☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
33. దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యమ్
దేవపితృకార్యాలలో ఏమఱపాటు కూడదు(యజుర్వేదం)
గృహస్థాశ్రమంలోకి వెళ్ళబోతున్న వ్యక్తికి గురువు ఇచ్చే ఆదేశమిది. నిత్యం దేవకార్యం, పితృకార్యం చేయాలి. అంటే దేవతలని తృప్తి పరచడం, పితృదేవతలను
తృప్తిపరచడం ప్రతి ఒక్కని కర్తవ్యం. ఇది అత్యంత ముఖ్యమైన పనిగా శాసిస్తోంది వేదధర్మం.
మనకి స్థూలదృష్టి మాత్రమే ఉండడం చేత దేవతాస్పృహ ఉండదు. కానీ దేవతల సహకారం లేనిదే ఈ ప్రకృతిలో ఏదీ జరగదు. పంచభూతాలు, వాటి శక్తులు, ప్రవర్తన... అంతా నిర్వహించే వైశ్వికశక్తులే (Cosmic Energy) దేవతలు. అదేవిధంగా ప్రకృతిని అనుభవించే మన ఇంద్రియ శక్తులూ దేవతాకృపవల్లనే నిర్వహించబడతాయి.
( కోరికలు మనకు లేవని డాంబికాలు చెప్పినా, అవసరాలు మనకు ఉంటాయి. అవసరాలు తీరిపోతున్నంత కాలం అవి కోరికలు అనిపించవు. అవి లభించనప్పుడు కోరికలుగా మారతాయి. ఇచ్చేశక్తి,అనుభవించే శక్తి కూడా దేవతాశక్తులే. ఈ రెండూ సరిగ్గా పనిచేస్తున్నందుకు కృతజ్ఞత, పనిచేయాలని ప్రార్థన... ఇదే దేవతారాధన.)
అందుకే ఒకొక్క ఇంద్రియానికీ ఒకొక్క దేవత ఉంటారు. జీవి సుకృతాసుకృతాలను బట్టి ఆ దేవతాశక్తి ఆ ఇంద్రియాలలో ప్రసరిస్తుంది. ఆ కారణం చేతనే దేవతకి 'కృతజ్ఞత' ప్రకటించాల్సిన బాధ్యత ప్రతివానిపై ఉంది.
ఈ హేతువు వల్లనే మన ఋషులు దేవయజ్ఞాన్ని ఏర్పరచారు. నిత్యం త్రిసంధ్యలలో దేవతోపాసన నియమింపబడింది. నిత్య, నైమిత్తిక కర్మల ద్వారా దేవతలను అర్చిస్తాం
చేసే పూజాదికాలు 'నిత్యకర్మలు'. వినాయకచవితి, శివరాత్రి, ఏకాదశి -
మొదలైనవి 'నైమిత్తికాలు'. ఇంకొకటి కామ్యకర్మలు - అంటే ఏదైనా కోరికతో చేసే కర్మలు, వ్రతాదులు. ఇందులో నిష్కామభావం ఉన్నవాళ్లు (ఏ కోరికా లేని వాళ్ళు) కామ్యకర్మలు మానివేయవచ్చు గానీ నిత్యనైమిత్తికాలు మానరాదు.
'నాకు ఏ కోరికా లేదు' అనే యోగులు కూడా 'కృతఘ్నస్య నివృత్తయే' - కృతఘ్నతా దోషపరిహారార్థం - వారి విధిలో వారు దేవతారాధన చేస్తారు.
అభీష్టదైవంతోపాటు, ఇతర దేవతారాధన కూడా అవసరమేనని వైదిక సంప్రదాయం.
ఒక ఇల్లు అనగానే గృహదేవతలుంటారు. వారిని తృప్తి పరచాలంటే ఇంట్లో దీపారాధన, నివేదన మొదలైనవి జరగాలి. లేకపోతే ఇంటికి అశాంతి.
(బ్రతికుండగా తల్లిదండ్రుల్ని సంతోష పరచడం, తదనంతరం పితృకర్మల
ద్వారా వారిని తృప్తిపరచడం - ఇది ప్రతి మనిషికీ కర్తవ్యం, శారీరకంగా
పెద్దలతో ఉన్న బంధం దూరమైనా, సూక్ష్మంగా భావపరంగా వారితో
బంధం వీడదు. జీవించి ఉన్నంతకాలం మనలోనే ఉంటుంది. అందుకే
జీవితాంతం పితృకర్మలు చేయాలి.)
కోరికలు మనకు లేవని డాంబికాలు చెప్పినా, అవసరాలు మనకు ఉంటాయి. అవసరాలు తీరిపోతున్నంత కాలం అవి కోరికలు అనిపించవు. అవి లభించనప్పుడు
కోరికలుగా మారతాయి. ఇచ్చేశక్తి, అనుభవించే శక్తి కూడా దేవతాశక్తులే. ఈ రెండూ సరిగ్గా పనిచేస్తున్నందుకు కృతజ్ఞత, పనిచేయాలని ప్రార్థన.... ఇదే దేవతారాధన.
మన అస్తిత్వానికి ఆధారం మన పూర్వీకులు. కేవలం తల్లిదండ్రులకే కాక తాతముత్తాతలకి కూడా మన జీవిత నిర్వహణలో ప్రధానభాగం వహిస్తుంది. ఆచారాలు, సంప్రదాయాలు, విద్య, సంపద.... అన్నీ పూర్వతరాల నుండి లభించేవే.
అందుకే వారిపట్ల కృతజ్ఞత ప్రకటించాలి. ఇది పెద్దలు ఆశించే ఆశ మాత్రమే కాదు పిల్లలు చూపించవలసిన బాధ్యత.
బ్రతికుండగా తల్లిదండ్రుల్ని సంతోష పరచడం, తదనంతరం పితృకర్మల ద్వారా వారిని తృప్తిపరచడం - ఇది ప్రతి మనిషికీ కర్తవ్యం, శారీరకంగా పెద్దలతో ఉన్న బంధం దూరమైనా, సూక్ష్మంగా భావపరంగా వారితో బంధం వీడదు. జీవించి ఉన్నంతకాలం మనలోనే ఉంటుంది. అందుకే జీవితాంతం పితృకర్మలు చేయాలి.
‘ఆ పితరులు వేరే జన్మలు తీసుకుంటే...' లాంటి తర్కాలతో పని లేదు. 'తీసుకోకపోతే' మన కర్మలు వారికి సూక్ష్మలోకాల్లో ఆధారమౌతాయి. వేరే జన్మ తీసుకున్నా, అప్పుడూ అక్కరకు వస్తాయి. వారు గ్రహించినా, గ్రహించకపోయినా - పితృభావం పట్ల
కృతజ్ఞత చూపించే పుత్రుని దేవతలు అనుగ్రహిస్తారు.
పరంపరగా వస్తున్న దేవకార్యాల నుండి, పితృకార్యాల నుండి ఏనాడూ తప్పరాదు. తప్పితే పాపకారకం - అని శాస్త్రవచనం.
అటువంటి పరంపరాగత సంస్కృతి నుండి క్రమేపీ దూరమవుతున్నారు. నిత్యం యథావిధి కాసేపైనా దేవతారాధన చేయడం లేదు. ఏ పర్వదినాలలో ఏమి ఆచరించాలో కూడా తెలియని స్థితికి వెళ్ళిపోయారు.
క్రమంగా ఒక దానికొకటి ఆచరిస్తున్నారు కూడా. విధి నిషేధాలు
తారుమారవుతున్నాయి. పితృకర్మలు కూడా విస్మరిస్తున్నారు.
సత్యం వద - ధర్మం చర - మాతృ దేవో భవ - పితృ దేవో భవ - ఆచార్య దేవో
భవ - అతిథి దేవో భవ... అని చెప్పిన శాసనాలలోనే ఈ పై శాసనాన్ని చేసింది వేదం. దీనికి విరుద్ధంగా నడవడం వేదవిరుద్ధమే. వేద ధర్మాచరణలో దేవపితృకార్యాలను
శ్రద్ధగా చేయడం అత్యంత ప్రధానం.
No comments:
Post a Comment