Monday, May 5, 2025

 *విజయం వారికే సొంతం...*

*ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని, ఆ లక్ష్య సాధనలో మమేకం అయితే, అందులో పొందే ఆనందం సాటిలేనిది!*

*లక్ష్యాన్ని సాధించిన నాడు మాత్రమే కాదు, లక్ష్య సాధనలో కూడా మనకు ఆనందం అనుభవం అవ్వాలి.*

*ఎవరిలో అయితే తాము నిర్ధేశించుకున్న లక్ష్యంపై అమితమైన ఆసక్తి ఉంటుందో వారే ఆ ఆనందాన్ని అనుభూతి చేయగలరు. వారే విజయాన్ని సొంతం చేసుకోగలరు కూడా!*

*మనలో చాలా మందికి ఆదిలో ఉన్న ఆసక్తి తర్వాత ఉండదు. మనస్సు వేరే విషయాల వైపు మరలిపోతుంది. సాధనలో కష్టాన్ని అనుభూతి చేస్తారు. అయినా, వీరిలో కూడా కొందరు అతి కష్టం మీద లక్ష్యాన్ని సాధిస్తారు.*

*కానీ, ఆసక్తి సన్నగిల్లుతూనే ఎవరైతే సాధన నుండి నిష్క్రమిస్తారో... వారు ఓటమిని చవిచూస్తారు.*

*కనుక, విజయాన్ని సహజంగా పొందాలంటే... లక్ష్యాన్ని గాఢంగా ప్రేమించాలి. ప్రేమ ఉంటే సాధనలో ఆసక్తి ఉంటుంది. ఆసక్తి ఉన్నచోట ఏకాగ్రత సహజం అవుతుంది. ఏకాగ్రచిత్తం ఎటువంటి కష్టాన్నైనా సహజం చేస్తుంది. అలవోకగా మనల్ని విజేతగా నిలుపుతుంది!*

     *🌷ఓం! ఓంకారాన్ని చేద్దాం🌷*

*┈┉┅━❀꧁ శివోహం ꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🦚🧘‍♂️🦚 🙏🕉️🙏 🦚🧘‍♀️🦚

No comments:

Post a Comment