Tuesday, December 17, 2024

 కొన్ని *మం'దారం* నిజాలు
             *******
బలగం ఎంతున్నా బాధలో తోడు లేనప్పుడు వారున్నా లేకున్నా ఒక్కటే, 
కుక్క ముందు గడ్డివాముంటే దాన్ని తినడానికి ఎలగైతే పనికి రాదో అలాగ.    ^^^^^^^^^^^

అన్ని ప్రాణులకన్నా మనుషులకు వచ్చే అతి ప్రమాదకరమైన వ్యాధి *ఓర్వలేనితనమే* యన్నది నిజం.,
              ^^^^^^^^^^^

మనుష్యుల్లోని గుణాలను బట్టి 5 రకాలు;

1.జరిగిన వాటికి ప్రతీకారంతీసుకునే వారు *బలహీనులు*

2.క్షమించి వదిలేసేవారు
*ఉదారులు*

3.అసలేం పట్టింపు లేని వారు
*విజ్ఞులు*

4.ఏదీ జరగకుండా జాగ్రత్త
పడేవారు *సర్వజ్ఞులు*

5.దేనికీ చలించని వారు *స్థితప్రజ్ఞులు* 

👉🏾తులం బంగారం...*
*అక్కాచెల్లెళ్ళును దూరం చేస్తుంది.*

👉🏾గజం స్థలం...*
*అన్నదమ్ములను విడదీస్తుంది.

👉మూడంగుళాల నోటు..*
*ఆరడుగుల మనిషిని ఆడిస్తుంది.*

👉అరంగుళం నాలుక...*
*అందరి మనసులను* *గాయపరుస్తుంది.*
*బంధాలను తెంచుతున్నది.*
*ఇవి చిన్నవే కదా అని చులకనగా చూస్తే..!*

👉*మరిచిపోలేని బాధలను మిగులుస్తున్నాయి..* అని తెలుసుకో.....

No comments:

Post a Comment