Monday, December 2, 2024

 *"మా కురు ధన జన యౌవన గర్వం"*

*మనిషికి అహంకారం అనేది అనేక కారణాల నుంచి వస్తుంది.  కొంతమందికి తాను గొప్ప శ్రీమంతుడను అని, కొంతమందికి తాను పండితుడను అని, కొంతమందికి తాను మహాబలశాలి అని, అహంకారం, కొంతమందికి అన్నీ నాకే తెలుసు అని, ఇంకొంత మందికి పది మంది నన్ను పొగుడుతున్నారు, నన్ను మించిన వాడు ఈ ఊరిలో లేడని. ఈ అహంకారం వచ్చిన వాడు రావణాసురుని వలె  తప్పుడు పనులు చేస్తాడు*.

*రావణుడు సీతాపహరణమనే మహాపరాధం చేశాడు. అప్పుడు ఎంతోమంది రావణాసురుడికి బుద్ధి చెప్పారు. మాతామహులు మాల్యవంతుడు కూడా బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు, పెడచెవిని పెట్టాడు. చివరికి సర్వనాశనం అయ్యాడు, ఆరంభంలోనే వివేకం తెచ్చుకొని అథవా పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు విని ఆపని చేయకుండా ఉన్నట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది. వీటన్నిటికీ మూల కారణం అహంకారం. అహంకారం మనిషి పతనానికి కారణం. దానిని దూరం చేసుకోవాలి, భగవంతునికి ఇష్టమైన వాడు ఎవరు అంటే అహంకారం ఇసుమంతైనా లేనివాడు.*

*తృణాదపి సునీచేనా తరోరపి సహిష్ణునా*
*అమానినా మానదేన కీర్తనేయః సదా హరిః!!*

*ఎవరైతే లవణేశం కూడా అహంకారం లేకుండా ఉంటాడో,  ఎవరైతే సదా ఓర్పుతో ఉంటాడో, వాడు భగవంతునికి ఇష్టమైన వాడు. అందుకే భగవత్పాదులు మనకు చెప్పిన మొట్టమొదటి మాట "మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వం" నువ్వు వేటిని చూసి అయితే అహంకార పడుతున్నావో అవి శాశ్వతం కాదు.*

*శాశ్వతమైనది ఒక్కటే భగవదనుగ్రహం,  భగవదనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాడి జీవనం ఉత్తమంగా, పవిత్రంగా ఉంటుంది.*

*కేవలం మనయొక్క ఐశ్వర్యం, పాండిత్యం, బలాన్ని నమ్ముకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తే మన పతనానికి కారణం అవుతుంది.*

         *కథ కంచికి మనం ఇంటికి*

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
*🚩లోకా సమస్తా సుఖినోభవన్తు🚩*
*┈┉┅━❀꧁ॐ🙏ॐ꧂❀━┅┉┈*
          *ఆధ్యాత్మికం ఆనందం*
🛸💧🛸 💧🛸💧 🛸💧🛸

🙏📚🙏 🪷🕉️🪷 🙏📚🙏

No comments:

Post a Comment