Monday, December 2, 2024

 

*ఇదొక పరమపద సోపాన పటము. మనం సాధారణంగా 'పాము పటం' గా పిలిచే ఈ పటంలో పాచికలు విసురుతూ మనం ( మన పావు) ' నిచ్చెన గడి' లోకి వెళ్ళినప్పుడల్లా మనం పైపైకి వెళుతూ ఉంటాం. అలా కాక ఎప్పుడైనా 'పాము గడి' లోకి వెళితే జర్రున కిందికి జారిపోతాం. జాగ్రతగా పాముల్ని తప్పుకుంటూ నిచ్చెనలు ఎక్కుతూ పైపైకి సాగే వ్యక్తే అంతిమంగా గమ్యస్థానం చేరుకుని విజేతగా నిలుస్తాడు.*

*ఇక ఈ పటం కొంచెం భిన్నమైంది. మనం ఏమేమి చేస్తే ఆరోగ్యంగా ఉంటామో, ఎలా జీవిస్తే, లేక ఏ ఆరోగ్య సూత్రాలు పాటిస్తే మనం రోగాలబారిన పడకుండా సుదీర్ఘ కాలం పాటు ఆరోగ్యంగా జీవిస్తామో ఇది వివరిస్తుంది. చక్కటి ఆరోగ్యం కోసం ఏమి చేయాలో  'నిచ్చెన గదులు'  సూచిస్తే, ఏమి చేయకూడదో 'పాము గడులు'  వివరిస్తాయి.*

*ఒక వైద్యుడు తన ఔట్ పేషెంట్ వార్డు హాలులో గోడమీద అంటించిన ఈ పోస్టర్ హాస్పిటల్ సందర్శకులకు పెద్ద ఆకర్షణగా నిలుస్తున్నది.*

 *ఇమేజ్ ని కాస్త జూమ్ చేసి చూస్తే ఆరోగ్యం కోసం ఏమి చేయదగినవో, ఏమేమి చేయదగనివో తెలుసుకోవచ్చు.*

No comments:

Post a Comment