నిన్ను గౌరవించుకోవడం నీకు తెలుసా?
మీ గురించి పట్టించుకోకుండా ఉన్న వారిని మీరు పట్టించుకోవడం మానండి.
ఇతరులను అడుక్కోవడం మానండి.
అవసరానికి మించిన మాటలు మాట్లాడకండి.
ఎవరైనా అవమానిస్తే, వెంటనే ఎదుర్కొని ప్రశ్నించండి.
ఉచితంగా పక్కోడు పెడుతున్న తిండి ఎక్కువగా తినకండి
మీ ఇంటికి వచ్చేవారి ఇంటికి మాత్రమే మీరూ వెళ్ళండి
మిమ్మల్ని మీరే అభివృద్ధి చేసుకోండి. మీ ఆనందాన్ని మీరే సృష్టించుకోండి.
ఇతరుల గురించి గాసిప్ చేయడం, వినడం మానండి.
మాట్లాడేముందు ఆలోచించండి. మీ విలువలో 80% మీ మాటల్లోనే ఉంటుంది.
సర్వదా మెరుగైన దుస్తులు ధరించండి. మిమ్మల్ని మీరు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా అలంకరించుకోండి.
గట్టిగా అనుకున్నది ఏదైనా సాధించండి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి.
మీ సమయాన్ని మీరు గౌరవించండి.
మిమ్మల్ని గౌరవించని సంబంధాన్ని కొనసాగించకండి. ఆదిలేయడానికి వెనుకాడకండి.
మీపై మీరు ఖర్చు పెట్టడం నేర్చుకోండి. అప్పుడు మాత్రమే ఇతరులు కూడా మీపై ఖర్చు పెడతారు.
కొన్ని సమయాల్లో మీరు అరుదైన వారిగా ఉండండి మీ విలువ ఉంచుకోండి.
ఇతరుల నుంచి తీసుకునే వారిలా కాదు ఇచ్చేవారిగా ఉండండి.
ఆహ్వానం లేకుండా ఎక్కడికీ వెళ్ళకండి. ఆహ్వానిస్తే, ఎక్కువ సేపు ఉండకండి.
ఇతరులతో వారి గుణగణాలు బట్టి ప్రవర్తించండి.
డబ్బు అప్పుగా ఇచ్చారా, పదేపదే అడుక్కోకండి మీరు విలువైన వ్యక్తి అయితే, వారు మీకు తిరిగి కాల్ చేస్తారు.
మీరు చేస్తున్న పనిలో మరింత నైపుణ్యం సాధించండి, ఉత్తమమైన వారిలో ఒకరిగా నిలవండి.
No comments:
Post a Comment