*యిక ముందు యిటువంటి జోకులకు స్వస్తి చెబుదాం.*
*హిందువులకు అదేం ఆత్మవంచనో తమ పవిత్రమైన సంప్రదాయాలు, నామాలు, ఆచారాలను తిట్లకి, అవహేళనకి పర్యాయపదాలుగా వాడుతూ తమ సంస్కృతి సాంప్రదాయాలను తామే అవమానుపరుచుకూoటూవుంటారు.*
*బాస్ తిట్టాడా అని అడగటానికి బదులుగా అక్షింతలు పడ్డాయా అని అడగటం.*
*మందు కొట్టావా అని అడగటానికి బదులు తీర్ధం పుచ్చుకున్నావా అని అడగటం.*
*మోసం చేశాడా అని అడగటానికి బదులు పంగనామాలు పెట్టాడా, శఠగోపం పెట్టాడా అని అనడం.*
*బార్ నుండి మందు కొట్టి వస్తే ఎరా గుడి నుండి వస్తున్నావా అని స్నేహితులు అడగటం.*
*దివాళా తీశారు అని ఎక్కిరించడానికి/అవహేళన చెయ్యడానికి గోవిందా గోవిందా అని వాడటం.*
*ట్రాప్ చేయడాన్ని ముగ్గులోకి దింపాడు అనడం.*
*ప్రలోభ పెట్టి ప్రేమలోకి పడేయడానికి ప్రయత్నించడాన్ని పులిహోర కలుపుతున్నాడు అని ప్రతి పండుగకు చేసుకుని దైవానికి నైవేద్యముగా సమర్పించే పవిత్రమైన పులిహోరని అవమానించడం/అవహేళన చెయ్యడం.*
*పవిత్రమైన సంస్కృత భాషను తాగుబోతులు మైకం తలకెక్కిన తరువాత మాట్లాడే అర్ధం కాని బూతు మాటలను ఇక సంస్కృతం మొదలుపెడతారు అని అవమానించడం.*
*ఇలా చెప్పుకుంటూ పోతే మన హిందువులే తమ పవిత్ర భాషను, సాంప్రదాయాలను, ఆచారాలను, నామాలను అవమానించుకోవడం పరిపాటి (ఫ్యాషన్) అయిపోయింది.*
*ఎవరైనా ఎక్కువ గోల చేస్తే ఏందిరా నీ రామాయణం అని మంచి చెబితే జ్ఞాన బోధ వద్దు అని, సిగరెట్టు కాల్చుకోవడానికి అగ్గిపెట్టె ఇచ్చేవాడిని గురు అగ్గిపెట్టె అని అడగడం, ఎవరైనా కక్కుర్తి పడితే నీ కక్కుర్తిలో నా కమండలం అని, ఏదీ మిగలలేదు ఉపయోగం లేదు అంటే ఏమి మిగిలింది బూడిద అనడం, మోసపోతే తూర్పు తిరిగి దండం పెట్టు అనడం.*
*ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడాలంటే శతకోటి లింగాలలో నువ్వో బోడి లింగం అనడం.*
*ఇదో పెద్ద లిస్టులు హనుమంతుని తోకలా అని వాడుకోవడం కూడా ఇదే తరహా.*
*యిక ముందు యిటువంటి జోకులకు స్వస్తి పలుకుదాము. ముందు మన నుంచి వీటిని తీవ్రంగా ఖండించే పని ప్రారంభించుదాము. ఎందుకంటే ఇతర మతాలవారు వారివారి మతాలపై వారు పొరపాటున జోకులు వేసికోరు. వాస్తవికతతో దేవతలను, గ్రంథాలను గౌరవించు కుందాము*
No comments:
Post a Comment