో హైదరాబాద్ కి వెళ్ళవస్తుంటాడా అని అడిగారు వెళ్ళాడు సార్ ఎందుకంటే తండ్రి మీద అమ్మాయికి మనసు విరిగిపోయింది.
(05:10) నా దగ్గరికి రాకు నాన్న నా గురించి ఆలోచించుకో అని తెగేసి చెప్పేసింది అంది మరి అమ్మాయి ఏమన్నా డబ్బులు పంపిస్తూ ఉంటుందా అమ్మా మీకు అని అడిగారు పంపిస్తాను అంది సార్ నేనే వద్దంటే వద్దుఅన్నాను దాచుకోమన్నాను సరే అంది కానీ అమ్మ నీకు ఇబ్బంది అయితే మటకు నాకు చెప్పు అంది సరే అన్నాను సార్ కానీ ఇంతవరకు నేను ఒక్క పైసా కూడా అడగలేదు ఎందుకంటే జరిగిపోతుంది నాకు అందండి నిర్వేదంగా హైదరాబాద్కి రానున్న చార్జీలు పట్టుకొని అమ్మాయి పెట్టుకుంటుంది సార్ అంతే నేను అమ్మ మీ సమస్యపై అవగాహన అయితే ఇచ్చావు కొంచెం సూటిగా వివరంగా మీ బాధ
(05:59) ఏంటో చెప్పండి అన్నాను అని మళ్ళీ ఇలా చెప్పడం ప్రారంభించింది. మా ఆయన ఇప్పుడు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సార్ హోదా పెరిగింది ప్రమోషన్ వల్ల ఇంకా ఐదారఏళ్ళ సర్వీస్ ఉంది. ఆయన తల అలవాట్లను మార్చుకునే స్థితిలో లేడు. పైపెచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది సార్ ఇంకొక ఆమెతో వేరే ఊళలో ఎప్పటి నుంచో ఉంటున్నాడని ఇతని ద్వారా ఆమెకి 19 ఏళ్ల అమ్మాయి ఉంది ఇంజనీరింగ్ చదువుతున్నది జాబ్ రాంగానే పెళ్లి చేసే ఉద్దేశంతో కూడా ఉన్నాడు సార్ అని ఇలా అంటూనే ఆమె ఇంకా ఇలా చెప్పిందండి నాకు సమాజంలో బంధువుల మధ్య కూడా నువ్వు విలువ పోయింది సార్ నువ్వు సరిగా
(06:40) చూసుకోలేకపోయావు నీ భర్తను అంటూ కొంతమంది తప్పు పడుతున్నారు ఎంతకాలం ఇలా నా భర్తను భరించను సార్ 59 ఏళ్ల వయసులో ఏం చేయాలో అర్థం కావట్లేదు అంది అమ్మ మీ ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉంటాడా మీ దగ్గరికి అని అడిగితే ఎప్పుడో బుద్ధి కొట్టినప్పుడు వచ్చిపోతూ ఉంటాడు సార్ అంది సో ఇదండి ఆమె పరిస్థితి ఆర్థిక పరిపుష్టి లేదు పెద్ద వయసు నేను మారను అంటున్న భర్త కేసులు వేసుకొని స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగలేని పరిస్థితి గుడ్డిలో మెల్ల ఏంటంటే జరుగుబాటు అయితే ఉంది భోజనానికి
(07:25) ఇబ్బంది లేదు. నివాసానికి ఇబ్బంది లేదు. భర్త అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. ఇంకో పక్క పెద్దమ్మాయి ఆలంబనగా ఉన్నా అమ్మాయి జీవితంలో సంతృప్తిగా సెటిల్ అయితే చాలు అన్న ఆరాటం ఈ తల్లిలో ఉంది. వెరసి ఇదండి ఆ మహా తల్లి పరిస్థితి నన్ను సలహా అడిగింది. సమస్య గంభీరమే కాబట్టి అమ్మ ఎల్లుండి ఫోన్ చెయ్ ఆలోచించి చెప్తాను అన్నాను సరేనండి ఇదండి జరిగిన సంగతి నేను తీవ్రంగా ఆలోచించాను వాళ్ళఇద్దరు సైకాలజిస్టులతో సంప్రదించాను ఇంటర్నెట్ సహాయం కూడా
(08:11) తీసుకున్నాను. మొత్తానికి ఒక కంక్లూషన్ కి వచ్చానండి నాకు అనిపించింది ఏంటంటే భర్తని ఎటు మార్చలేము కొన్నేళ్లుగా ఆయనకి రకరకాల స్త్రీలతో సంపర్కాలు ఉన్నాయి. చేయగలిగింది ఏమన్నా ఉంది అంటే ఆమె మిగిలిన జీవితాన్ని ఆమెకు తిరిగివ్వటం ఆమె హుందాల జీవించేట్టు చేయటం 40 సంవత్సరాలు ఒకే విధమైన బాధను భరిస్తూ వచ్చిన 59 ఏళ్ల స్త్రీకి ఇంకా ఓపిక పట్టండి అని చెప్పడం కూడాను సరైన సలహ కాదు వెంటనే కేసు పెట్టండి విడాకులు తీసుకోండి అనే పరిస్థితి అసలు లేనేలేదు ఇది ఇలా ఉండగా
(08:56) అనుకున్నట్టుగా ఆమె ఫోన్ చేసింది మొట్టమొదటిగా నేను చెప్పింది ఏంటంటే అమ్మ నీ భర్త చేస్తున్న తప్పుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో బాధ్యులు కారు ఎవరైనా నువ్వు నీ భర్తను సరిగ్గా చూసుకోలేకపోయావు అన్న వారిని కూడా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వివాహానికి ముందు నుంచి ఆయనకి పరస్త్రి సాంగత్యం ఉంది. అమ్మ మీ భర్త ప్రవర్తన అనేది ఆయన వ్యక్తిగతం దాని భారాన్ని మీ తలపై వేసుకోవద్దు.
(09:34) అసలు ఆ బరువు భారం మీది కాదు వాటికి మీకు ఏ సంబంధం లేదు. ముందు ఈ నమ్మకానికి రండి. ఇలా చెబుతూ ఇంకా చెప్పానండి స్త్రీగా ముఖ్యంగా భారతీయ స్త్రీగా మీకు ఇతను నా భర్త నా జీవిత భాగస్వామి నాతో ఉండాలి నన్ను గౌరవించాలి నన్ను ప్రేమించాలి అనుకోవటంలో తప్పులేదు. కానీ గత నాలుగు దశాబ్దాలుగా అతని ప్రవర్తన మీ ఆలోచనకు విరుద్ధంగా ఉంది.
(10:05) వాస్తవ మనిషి ఒకరైతే మీ మనసులో భర్త అనే రూపం మరొకటి ఈ రెండింటికి పొంతలు లేదు తల్లి ఆయన మీ భర్త అనే చట్టపరమైన సంబంధం ఉండవచ్చు కుటుంబ సంబంధం ఉండవచ్చు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మీ ప్రస్తుత జీవితానికి భావి జీవితానికి కేంద్ర బిందువుగా ఉండన అవసరం లేదు అని చెప్పానండి ఇంకా ఏమన్నానంటే మీ మీద ఎక్కడో ఇంకా ఇంకని ప్రేమ గౌరవం ఉన్నాయమ్మా ఆయనకి అందుకనే మీ జరుగుబాటుకు ఏర్పాటు చేస్తున్నాడు అప్పుడప్పుడు ఎప్పుడు వచ్చిపోతున్నాడు.
(10:41) అంత మాత్రాన ఆయనను మీ మనోవేదనకి మందుగా భావించక్కర్లేదు. అమ్మ నేను పదాల్ని కొంచెం జాగ్రత్తగా వాడుతున్నాను గమనించు తల్లి ఇంకో విషయం మీరు ఆయన్ని ద్వేషించడం వల్ల ఆయనలో మార్పు రాదు. బాధపడాల్సింది మటుకు మీరే ఆయన చట్టపరంగా సమాజపరంగా భర్త ఒప్పుకోవాలి. ఎందుకంటే మీరు సమాజంలో ఒక భాగమే సమాజం నుంచి వెలివేయబడ్డవారు కారు మీరు ముఖ్యంగా మీ మనశశాంతికి ఆయన యజమాని కాడు అసలు మీ అనుమతి లేకుండా మీ మనశశాంతిని మీ నుంచి ఎవరు దూరం చేయలేరు.
(11:24) గత 40 ఏళ్లుగా మీరు చేస్తున్న నైతిక మానసిక యుద్ధం చాలా గొప్పది. నిజంగా చెప్పాలి అంటే మీరు గొప్ప శక్తి అమ్మ ఇది మీకు తెలియటం లేదు మీరు దాన్ని గమనించాలి. ఆయన మీ జీవితంలో ఒక చిన్న సంబంధం మాత్రమే తప్ప మీ జీవితం మొత్తం కాదు మీ జీవితం మీది ఎప్పటికీ మీదే అతను ఎక్కడున్నాడు ఎవరితో ఉన్నాడు ఎవరికి ఫోన్ చేస్తున్నాడు ఎప్పుడు వస్తాడు ఆ స్త్రీ దగ్గర ఎంతసేపు ఉంటున్నాడు వీటన్నిటిని మీరు తలచుకుంటూ ఉంటే నిమిషానికి 60 సెకండ్ల అద్భుతమైన జీవితాన్ని ఆనందాన్ని మీరు కోల్పోతున్నారని అర్థం ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ ఆలోచనలు మీ జీవితాంతం మిమ్మల్ని కాల్చకూడదు.
(12:09) ఆయన ప్రవర్తన మీరు నియంత్రించలేరు కానీ ఆయన ప్రవర్తనకు మీ మనసులో ఎంత స్థలం ఇవ్వాలో మీరు నిర్ణయించుకునే అధికారం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఇదే మీ అసలు స్వేచ్ఛ. ఇదే మీ అసలు స్వాతంత్రం మీకు ఎంత ఆర్థికంగా ఉపయోగపడుతున్నా ఆయన చేసేది ముమ్మాడికి తప్పే సభ్య సమాజం ఎప్పటికీ హర్షించదు ఆ డబ్బు కోసం మీ మనశశాంతిని ప్రతిరోజు ఆయన అనైతిక ప్రవర్తనకు తాకట్టు పెట్టకండి అసలు మీ జీవితాన్ని ఇంకో అనైతికత స్త్రీతో పోటిగా మార్చుకోవద్దు పోల్చుకోవద్దు గెలవాల్సింది మీరు మీరు మీ శత్రువు
(12:54) గురించి పదే పదే ఆలోచిస్తున్నారంటే మీరు మీ భర్త చేతిలో ఆ పరాయి స్త్రీ చేతిలో ఓడిపోతున్నట్టే లెక్క ఆ అవసరం మీకు లేదు ఆమె ఆయన దృష్టిలో అందంగా ఉందేమో కానీ హృదయ సౌందర్యం ఔన్నత్యం ముందు ఆ స్త్రీ మీ కాలిగోటికి కూడా నువ్వు సరిపోదమ్మా మిమ్మల్ని పొగడాలని కాదు ఒక అనైతిక స్త్రీతో అది ఇంకోసాటి స్త్రీ ఇబ్బంది పడుతున్నది అన్న స్పృహ లేని స్త్రీతో మిమ్మల్ని పోల్చడం నాకు ఇష్టం లేదు.
(13:28) నేను ఎన్ని చెప్పినా నీ మనసులో అట్టడుగున ఓ అనుమానం మెరమెరలాడుతూనే ఉంటుందమ్మా నాకు తెలుసు అదేంటంటే అయితే భర్తని పూర్తిగా పట్టించుకోకుండా ఉండాలా అని కానీ కాదమ్మా ఆయనపై మీకు ఓ తెలియని బాధ్యత ఉంది అదే మానవత దృక్పదం నైతిక కోణం ఆయన అనారోగ్యంతో లేవలేని పరిస్థితిలో ఉంటే స్త్రీగా మీలో అట్టడుగు పొరలో ఉన్న మానవత్వం బయటక వస్తుంది.
(14:00) ఈ మానవత్వమే మిమ్మల్ని 40 ఏళ్ల బాధను పంటి బిగువున పట్టి పెట్టేట్టు చేసింది. మనస్ఫూర్తిగా చెప్పాలి అంటే మీరు అసలు శిసలైన భారత స్త్రీ అమ్మ. అమ్మ అభిమానంగా ఇంకో మాట చెప్తున్నాను. మీరు ఈ విషయాలని పదే పదే తెలుసుకొని మీ శారీరక ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేస్తే రేపు మీ జీవితం మరింత ఇబ్బందికి గురవుతుంది.
(14:36) ఎందుకైనా మంచిది ఈసారి మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని పరీక్షలు చేయించుకోండి అప్పుడు మీ ఆరోగ్యం మీద మీకు ఒక అవగాహన వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇలా అంటూ మీ అందరికీ తెలుసు కదండీ కొంచెం ఆధ్యాత్మికతను కూడాను నేను తప్పకుండా స్పృషిస్తాను అని నేను ఏమన్నానఅంటే అమ్మ మీ మాటల్లో నాకు మీకు ఆధ్యాత్మిక కోణం ఉన్నట్టు కూడాను గుర్తించాను.
(15:03) మెడిటేషన్ చేస్తూ ఉంటారు అని చెప్పారు కదా నిజం చెప్పాలి అంటే మనిషికి బాధ కలిగించేది కేవలం సంఘటన కాదు ఆ సంఘటన ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అనే మానసిక పట్టుదల కూడాను బాధని పెంచుతుంది. ఆ మాటక వస్తే మీకు జరిగిన జరుగుతున్న జరగబోయే సంఘటన కూడా ముందే నిర్ణయించబడిన వాస్తవాలే కాకపోతే చిత్తశుద్ధి పట్టుదల ఉండాలి ప్రయత్న లోపం ఉండకూడదు ఫలితం అంటారా అది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు చాలాసార్లు భగవంతుడు మీరు అడిగింది ఇవ్వడమ్మా మీకు అవసరమైంది మటుకు తప్పకుండా ఇస్తాడు ఇదే వేదాంత భగవద్గీత సారాంశం దీన్ని మీరు తప్పక అర్థం చేసుకోవాలి
(15:52) కనెక్ట్ అవ్వాలి అయితారన్న నమ్మకం నాకు ఉంది తల్లి ఇంకా చెప్పానండి ఆయన చేసింది ఆయన కర్మ అది చివరికి ఆయనకు కర్మగా మారుతుందేమో ఎవరికీ తెలుసు అంతా కర్మ సిద్ధాంతం చేతిలో ఉంది తల్లి అయితే ఆయన కర్మని మీరు శిక్షగా అనుభవించవలసిన అవసరం లేదు ఇక్కడ నేను మిమ్మల్ని భర్తను క్షమించమని చెప్పటం లేదు మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోండి అని మాత్రమే చెప్తున్నాను.
(16:27) ఇంకా చెప్పాలని అనిపిస్తున్నదమ్మ కాబట్టి చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా విను నేను చెప్తూనే ఉంటే ఆమె అసలు ఎంత నిశశబ్దంగా విందంటేనండి అప్పుడప్పుడు నేను అమ్మ వింటున్నావా అంటే హాయ్ సార్ నేను చాలా సీరియస్ గా వింటున్నాను సార్ అందండి సో కంటిన్యూ చేస్తానండి ఇంకా చెప్పాల్సి అనిపిస్తున్నది కాబట్టి చెప్తున్నానమ్మ నా మాటల్ని మీరు నిజంగా విశ్వసిస్తే ఇప్పుడు కాకపోయినా మరి కాసేపటి తర్వాత అయినా మీ మనసు తేలికపడుతుందని నేను అనుకుంటున్నాను.
(17:07) మీరు హాయిగా నవ్వగలిగితే ఈ నా ప్రయత్నానికి సార్ధకత చేకూరినట్లే అట్లాగని మిమ్మల్ని బలవంత పెట్టటం లేదు రాజీ పడమని కూడా నువ్వు చెప్పటం లేదు మీరు విజ్ఞులు వాస్తవాన్ని మీకు తెలుసు ఆయన జీవితాన్ని ప్రశ్నించే కొద్ది నిలదీసే కొద్ది బలపడతాడు ఎందుకంటే ఆయన మూర్ఖుడు మీరు మటుకు మీ జీవితాన్ని తిరిగి ప్రారంభించండి ఇదో కొత్త అధ్యాయం చీకటి గుహలో లో నుంచి బయటిక వచ్చిన బయటికవచ్చి వెలుగు చూసిన క్షణం పిల్లలతో మనువలతో ఇష్టమైన పనులతో సమయం గడపండి మానసిక స్వతంత్రం తెచ్చుకోండి స్వేచ్ఛని అనుభవించండి.
(17:50) నేను ఆయన్ని క్షమించాలి అని చెప్పను ఆయనకు శిక్ష పడాలి అని ప్రార్థించండి అని కూడా చెప్పను నేను చెప్పేది ఒక్కటే అమ్మ ఇన్ని సంవత్సరాలు ఆయన తప్పు వల్ల మీకు మీరు వేసుకున్న శిక్షను ఇకపై కొనసాగించకండి ఇప్పటిదాకా మీరు ఆయనకు భార్యగా జీవించారు ఇక నుంచి ఆయన ప్రవర్తనకు బానిసగా జీవించకండి స్వతంత్ర వ్యక్తిగా జీవించండి మానసికంగా ఎదగండి ఇదే ఒక విధంగా మీకు అంతర్గత విముక్తి వాస్తవాన్ని యధాతంగా స్వీకరించి నవ్వగలిగినప్పుడే మన జీవితానికి అర్థం ఉంటుంది తల్లి ఇది ముమ్మటికి వాస్తవం కానీ కోపంతోనో ఆవేశంతోనో ఆర్థిక ఆధారాన్ని మటుకు
(18:39) తెంచుకోవద్దు. ఆయన మనసు నిజంగా మారితే రేపు అనుకోని జరిగితే ఆయన పెన్షన్ కూడాను మీకు తిరిగి రావచ్చు. అట్లాగనే ఆశను మటుకు పెట్టుకోవద్దు ఆయన మీ భర్త అనేది ఎంత వాస్తవమో ఇక నుంచి మీరు ఎలా జీవించాలో అలా జీవించగలిగితే అంతకంటే గొప్ప వాస్తవం లేదు అన్నది కూడాను అంతకుమించిన గొప్ప వాస్తవం అతని ఇంటికి వస్తే అవసరమైతే గౌరవం మేరకి మాట్లాడండి డిస్టర్బ్ చేయకుండా ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తాడు.
(19:13) అట్లాగని ఆశ కూడా పెంచుకోవచ్చు. విధి చాలా బలయమైందఅమ్మ దాని లీలను వీక్షించడానికి సమాయుక్తం కాండి అంటూ చివరిగా చెప్పానండి అమ్మ చివరిగా ఒక మాట మీ జీవితం మీది తామరాకు మీద నీటి బిందువుగా జీవించగలనని అనుకుంటున్నారా నిజమే జీవించలేనని అనుకుంటున్నారా అది నిజమే అంతా మీ చేతిలోనే ఉందమ్మ ఈ 40 40 ఏళ్ల జీవితం మీకు తప్పక విజ్ఞతని ఇస్తుందని ఆశిస్తున్నాను.
(19:49) అవును కదా నేను ఆనందంగా జీవించడం అనేది నా చేతిలోనే ఉంది కదా అని విశ్వసించినప్పుడే నీ అసలు జీవితం మొదలవుతుంది. జీవితంలో 60 ఏళ్ళ తర్వాత జీవితం మరో గొప్ప అధ్యాయం అమ్మ గత తప్పప్పులని డైరీ వేసుకొని ఈ అధ్యాయాన్ని మీరే రాయబోతున్నారు. ఇతరులత ఇతరులను తప్పు పట్టినంత కాలం మీరు ఓడిపోతూనే ఉంటారు. ఎంత గొప్ప మఠాధిపతి అయినా చెప్పేది ఇదే మీరు మీ ఆనందాన్ని కోల్పోవద్దు అని సో ఇలా ముగించానండి నేను ఇలా ముగించాను నేను ఎంతవరకు కరెక్టో కాదో మీరైనా నిర్ణయించాలి.
(20:34) మీరు గమనించారో లేదో అండి చెస్ లో కూడా రాజు ఓడిపోయినప్పుడు కూడాను ఎప్పుడు ఒంటరిగా ఉండాడండి. ఓ సైనికుడు పక్కన ఉంటాడు ఎందుకంటే అది ఆట ధర్మం ఆ మాటకు వస్తే జీవిత ధర్మం కూడాను ఇటువంటి స్త్రీలకు ఈ జీవితం అనే చదరంగంలో ఆత్మస్థిరైన సైనికుడండి అది లేకపోతే రాజు ఒంటరివాడు అయిపోతాడు ఒక్కోసారి ఆత్మహత్య కూడా చేసుకుంటాడు. కానీ ఆ పరిస్థితి చదరంగంలో లేదండి నిజ జీవితంలో కూడా నువ్వు ఉండకూడదు అని నేను అంటాను.
(21:10) ఆ పోరాట పటిమే గనుక లేకపోతే జీవితానికి అర్థం లేదండి. సో నేను చెప్పాను కదా మొట్టమొదట్లో ఎంతో మంది అభాగ్యులైన స్త్రీ మూర్తులకు ఈ వీడియో అంకితం అని సో ఇదండి వీడియోలో ఉన్న సంగతి ఎంతో మంది స్త్రీలు నేను చెప్పాను కదా మొట్టమొదటలో ఇలాగే ఇబ్బంది పడుతున్నారండి ఇలాగే ఇబ్బంది పడుతున్నారు. ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు నాకు కొంతమంది ఫోన్ చేస్తున్నారు.
(21:35) ఏదో నాదైన సీన్లో నేను వాళ్ళని ఓదారుస్తున్నాను అనుకోండి వాళ్ళు కూడాను సంతోషంగానే ఉంటున్నారు. సో ఇంతేనండి ఈ వీడియోలో ఇంతకంటే చెప్పేది ఏం లేదండి. ఈ వీడియో గనుక నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎంతో మందికి షేర్ చేయండి. నాతో మాట్లాడాలి అని అనుకుంటే హాయిగా మాట్లాడండి నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి కిరణ అండి ఇంటి పేరు పోరూరి బెల్ ఐకాన్ లైక్ బటన్ అంటారా మీరు ఎటు నొక్కుతూనే ఉన్నారు మరి కొంతమందికి చెప్పి ప్రెస్ చేయించండి.
(22:10) పోతే చిన్న రిక్వెస్ట్ అండి కామెంట్ బాక్స్ లో మీదైన శైలలో మంచి మెసేజ్ని పెట్టండి లేదు ఇక్కడ మీరు తప్పు చేశరండి ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుండేది ఇలా చెబితే బాగుండేది అని గనక మీరు చెప్పినట్లయితే నేను సహృదయంతో వాటిని స్వీకరించి నా తప్పులు నేను సరిదిద్దుకుంటూ మరికొన్ని మంచి వీడియోలు చేసే ప్రయత్నం చేస్తానండి. [గురకలు] ఉంటానండి నమస్కారం.

No comments:

Post a Comment