Tuesday, April 26, 2022

నేటి మంచిమాట. డిజైనింగ్ ఒకకోర్సు, డిజైనర్ ఒక గొప్ప అర్హత. కలసివస్తే డబ్బే డబ్బు.

నేటి మంచిమాట.

డిజైనింగ్ ఒకకోర్సు, డిజైనర్ ఒక గొప్ప అర్హత. కలసివస్తే డబ్బే డబ్బు. సానపట్టేకొద్దీ రాటుతేలే కళ. ఎన్ని మార్పులయినా చేసుకోగల వెసులుబాటు.

కానీ, భగవంతుడు చేసిన మనశరీర నిర్మాణ డిజైన్ మాత్రం ఈసృష్టి వున్నంత వరకూ ఉండే ఒక ఫిక్స్ డ్ డిజైన్. మారదు. మార్చే సాహసం చేయగలవారు ఇంకా పుట్టలేదు.

కాళ్ళజత, చేతులజత, కళ్ళజత...ఇలా ఉన్న డిజైన్ మనకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. అదేమిటో, ఎప్పుడూ కూడా ఇంకో కాలు వుంటే బాగుండేది, ఇంకో కన్ను వుంటే బాగుండేది అని అనిపించదు. పైగా, విధివశాత్తూ ఏదైనా ఒకటి ఎక్కువ ఉందనుకోండి, అది పీకేసేవరకూ నిద్రపట్టదు. ఎబ్బెట్టుగా ఉండి, జుగుప్స కలుగుతుంది.

అదీ డిజైనింగ్ అంటే. ఏ ఒక్క అవయవం లేకపోయినా, అలాంటిదే ఇంకోటి పెట్టుకోవాలి లేదా లేకుండానే అలవాటు చేసుకోవాలి.

శతాబ్దం క్రితం మన టైపు రైటర్ కీబోర్డ్, చేతివ్రేళ్ళ బలాబలాలని బట్టి రూపకల్పన చేశారు. ఎందరో టెక్నాలజీ దిగ్గజాలు కూడా ఆ డిజైన్ జోలికి పోలేదు. అలా వుండాలి

వికలాంగులని చూసి బాధ పడకూడదు. వారినుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంటుంది. చూడండి.

🌅శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment