Monday, December 2, 2024

 నారద భక్తి సూత్రములు


56 వ సూత్రము 
"గౌణీ త్రిధా గుణ భేదా ధార్తాది భేదాద్వా"   
గౌణ భక్తి మానవుల గుణస్వభావాలను బట్టి ఆర్తుల స్థాయిని అనుసరించి మూడు రకాలుగా విభాగించారు.
గౌణ భక్తి మూడు రకాలు సాత్విక భక్తి,రాజసిక భక్తి,తామస భక్తి.
పరమేశ్వర ప్రీత్యర్థం పరమేశ్వర పాదార్చన గావించే భక్తుడు సాత్విక భక్తుడు, యశస్సు కొరకు ధనాకాంక్ష కొరకు విగ్రహారాధన చేసే భక్తుడు రాజసిక భక్తుడు,ప్రతీకారేచ్ఛ తోనూ,డాంబికం తోను క్రోధాదులతో పూజను నిర్వహించే భక్తుడు తామసిక భక్తుడు.
సాధారణం గానే ఆర్తుడు,జిజ్ఞాసి,అర్థార్థి అనే భక్తులు మూడు రకాల ఉపాసనలు గావిస్తారు.భగవత్ కృప అందరికి తప్పక కల్గుతుంది.భగవత్ భక్తిలో విశేషం ఇదే ఎన్ని జన్మలెత్తించయినా సరే సద్గురు కృపద్వారా సాత్విక భక్తి పొంది భగవత్ అనుగ్రహణకు పాత్రుడవుతాడు.కనుక ప్రతీవానికి భక్తి ని అభ్యాసం చెయ్యడం చాల అవసరం, ముఖ్యం గా సాత్విక భక్తి ని.
పరమేశ్వర ప్రీతికై చేసే నిష్కామ సేవ,భగవత్ ఆరాధన,అనన్య భక్తిప్రేమ భక్తుడు అలవరుచుకోవాలి.

57 వ సూత్రము 
"ఉత్తర స్మాత్ ఉత్తర స్మాత్ పూర్వ పూర్వ శ్రేయాయ భవతి"     

తరువాత తరువాత దానికంటే పూర్వం చెప్పినవి కల్యాణ ప్రదాలు.అంటే తామసిక భక్తి కంటే రాజసిక భక్తి, రాజసిక భక్తి కంటే సాత్విక భక్తి శ్రేష్టం.ఈ మూడింటికంటే " సాధ్యభక్తి సర్వ శ్రేష్టం.ఆ సాధ్య భక్తినే " పరమ ప్రేమభక్తి అంటారు.

ఆంజనేయుడు శ్రీరామునితో:
ప్రభూ! దేహ బుద్దితో చుస్తే నేను నీకు దాసుణ్ణి, జీవబుద్ధి తో అయితే నేను నీ అంశాన్ని,ఆత్మబుద్ధి తో ఆలోచిస్తే నీవే నేను,నేనే నీవు అని విన్నవించుకుంటాడు.

దాసో హమ్ ఐన వాడు సో హమ్ స్థితికి చేరుకోవడానికి భక్తుడిలోని సాధనానుష్ఠాన భక్తి క్రమం గా తమాసికం నుంచి రాజసికం,రాజసికం నుంచి సాత్విక స్థితికి పరిణితి చెందుతుంది.ఏకాగ్రత అనన్య భక్తి సాధన వల్లనే సాత్విక స్థితినుంచి సాధ్యభక్తి లభిస్తుంది.

అప్పడు భక్తుడు భగవంతునిలో తాదాప్యం చెందుతాడు.ఆ భక్తోత్తముడు అనుక్షణం ఆ హరి చింతనలో,శ్రవణంలో,స్పర్శనంలో,దర్శనంలో తనను తాను మరచి మాధవునిలో మమేకమవుతారు గోపికలవలె. సాత్విక భక్తి ని.
పరమేశ్వర ప్రీతికై చేసే నిష్కామ సేవ,భగవత్ ఆరాధన,అనన్య భక్తిప్రేమ భక్తుడు అలవరుచుకోవాలి.     

No comments:

Post a Comment