Friday, September 18, 2026

 

PRATIKULA VEDAM
3 hours ago (edited)
🔴నిన్న నిజామాబాద్ లో జరిగిన సంఘటన గురించి కాస్త మాట్లాడాలి. జగిత్యాలకి చెందిన Vaishnavi అనే ఒకమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని, కొన్నాళ్ళకి, ప్రేమించిన భర్త హరి బాబే, భార్యని చంపేశాడని, అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. కొన్నాళ్ళకి Hari babu బెయిల్ మీద బయటికొచ్చాడు. అయితే ఈ Vaishnavi కి, Santosh అనే ఒక అన్నయ్య ఉన్నాడు. చెల్లిని చంపాడనే కోపంతో, బెయిల్ మీద బయటకొచ్చిన తన బావని, నడి రోడ్డు మీదే చంపి, నేనే చంపాను అని తనకి తానే పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. First of all, ఇదంతా Junior NTR గారి Rakhi సినిమా స్టోరీ లా అనిపించింది నాకు.

సరే. విషయంలోకెళ్దాం. ఇలాంటివి దుర్ఘటనలు జరగడం ఇది మొదటి సారా? తండ్రి కూతుర్ని చంపడం, అన్న బావని చంపడం, భర్త భార్యని చంపడం, భార్య భర్తని చంపడం. అసలిలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి. ఎందుకొక వ్యక్తిని ఏకంగా చంపేయాలనిపిస్తుంది? వాళ్ళకి తెలీదా చంపాక, ఇక జీవితమంతా జైలులో గడపాలి అని? ఒక వైపేమో, వాడికలానే జరగాలి అని support చేస్తున్న వాళ్ళున్నారు. ఇంకో వైపేమో, ఇలా నరుక్కోవడం వల్ల, final గా వచ్చేదేంటి, ఇలాంటివేమైనా ఆగుతున్నాయా అని oppose చేస్తున్న వాళ్ళూ ఉన్నారు. కన్నుకి కన్ను అని పొడుచుకుంటూ పోతే, లోకమంతా గుడ్డిదైపోతుంది అని ఒక సామెత కూడా ఉందిగా.

మనం ఎమోషన్ తో ఊగిపోకుండా, కాస్త బుర్ర పెట్టి, పైన కనిపిస్తున్న drama ని పక్కన పెట్టి, మనిషి mind లోపల అసలేం జరుగుతుందో చూడాలి.

🔵ముందుగా ఆ భర్త గురించి మాట్లాడుకుందాం. "ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత చంపేశాడు" అని వినడానికి చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ప్రేమించిన వాళ్ళు ఎలా చంపుతారు? అసలు నిజం ఏంటంటే, వాడు ఆ అమ్మాయిని ఎప్పుడూ ప్రేమించలేదు. మన society లో "ప్రేమ" అనే పదానికి అసలు అర్థం తెలియదు. ఒక వస్తువు మీద మనకి ఇష్టం కలిగితే, దాన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటాం. ఆ అమ్మాయి వాడి దృష్టిలో ఒక property. పెళ్లి అనేది ఆ property ని officially తన పేరు మీద రాసుకోవడం మాత్రమే.

ఎప్పుడైతే భార్య అనే ఆ property, తన control లో ఉండదో, తన ego కి ఎదురు తిరుగుతుందో, వాడి లోపల ఉన్న 'యజమాని' hurt అవుతాడు. "నా మాట విననిది, నాకు దక్కనిది, అసలు బ్రతికి ఉండకూడదు" అనే ఒక జంతు ప్రవృత్తి బయటపడుతుంది. ఇక్కడ చంపింది కోపం కాదు, వాడి EGO. భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకోవడానికి, తండ్రి కూతుర్ని పరువు కోసం చంపడానికి కూడా కారణం ఇదే. అక్కడ relationship లేదు, కేవలం ownership మాత్రమే ఉంది. తన ego కి బానిసలా లేనిది ఏదైనా సరే, నాశనం అయిపోవాలి అనేదే మనిషిలోని ప్రాథమిక మూర్ఖత్వం.

🟢ఇక అన్నయ్య విషయానికి వద్దాం. చెల్లిని చంపాడు అనే కోపంతో నడి రోడ్డు మీద నరికేసి, police station లో లొంగిపోయాడు. దీన్ని చూసి society అంతా "వామ్మో, చెల్లి మీద ఎంత ప్రేమ ఉంటే ఇలా చేస్తాడు, వీడు కదా అన్నయ్య అంటే!" అని చప్పట్లు కొడుతుంది. కానీ లోపలికి వెళ్లి చూస్తే, ఇక్కడ కూడా ప్రేమ లేదు. ఇక్కడ ఉన్నది "Pride."

"నా చెల్లిని చంపుతావా? నా కుటుంబం పరువు తీస్తావా? నా ego ని challenge చేస్తావా?" అనే ఒక రకమైన Tribal mindset ఇది. చెల్లి చనిపోయినందుకు బాధపడటం వేరు, పగ తీర్చుకోవాలి అనుకోవడం వేరు. బాధ అనేది ప్రేమ నుండి పుడుతుంది. పగ అనేది అహంకారం నుండి పుడుతుంది. రోడ్డు మీద నరికేసి, police station కి వెళ్లి "నేనే చంపాను" అని చెప్పడం వెనుక ఒక వికృతమైన hero worship దాగి ఉంది. తన దృష్టిలో తానొక న్యాయమూర్తి, ఒక శిక్షకుడు అని ఫీల్ అయ్యాడు..

తన ego ని satisfy చేసుకోవడం కోసమే ఆ పని చేశాడు తప్ప, చెల్లి మీద ప్రేమతో కాదు. వాడికి immediate గా తన కడుపులో మండుతున్న ego ని చల్లార్చుకోవాలి. అందుకే చంపాడు. త్యాగం ముసుగులో ఉన్న అహంకారం ఇది.

🔴సరే, కానీ "చంపాక జీవితమంతా jail లో గడపాలి అని, ముందు భార్యని చంపినోడికి, ఇప్పుడు సొంత బావని చంపినోడికీ తెలియదా?"

తెలుసు. కానీ ఎప్పుడు తెలుసు? వాళ్ళు normal గా ఉన్నప్పుడు తెలుసు. కోపం అనేది ఒక temporary madness. Biology ప్రకారం చెప్పాలంటే, మనిషి మెదడులో ముందు భాగం Prefrontal Cortex ఉంటుంది. అది logic, planning, consequences అంటే, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఆలోచిస్తుంది. కానీ మనిషికి ఎప్పుడైతే విపరీతమైన ego hurt అవుతుందో, అప్పుడు మెదడు లోపల ఉన్న Amygdala అనే భాగం.. ఇది జంతువుల మెదడు లాంటిది, మన brain ని పూర్తిగా take over చేస్తుంది.

ఆ క్షణంలో logic పని చేయదు. Future కనిపించదు. Jail, జీవితం, carrier, కుటుంబం.. ఏవీ గుర్తుకు రావు. కేవలం ఎదురుగా ఉన్న శత్రువుని నాశనం చేయాలి అనే ఒకే ఒక urge మాత్రమే ఉంటుంది. మనిషి ఆ క్షణంలో తన ఎరుక ని పూర్తిగా కోల్పోయి, ఒక biological robot లాగా, ఒక program చేయబడిన జంతువు లాగా behave చేస్తాడు. కోపం తగ్గాక, మెదడు మళ్ళీ normal stage కి వచ్చాక, jail లో కూర్చుని "అయ్యో ఎంత పని చేశాను" అని ఏడుస్తారు. అంటే, చంపింది వాడి మెదడులో ఉన్న జంతువు, శిక్ష అనుభవించేది వాడిలో మిగిలి ఉన్న మనిషి.

🟠ఇక ఈ సంఘటనకి support చేసేవాళ్లు ఒక వైపు, oppose చేసేవాళ్లు ఇంకో వైపు. ముందుగా ఈ support చేసేవాళ్ల సంగతి చూద్దాం. వీళ్ళు ఎందుకు "సూపర్, వాడిని అలాగే నరకాలి" అని అరుస్తున్నారు? ఎందుకంటే, ప్రతి మనిషి లోపల ఒక violent animal దాగి ఉంది. చట్టం, భయం, society వల్ల ఆ జంతువును లోపల అణిచిపెట్టి ఉంచారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, ఆ లోపల ఉన్న జంతువుకి ఒక vicarious pleasure,  అంటే తమకు తామే పగ తీర్చుకున్నంత ఆనందం కలుగుతుంది. So వాళ్ళు ఆ అన్నయ్యకు support చేయట్లేదు, తమ లోపల ఉన్న హింసా ప్రవృత్తికి support చేసుకుంటున్నారు. వీళ్ళకి న్యాయం వద్దు, రక్తం కావాలి.

⚪ఇక oppose చేసే వాళ్ళు.. "కన్నుకు కన్ను అయితే లోకమంతా గుడ్డిది అవుతుంది" అని Gandhi గారి quotes చెప్తుంటారు. ఇది వినడానికి చాలా బాగుంటుంది. కానీ, వీళ్ళలో చాలా మందికి అసలు reality అంటే ఏంటో తెలియదు. వీళ్ళు తమ AC రూముల్లో కూర్చుని ethics గురించి మాట్లాడుతారు. ఒక మనిషి ఎందుకు అలా క్రూరంగా మారాడో అర్థం చేసుకోకుండా, కేవలం పైపైన philosophical dialogues కొట్టడం కూడా ఒక రకమైన అజ్ఞానమే. ఈ రెండు వర్గాలూ పైపైన ఆకులను చూస్తున్నాయి తప్ప, చెట్టు వేరుని చూడట్లేదు.

🟢అసలు మనిషి సమస్య ఏంటి?

తండ్రి కూతుర్ని చంపడం, అన్న బావని చంపడం, భార్యాభర్తలు చంపుకోవడం... ఇవన్నీ జరగడానికి ఒకే ఒక కారణం.. మనం పేరుకే మనిషి శరీరం లో ఉన్నాం గానీ, నిజానికి నిజమైన మనుషులుగా మనం ఇంకా evolution చెందలేదు.

మనం బట్టలు వేసుకున్న కోతులం. మన చేతిలో smartphones ఉన్నాయి కానీ, మన mind మాత్రం ఇంకా అడవిలోనే ఉంది. మనకి "నేను ఎవరు?" Who am I? అనే కనీస స్పృహ లేదు. మనల్ని మనం మన ఆలోచనలుగా, మన భావోద్వేగాలుగా, మన బంధాలుగా husband, brother, father అనే relationships తో fix చేసుకున్నాం. నా కూతురు నా మాట వినాలి, నా చెల్లికి అన్యాయం జరగకూడదు, నా భార్య నా అధీనంలో ఉండాలి.. ఇవన్నీ ego సృష్టించిన భ్రమలు.

ఎప్పుడైతే ఆ identities కి ప్రమాదం వస్తుందో, మనం చంపడానికైనా, చావడానికైనా సిద్ధపడిపోతున్నాం. జీవితం కంటే, ఆ ego ఇచ్చే kick గొప్పది అయిపోతుంది.

💛దీనికి ఒకే ఒక solution ఉంది. అదే ఎరుక. మనిషి తన లోపల పుడుతున్న ఆలోచనలను, కోపాన్ని, ego ని ఒక మూడో వ్యక్తిలా గమనించడం నేర్చుకోవాలి. "నాకు కోపం వస్తుంది" అని కాకుండా "నా మనసులో కోపం అనే ఒక emotion పుడుతుంది, దానికి నేను బానిసను కాకూడదు" అని realize అవ్వాలి. కానీ మన education system లో బ్రతకడం ఎలాగో నేర్పిస్తారు తప్ప, మన mind ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పించరు. అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, మున్ముందు కూడా జరుగుతూనే ఉంటాయి.

ఇది ఒక criminal కి సంబంధించిన issue కాదు. ఇది human condition కి సంబంధించిన issue. చంపిన భర్త, నరికిన అన్నయ్య, చప్పట్లు కొడుతున్న society, comments చేస్తున్న మేధావులు.. వీళ్లందరూ ఒకే మాయలో ఉన్నారు. ఆ మాయ పేరే 'అహంకారం'. ఈ మొత్తం drama ని ఒక సాక్షిలా చూసినప్పుడు మాత్రమే, అసలు నిజం అర్థం అవుతుంది. నీకు న్యాయం కావాలా? చట్టం ఉంది. But నీకు revenge మాత్రమే కావాలి అనుకుంటే మాత్రం, నువ్వు కూడా ఆ నేరస్థుడితో సమానమే. ఈ perspective తో ఆలోచించడం మొదలుపెడితే, ప్రతి వార్త వెనుక ఉన్న మనిషి మూర్ఖత్వం, చీకటి కోణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి.

-PRATIKULA VEDAM

No comments:

Post a Comment