🚩నేటి మరో విశేషం
*ॐ భానుసప్తమీ_ 卐*
భానుసప్తమీ అంటే...
ఏ మాసములోనైనా సరే, ఆదివారము రోజు సప్తమి తిథి వచ్చిన, ఆ సప్తమిని భానుసప్తమి, విజయ సప్తమి, కల్యాణ సప్తమి అందురు. ఈ కల్యాణ సప్తమి రోజు ఆచరించే సూర్యారాధన విశేష ఫలప్రదము.
🌸సాధారణంగా ఆదివారం నాడు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. పురాణ ఇతిహాసాలలో వారాల్లో ఏ రోజుకు ఇవ్వని ప్రాధాన్యత కేవలం ఒక్క ఆదివారానికి మాత్రమే విశేషమైన ప్రాధాన్యతను ఇచ్చారు.
🌸ఎందుకంటే సనాతన ధర్మం నుంచి హిందువులంతా సూర్యభగవానుని ఉపాసకులే, అందుకే మన పండగలన్నీ పూర్వం నుంచి సౌరమానం అంటే సూర్యుని దిశా కొలమానంగానే పండగలు జరుపుకుంటారు.
🌸ఈ ఆదివారం ప్రధానంగా
1. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం,
2. ఆదివారం అభ్యంగన స్నానం చేయకూడదు. ఆ రోజు కేవలం శిరస్నానం మాత్రమే చేయాలి. షాంపూలు వాడరాదు.
3. వంటికి, తలకు నూనె పెట్టుకోరాదు.
4. ఉల్లి, వెల్లుల్లి, మద్యము, మాంసాహారానికి దూరంగా ఉండాలి.
5. బ్రహ్మచర్యం పాటించాలి.
ఈ భానుసప్తమి అనేది సూర్యుదేవునికి సంబంధించిన పర్వదినము, ఒక గొప్ప యోగము.
🌸ఎందుకంటే సప్తతిథికి అధిపతి సూర్యుడు.
సప్త సంఖ్యకు సూర్యునికి అవినాభావ సంబంధం చాలా ఉంది.
🌸సూర్యుని జన్మ తిథి సప్తమి.
🌸సూర్యుని వాహనమైన రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి.
🌸సూర్యుడు తిరిగేది సప్తద్వీప పర్యంతం.
🌸సూర్యుని నుండి వెలువడే కాంతి కిరణాల కలయిక ఏడు.
ఇలా వారంలో ఆదివారంగా, తిథులలో సప్తమి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
🌸సమస్త చీకటిని పారద్రోలి వెలుగుని నింపి దిక్కులకు దిశలను సూచిస్తాయి. లోకంలోని చీకటిని పారద్రోలే ప్రత్యక్ష నారాయణుడని ఎందరో మహామునులు, ఋషులు, దేవతలు అరుణోదయ వేళలో సూర్యభగవానుని ప్రసన్నం చేసుకుంటారు.
ఆదివారము మరియు సప్తమి ఈ రెండు కలిసి రావడంతో ఈ రోజున మహా పర్వదినంగా చెప్పుకోవచ్చు.
🌸ఈ రోజు చేసే స్నానం, దానము, జపము, హోమము లక్ష రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్ర వచనం. ఈరోజు స్నానం చేసే నీటిలో వీలైతే ఎర్రని పువ్వులు లేదా రేణుపండుచెట్టు ఆకులు వేసుకొని చేస్తే చాలా మంచిది.
ఈరోజు స్నానం ఆచరించగానే సూర్యునికి జలాలతో ఆర్గ్యము సమర్పించాలి. సూర్యునికి ఎర్రని పువ్వులు అంటే చాలా ఇష్టం.
ఈరోజు ఎర్రని పువ్వులతో సూర్య భగవానుని ఆరాధన చేయాలి. ఈ రోజున ఆవుపాలతో చేసిన పరమాన్నము శ్రీ సూర్య భగవానునికి నివేదన చేస్తారు. ఈరోజు వీలైతే జిల్లేడు చెట్టుకు నీళ్లు పోసి వాటిని ముట్టుకొని ( ఆ జిల్లేడు చెట్టును ఎట్టి పరిస్థితుల్లో మన కంటికి తాకనివ్వద్దు, చాలా ప్రమాదం) సంకల్పాన్ని చెప్పుకొని నమస్కరించాలి.
శ్లో౹౹ ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా౹౹
శ్లో౹౹ స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి౹౹
భావం:– తినకూడని పదార్ధాలు మద్యము, మాంసము మొదలైనవి తినేవాడు ఏ జన్మల పాటు రోగాలతో బాధపడతాడు. ఆజన్మాంతం దరిద్రం ఉంటుంది.
స్త్రీ సంగమము, తైలం రాసుకోనుట, మద్య, మాంసాలను ఆదివారం విడిచిపెట్టినవానికి శోకం, వ్యాధి, దారిద్ర్యం ఉండదు. అతడు నేరుగా సూర్యలోకనికి వెళతాడు.
🌸ఈ నియమాలు ఒక్క భానుసప్తమి రోజునే పరిమితం కాదు. ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడు సూర్యాష్టకంలో చెప్పారు.
🌸ఈనాడు సూర్యుని అనుగ్రహం కోసం సూర్యాష్టకం, ఆదిత్యహృదయం, సూర్య ద్వాదశనామాలు పఠించడం శ్రేష్ఠం.
🌸రాముడు సైతం రావణుని యుద్ధంలో జయించడానికి, సూర్య భగవానునికి సంబంధించిన ఆదిత్యహృదయాన్ని నిష్టతో ప్రార్థించి రావణుడిపై విజయం సాధించాడు.
సుర్యనమస్కారాలు ఎంతో శుభఫలితాన్ని, కార్యసిద్ధిని ఇస్తాయి.
🌸 *"ఓం నమో ఆదిత్యాయ నమః"* అని ప్రతి ఆదివారం 108 సార్లు పాటిస్తే వారి ఆయురారోగ్యాలకు చక్కని ఫలితాలు ఉంటాయి.
కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని, దుర్వినియోగం చేయవద్దని సూచన.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🍁 *ఆదిత్య ద్వాదశ నామావళి*🍁
👉👉ప్రతి నిత్యం ప్రాతః కాలంలో సూర్యభగవానునికి నమస్క రిస్తూ పఠించాల్సిన మంత్రాలు:
*శ్లోకం:*
యెాదేవః సవితాః స్మాకం ధియెా ధర్మాది గోచరాః!
ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే!!
*శ్రీ ఆదిత్య ద్వాదశ నామావళిః:*
ఓం మిత్రాయ నమః (మిత్ర)
ఓం రవయే నమః (రవి)
ఓం సూర్యాయ నమః (సూర్య)
ఓం భానవే నమః (భాను)
ఓం ఖగాయ నమః (ఖగ)
ఓం పూష్ణే నమః (పూష్ణి)
ఓం హిరణ్యగర్భాయ నమః (హిరణ్యగర్భ)
ఓం మరీచయే నమః (మరీచి)
ఓం అర్కాయ నమః (అర్క)
ఓం సవిత్రే నమః (సవిత్రు)
ఓం భాస్కరాయ నమః (భాస్కర)
ఓం ఆదిత్యాయ నమః (ఆదిత్య)
ప్రతి నిత్యము సూర్య భగవానుని పై నామాలతో నమస్కరించండి.ఆయురారోగ్యాలను పొందండి.
🌞🌞🌞🌞🌞🌞🌞🌞
💥 *నోట్:*💥
ఎన్ని పూజలు చేసినా,
ఎన్ని వ్రతాలు చేసినా,
ఎన్ని గుడులు దర్శించినా,
ఎన్ని తీర్థ యాత్రలు తిరిగినా,
ఎన్ని దీక్షలు వేసినా,
ఎన్ని పవిత్ర నదులలో స్నానము ఆచరించినా కూడా.....
👇👇👇👇👇👇
(🔅తల్లిదండ్రులను గౌరవించలేని వారికి,
🔅నెలకొకసారి ఒకసారి అయినా గో సేవ చేయలేని వారికి,
🔅ధర్మానికి కట్టుబడి ఉండనివారికి
🔅గురువులను గౌరవించలేని వారికి
🔅ప్రకృతిని కాపాడలేని వారికి..
👉ఇలాంటివారు....ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని దీక్షలు చేసిన కూడా పుణ్యాఫల ప్రభావఫలితం మాత్రం వారికి అంతంత మాత్రంగానే ఉంటుందని గ్రహించగలరు🙏.
💥💥💥💥💥💥💥💥
🥦ధర్మో రక్షతి రక్షితః🥦
🚩శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష 🚩 భక్తకోటి ఛానల్
No comments:
Post a Comment