Sunday, February 9, 2025

 🙏🏻🕉️ *పురాణము - అవగాహన*

కలియుగంలో పురాణశ్రవణం కంటే మించిన ధర్మము, పుణ్యము లేవని వ్యాసభగవానుడు చెప్పాడు. 
వాల్మీకి నారదుడిని ప్రశ్నించడం వల్ల రామాయణాన్ని, పరీక్షిత్తు శుకుణ్ణి ప్రశ్నించడం వల్ల భాగవతాన్ని పొందాము.

*గంగా నది ద్వాదశనామాలు ఏమిటి?* 
◆ గంగామాత ద్వాదశనామాలు

శ్లో||  ‘‘నందినీ, నళినీ, సీతా, మాలినీ, మహాపగా, విష్ణు పాదాబ్జ సంభూతా, గంగా,  త్రిపథగామినీ, భాగీరథీ, భోగవతీ, జాహ్నవీ,  త్రిదశేశ్వరి’’*
అనే పన్నెండు నామాలను తలచుకుంటూ అందుబాటులో ఉన్న జలవనరులలో మునకలు వేస్తే - గంగానదీ స్నానాన్నీ , వ్రతాన్నీ నిర్వహించగా ప్రాప్తించే ఫలానికి సమానమైన ఫలం పొందుతారని శాస్త్రం చెబుతోంది.

 *ప్రతి ఇంటిలో గంగ, తులసి ఉండాలని అంటారు. మరి కాశీ గంగను ఇంటిలో పెట్టుకోవచ్చా?  పురాణములలో ప్రమాణము ఉన్నదా?* 
◆ కాశీ గంగ ను ఇంటికి తెచ్చి పూజించడం, ఇంట్లో ఉంచడం చేశారని  వివిధ పురాణములలో ని ఘట్టాలు మనకు తెలుపుతున్నాయి.  - *శ్రీ నారద పురాణం,  శ్రీ వరాహ పురాణం, శ్రీ బ్రహ్మాండ పురాణం*
గంగను (కాశీ గంగ శ్రేష్టం) ఇంటికి తెచ్చిపెట్టుకోవడం భగీరధుడు గంగను భూలోకానికి తెచ్చిన ఫలితం వస్తుంది. 
ప్రతి నిత్యం ఇంటిలో సాధారణ నీటిలో మనం గంగను ఆవాహన చేసి అందులో తులసిని కలిపి చేసే ఆచమనం, పూజ, అభిషేకం అత్యంత పవిత్రమైనది. అది పవిత్రమైన కాశీ గంగా జలం తో కూడిన తులసి జలం ఇంకా పవిత్రం.
అతి పవిత్రమైన కాశీ గంగాజలం తో కూడిన తులసిని, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్లు కాలం చేస్తారని తెలిసినప్పుడు, ఈ జలాన్ని నోటి లో పోస్తే వారికి తప్పక కైవల్యం వస్తుంది. అని శాస్త్రం.
👏

No comments:

Post a Comment