*ఇక... అంతా మంచే!*
*భగవంతుడికి మరో పేరు 'వత్సరుడు. అన్నిటిలోనూ వసించేవాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. భగవం తుణ్ణి ‘కాలాయనమః', అని స్తోత్రం చేస్తారు. భగవత్ స్వరూ పమైన కాలం అనంతం. దానిలో సంవత్సరం ఒక ప్రామాణి కమైన భాగం. ‘యుగాది' అంటే చైత్ర శుద్ధ పాడ్యమి నూతన సంవత్సర ఆరంభదినం. ‘యుగానికి ఆది' అని అర్థం. ఆ రోజున గత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరా నికి స్వాగతం పలుకుతూ ఉంటాం. 'యుగాది' అనే పదానికి వికృతి ఉగాది.*
*మనకు ఎన్నో పర్వదినాలు ఉన్నాయి. ఏ పర్వదినాన ఏయే విధులను ఆచరించాలో పూర్వులు స్పష్టంగా నిర్దేశించారు.*
*ఇక ఈ రోజున*
*"ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాచయ మహాత్మనే*
*నమస్తేస్తు నిమేషాయా త్రుటయేచ మహాత్మనే*
*నమస్తే బహురూపాయ విష్ణవే పరమాత్మనే"*
*అంటూ బ్రహ్మదేవుణ్ణి ప్రార్ధించాలి. బ్రహ్మను ప్రార్ధించే ఒకే ఒక పండుగ ఉగాది. ఈ రోజున సూర్యోదయానికి ముందే తైలాభ్యంగన స్నానం ఆచరించి, ఇష్టదైవాన్నీ, నవగ్రహా లనూ పూజించాలి. అనంతరం బ్రహ్మ ప్రార్థన ముగించి, షడ్రుచుల సమ్మేళనంగా ఉగాది పచ్చడిని ఆరగించాలి.*
*┈┉┅━❀꧁ॐ ఉగాది ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🥥🪔🥥 🍃🕉️🍃 🥥🪔🥥
No comments:
Post a Comment