Friday, April 22, 2022

మంచి మాట..లు (22-04-2022)

లక్ష్మీ శ్లోకః
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం ।
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం ।
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం ।
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం ॥

ఆత్మీయబంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు 🌹. లక్ష్మి, దుర్గా, సరస్వతి, గాయత్రీ అమ్మవార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
శుక్రవారం:- 22-04-2022 :--
ఈ రోజు AVB మంచి మాట.లు
శ్రమిస్తే శరీరానికి మంచిది ప్రేమిస్తే మనసుకు మంచిది నవ్విస్తే నలుగురికి మంచిది అందుకే నలుగురిని నవ్విస్తూ నవ్వుతూ ఉండండి

బరువులు మోసే వాడి కంటే బాధ్యతలు మోసేవాడే గొప్పవాడు డబ్బు ఉన్న వాడికంటే మర్యాద తెలిసిన వాడే గొప్పవాడు .

ఈ లోకం లో ఉప్పులాగా కటువుగా మాట్లాడేవారే మన మేలుకోరే మిత్రులు అంతే తప్ప చక్కెర లాగా తీపి కబుర్లు చేప్పేవారు కాదు ఎందుకంటే చక్కెరకు చీమలు పట్టని రోజు ఉండదు అదే విధంగా ఉప్పుకు పురుగు పట్టిన దాఖాలాలు అసలే లేవు

బంధాలు బంధుత్వాలు మధ్య మనస్వర్థలు వచ్చినప్పుడు దూరంగా ఉండండి లేదా దూరంగా ఉంచండి అంతేకానీ మాటలు అనుకోకండి ఎందుకంటే మళ్ళీ కలిసిపోయినప్పుడు మనషులు కలిసినంత తొందరగా మనసులు కలవలేవు .

సూర్యుడు ఎంత దూరంగా ఉన్నా మనకు కనిపిస్తూనే ఉంటాడు అలానే మన మనసుకి నచ్చినవారు మనకెంత దూరంగా ఉన్నా వాళ్ళ రూపం మనకెప్పుడూ కళ్ళల్లో కదులుతూనే ఉంటుంది వాళ్ళ ఆలోచనలు మదిలో మెదులుతూనే ఉంటాయి ,

మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు కానీ ఎప్పుడైతే ఎదుటి వారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది.

మనకు ఎదుటి వారు గుర్తుకు రావడం గొప్ప కాదు మనం వారిని మరవకపోవడం గొప్ప ఎందుకంటే గుర్తుకు రావడం మెదడు చేసే పని మనం ఉండాల్సింది ఎదుటివాళ్ళ మెదడులో కాదు ఉండాల్సింది వాళ్ళ హృదయంలో .

*మీ ..AVB సుబ్బారావు

సేకరణ

No comments:

Post a Comment