Sunday, March 30, 2025

 *ఎవరైనా కాలం చేస్తే ఓంశాంతి అని, డిస్కోశాంతి అని, విజయశాంతి అని RIP అని కానీ కామెంట్స్ పెట్టకండి🙏*

*మనం సనాతనులం మన ధర్మం ప్రకారం మన గ్రంధాల ప్రకారం మనధర్మంలోని వారు ఎవరు వెళ్ళిపోయిన సరే శరీరం వదిలి ఆత్మ బయటకు వస్తుంది, ఆత్మ బొటన వేలు సైజు మాత్రమే ఉంటుంది, ఆ ఆత్మ 48 ఘడియలలో ఊర్ధ్వలోకాలకు వెళ్లి దివ్యశరీరం తీసుకుని భూమిమీద వచ్చి 11 రోజులు ఈ భూమిపైనే ఉంది 11వ రోజున మల్లి ఊర్ధ్వలోకాలకు ప్రయాణం అవుతుంది, అంటే మన శాస్త్రాలలో ఆత్మకి గతి ఉందని లేదా ఆత్మకి గమనం ఉందని చెప్పారు కానీ ఆత్మకి శాంతి ఉందని చెప్పలేదు, ఆత్మకి శాంతి అనే పిచ్చి కాన్సెప్ట్ సనాతన ధర్మం కాన్సెప్ట్ కానే కాదు.   మన ధర్మం లో ఆత్మకి గతి ఉంటుంది అది సద్గత దుర్గత అన్నది ఉంటుంది వారి పాప పుణ్యాలను బట్టి ఆయాగతి వర్తిస్తుంది.*

*కాబట్టి ఎవరైనా వెళ్ళిపోతే వారికి సద్గతి కలగాలి అని కోరుకోవాలి, లేదా వారికి కైలాస లోక ప్రాప్తి కలగాలని కోరుకోవాలి. లేదా వారికి వైకుంఠ లోక ప్రాప్తికలగాలని కోరుకోవాలి లేదా వారికి స్వర్గ లోక ప్రాప్తి కలగాలని కోరుకోవాలి.* 

*కానీ ఓంశాంతి, డిస్కోశాంతి, విజయశాంతి అనే కామెంట్లు పెట్టకూడదు... మన ధర్మం ఇలా పెట్టమని ఇలా కోరామని చెప్పలేదు...*

*┈┉┅━❀꧁హరే కృష్ణా꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🙏🙏🙏 🔔🕉️🔔 🙏🙏🙏

No comments:

Post a Comment