*🕉️🙏ఓమ్ 🕉️🙏*
🕉️🙏
*'అద్వైత*
*మహావాక్యముల*
*వివరణ':*
*ఈ నాలుగు వాక్యాల పరమార్ధం ఒక్కటే.*
🕉️🙏
🕉️🙏
*1. తత్త్వమసి:*
*అదే నేను*
🕉️🙏
🕉️🙏
*2. 'అయమాత్మా బ్రహ్మ' :*
*ఈ ఆత్మే బ్రహ్మము*
🕉️🙏
🕉️🙏
*3. 'ప్రజ్ఞానం బ్రహ్మ' :*
*అత్యున్నత జ్ఞానమే*
*బ్రహ్మము*
🕉️🙏
🕉️🙏
*4. 'అహం బ్రహ్మస్మి':*
*నేనే బ్రహ్మము*
🕉️🙏
🕉️🙏
*ఒకటి 1.*
*తత్త్వమసి*
*'సామవేద'*
*మహావాక్యము*
*‘తత్త్వమసి’.*
🕉️🙏
🕉️🙏
చరాచరమంతా
వ్యాపించియున్న
*'శుద్ధచైతన్యము'*
ఎక్కడో లేదు,
నీలోనే వుండి,
నీవైయున్నదని
నిర్వచించడం
చాలా ఆశ్చార్యాన్ని,
తృప్తిని కలిగిస్తుంది.
*'శంకర భగవత్పాదులు'*
చాటి చెప్పిన
*'అద్వైతము'*
ఈ మహావాక్యము
నుండే
ఆవిర్భవించినది
అని భావించడం
మనం
వినియున్నాము.
*‘ఏక మేవ అద్వితీయం’,*
ఉన్నది ఒక్కటే!
అదే పరబ్రహ్మము.
అది నీలోన,
అంతటా వ్యాపించి
ఉన్నదనే
ఒక గొప్ప సత్యాన్ని
*'అద్వైతము'*
ఆవిష్కరించినది.
ఆత్మ పరమాణు
ప్రమాణమైనది.
అటువంటి
పరమాణువు
నుండే
ఈ బ్రహ్మాండము
ఆవిర్భవించినది.
కావున
ఈ
బ్రహ్మాండములో
భాగమైన నీవే
*ఆత్మవు*
అని
వర్ణించింది.
🕉️🙏
🕉️🙏
*రెండు 2.)*
*'అయమాత్మాబ్రహ్మ'*
*నాల్గవ వేదమైన*
*'అథర్వణ' మహావాక్యము*
*‘అయమాత్మాబ్రహ్మ’.*
🕉️🙏
🕉️🙏
ఈ వాక్యము
కూడా
*'ఆత్మయే బ్రహ్మ'*
మని తెలియజేస్తోంది.
*'జీవాత్మ పరమాత్మలు'*
ఒక్కటేనని
విచారించింది.
ఈ
*'అథర్వణ వేదము'*
లోనే
*'ప్రణవ'*
సంకేతమైన
*'ఓంకార'*
శబ్దమును
మానవాళికి
అందించినది.
లౌకిక వస్తు
సమదాయములన్నీ
వివిధ నామములతో
సూచించబడినట్లే
అనంత విశ్వమును
*ఓంకారమనే*
శబ్ద సంకేతముతో సూచించినది.
🕉️🙏
🕉️🙏
*మూడు 3.*
*'ప్రజ్ఞానం బ్రహ్మ'*
*ఋగ్వేద మహావాక్యముగా*
*'ప్రజ్ఞానం బ్రహ్మ'*
*ప్రసిద్ధికెక్కినది.*
🕉️🙏
🕉️🙏
అతి ప్రాచీనమైన
*'ఋగ్వేదము'*
లో
సృష్టిమూలమును
తెలియజేస్తూ
ఈ
*బ్రహ్మాండము పరబ్రహ్మము*
నుండి జనించినదని,
ఈ
చరాచర సృష్టికి
*'శుద్ధ చైతన్యము బ్రహ్మ'*
మేనని
తీర్మానించినది.
బ్రహ్మమే
సర్వజ్ఞతను
కలిగియున్నది.
*ఎనుబది నాలుగు లక్షల*
జీవరాశులను
నడిపించే
*'చైతన్యము బ్రహ్మము'.*
ప్రత్యక్ష
భగవానుడైన
సూర్యుడు
తన పరిధిలోని
గ్రహములను
తన చుట్టూ భ్రమింపచేసుకొనే
శక్తియే
ఈ
*'శుద్ధ చైతన్యము.'*
ఆద్యంతములు
కానరాని
ఈ అనంత
సూర్య మండలములను
వ్యక్తావ్యక్తమైన
ఈ ఆకాశములో
పయనింపచేసే
శక్తి కూడా
ఈ బ్రహ్మయొక్క
*'శుద్ధ చైతన్యమే'*
నని వివరించినది.
*సృష్టికి ముందు*
*తరువాత ఉండేది*
*'ఆత్మ'*
*ఒక్కటేనని*
*తెలియజేసింది.*
🕉️🙏
🕉️🙏
*నాలుగు 4.*
*'అహంబ్రహ్మస్మి'*
*యజుర్వేద*
*మహావాక్యము*
*‘అహంబ్రహ్మస్మి’.*
🕉️🙏
అనగా
*నేనే పరబ్రహ్మ*
మని జీవుడు
భావించడం.
అనేక జన్మలలో
జీవుడు
పరిభ్రమిస్తున్నాడు.
కాని
అన్ని జన్మలలోను
స్వరూపము
*'ఆత్మగా'*
వెలుగొందుతున్నది.
తనకు లభించిన
దేహమనే
ఉపాధిలో
జ్ఞానమును
ప్రోది చేసుకొని
*‘నేనే*
*ఆత్మస్వరూపుడను’*
అనే సత్యాన్ని
దర్శించి
ముక్తిని
పొందుతాడని
ఈ
*యజుర్వేద*
*మహావాక్యము*
విశదపరచింది.
*ఉత్కృష్టమైన*
*మానవ జన్మలో*
*ఆత్మశోధన*
*ధర్మాచరణ*
తోనే
సాధించగలమని
తెలియజేసింది.
*"ధర్మబద్ధమైన*
*కోరికలతో"*
*జీవించి*
*తాను*
*తరించి*
*'సమస్త ప్రకృతి'*
*ని*
*తరింపజేయాలని*
*నొక్కి చెప్పింది.*
🕉️🙏
*🕉️🙏ఓమ్ 🕉️🙏*
No comments:
Post a Comment