Vedantha panchadasi:
స్థూలదేహం వినా లిజ్గదేహో న క్వాపి దృశ్యతే ౹
వైరాజో దేహ ఈశోఽ తః సర్వతో మస్తకాదిమాన్ ౹౹113౹౹
113. స్థూలశరీరము లేకయే సూక్ష్మశరీరముండుట ఎక్కడను చూడము గనుక విరాట్పురుషుడు నిజమగు ఈశ్వరుడు.అతనికి ఎల్లెడల శిరస్సులు మొదలగునవి కలవు.
సహస్రశీర్షే త్యేవం చ విశ్వతశ్చక్షురిత్యపి ౹
శ్రుతమిత్యాహురనిశం విశ్వరూపస్య చిన్తకాః ౹౹114౹౹
114. అన్ని దిక్కులయందూ వ్యాపించి అనంతములైన తలలతో కన్నులతో ఉన్న విరాడ్రూపమే జగద్రూపమని శ్రుతి చెప్పును.ఇట్లు విరాడుపాసకులు వాదింతురు.
ఋగ్వేదము 1.10.90;
శ్వేతాశ్వతర ఉప.3.3.
సర్వతః పాణిపాదత్వే కృమ్యాదేవరపి చేశతా ౹
తతశ్చతుర్ముఖో దేవ ఏవేశో నేతరః పుమాన్ ౹౹115౹౹
115. ఎల్లయెడల ఈశ్వరుని పాణిపాదములు గలవనుటచే క్రిమి కీటకాములందు కూడా ఈశ్వరత్వము భావింపవలసి వచ్చును.కనుక చతుర్ముఖుడైన బ్రహ్మయే ఈశ్వరుడు మరియెవరరూ కాదని ఇతర ఉపాసకులందురు.
వ్యాఖ్య:
"ఈశ్వర ఇతిచ బ్రహ్మేవ స్వశక్తి ప్రకృతి అభిధేయం ఆశ్రిత్య లోకాన్ సృష్ట్యా"
ఈశ్వరుడనగా బ్రహ్మము వలననే తనశక్తి సంబంధమైన ప్రకృతిని ఆశ్రయించి ఈశ్వరత్వమును పొంది తన్నెరుంగని వారిచేత తనకంటె వేరుగానున్నట్లు ఈ కనీపించు లోకములను సృజించి ఆ లోకములయందు తానే అంతర్యామిగా ప్రవేశించి బ్రహ్మనుండి అల్పజీవి వరకు సర్వజీవుల యొక్క బుద్ధీంద్రియములకు నియంత అగుట వలన ఈశ్వరుడగుచున్నాడు.
లోకములను సృజించుచున్నాడు.
మాయోపాధిలో యున్న పరబ్రహ్మమే ఈశ్వరుడు.ఆ ఈశ్వరుడు పరబ్రహ్మ శక్తిచేతనే లోకములన్నియు సృజించుచున్నాడు.
14 లోకములను సృజించినాడు అనుట పురాణ సత్యము.
లోక:-అనగా ఆలోక యితి లోకః (పదము యొక్క ఉత్పత్తి) చూడబడునది లోకమని ఒక అర్థము.
అనగా చూచేవాడుండిన చూడబడే లోకముండును.అందువలన ఒక్కొక్క జీవునికి ఒక్కొక్క లోకమున్నది.
కనుక అనేక లోకములున్నవని కూడా మరియొక అర్థము.ఇది యోగవాశిష్ఠములో వశిష్ఠుల వారు చెప్పారు
ఈశ్వరుడు ఇతర జీవుల దృష్టిలో సర్వజ్ఞత్వాది గుణవంతుడు.కనుక ముక్తుడుకూడా అట్లే
కాని ఈశ్వరుడు నిర్గుణుడు వానియందు సంకల్పాదులుండవు. కనుక సత్యసంకల్పాదులు ముక్తునకున్ను వుండవు. ఈశ్వరునితో అభేదం అంటే శుద్ధబ్రహ్మముతో అభేధకుని భావింపవలెను.
ఈశ్వరుడు నిరాకారుడు, నిత్యముక్తుడు అసంగుడు కనుక ఈశ్వరుడు శుద్ధ బ్రహ్మము.
ఉదా: మఠము నందు ఘటము పగిలితేె ఘటాకాశము మఠాకాశము లీనమగును. మహాకాశమున కాదు.కనుక బ్రహ్మాండాతర్గతుడైన జ్ఞాని శరీరము బ్రహ్మాండంలో నష్టమయినది.
బ్రహ్మాండం ఈశ్వర శరీరమైన మాయలో ఉన్నది.కనుక జ్ఞాని ఈశ్వరునితోనే అభేదము.అయినా మఠాకాశము మహాకాశమే అయినట్లు ఈశ్వరుడు శుద్ధ బ్రహ్మమే గదా!
కనుక అది శుద్ధ బ్రహ్మప్రాప్తియే.
No comments:
Post a Comment