Sunday, May 4, 2025

****మనసు సింపతీ కోరుకునే కొద్దీ మనిషి ముందుకు పోలేడు | Hari Raghav | Square Talks

 ****మనసు సింపతీ కోరుకునే కొద్దీ మనిషి ముందుకు పోలేడు | Hari Raghav | Square Talks



వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను మీ దీప్తి ఈరోజు స్టూడియోలో ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు హలో సార్ హలో అమ్మ వర్డ్స్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ మనసు సింపతీ కోరికన కొద్దీ మనిషి ముందుకు పోలేడు అని పోస్ట్ చేశారు సార్ దీని గురించి వివరించండి రైట్ సింపతీ అంటే సానుభూతి సానుభూతి సహజంగా మనం చిన్నప్పటి నుంచి కూడా మనకి ఇది బాగా అలవాటు అయిపోయి ఉంటది ఎందుకంటే మనకి ఏ చిన్న ఇబ్బంది జరిగిన వెంటనే అయ్యో అయ్యో అనుకుంటా పేరెంట్స్ వచ్చేసి లేపేసి నిలబెట్టి దులిపేసేసి అయ్యో అట్లా అని చెప్పి నేలను కొడుతూ ఉంటారు మా బిడ్డని ఇట్లా చేసావు అట్లా చేసేవాడిని నేలను కొట్టి తన్ని లేకపోతే ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా కొట్టినట్టుగా యాక్టింగ్ చేసి అమ్మ కొడితే నాన్న వచ్చి అంటే ఈ పాపకు లేదా ఈ బాబుకి బాధ కలుగుతుంది బాధ కలగనివ్వద్దు అని చెప్పి ఓవర్ గా రియాక్ట్ అయినప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలు అంటే అందరికీ ప్రేమ ఉంటది కాకపోతే మా సహజంగా పేరెంట్స్ కి పేరెంట్స్ ఎట్లా అవుతున్నారు ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఐఏఎస్ అవ్వాలనుకోండి చాలా చదవాలి చాలా విషయాలు తెలివితేటలు రావాలి దెన్ పాస్ అయ్యి ఏదో అయ్యి వస్తారు ఇంజనీర్ అవ్వాలన్న కష్టం లేకపోతే ఒక యాంకర్ అవ్వాలన్న చాలా విషయాలు నేర్చుకొని రావాల్సి ఉంటది కానీ పేరెంట్స్ ఎలా అవుతారు ఏం నేర్చుకోవాలి ఏమి అక్కర్లేదు కంటే చాలు పేరెంట్స్ అయిపోతుంటారు కాబట్టి సహజంగా పేరెంటింగ్ పట్ల ఈ సమాజంలో నాట్ ఓన్లీ ఇండియా దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా పేరెంటింగ్ పట్ల అవగాహన తక్కువ ఉండి పిల్లల్ని ఎలా పెంచాలి ఏ టైం లో ఏం తేడాలు వస్తుంటాయి ఎట్లాంటివి వస్తాయి మనం ఎలా పెంచితే ఎలా వాళ్ళు మారే అవకాశం ఉంది ఇవన్నీ తెలియక వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే కన్నారు కాబట్టి వెంటనే పేరెంటింగ్ మొదలు పెడతారు అక్కడ రెండు ఉంటాయి ఒకటి విపరీతమైనటువంటి ప్రీతి అంటే ప్రీతి అనే వర్డ్ ప్రేమకు పర్యాయపదంగా వాడుతూ ఉంటారు కానీ ఇక్కడ నేను ప్రీతి అంటే బంధు ప్రీతి నా బిడ్డ నా బిడ్డ బిడ్డ కాదు నా బిడ్డ అన్న దాంట్లో అంటే నా కొడుకు నా కూతురు కి ఏమి అవ్వద్దు అన్న దాంట్లో విపరీతంగా గారాభం చేయటం లేదంటే నాకు చాలా తెలుసు ఈ పిల్లలకు ఏమీ తెలియదు ఆ పిల్లల్ని నేను కండిషన్ లో పెట్టకపోతే వాళ్ళు పాడైపోతారు అని విపరీతమైనటువంటి క్రమశిక్షణలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రెండిట్లో మొదటిది ఏం చేస్తారు చాలా చిన్నగా ఉన్నప్పుడు బిడ్డ చిన్నగా ఉంటాడు కాబట్టి కింద పడిన లేచినా ఏడ్చినా ఏం చేసినా ఆ బాధకు కారణమైనటువంటి ఆబ్జెక్ట్ ని కానీ లేకపోతే ఆ జంతువుని కానీ ఆ వ్యక్తిని గాని విపరీతంగా వాళ్ళు పనిష్ చేస్తున్నట్టు ఆక్టింగ్ చేసి వీళ్ళకి ఎక్కడ లేని అమ్మో నాన్న ఏమైంది నాన్న ఏం కాదు దా తగ్గిపోద్ది అది ఇది అని దగ్గర తీసుకొని గారాభం చేస్తూ ఉంటారు ఈ క్రమంలో పెరిగినటువంటి పిల్లలకి ఇంక్లూడింగ్ మీ నాతో సహా అట్లాగే పెరిగి ఉంటాం కదా పిల్లలకి ఏంటంటే తనకు ఆ ఏం జరిగినా ఇతరులు నా బాధను వాళ్ళు ఫీల్ అయ్యి నా పట్ల ఒక సానుభూతిని కలిగించాలి సానుభూతి కనపరచాలి అని ఫీల్ అవుతూ ఉంటారు అంతే కాకుండా బర్త్ ఆర్డర్ లో కూడా బర్త్ ఆర్డర్ లో చిన్న వాళ్ళని చాలా చిన్నగా చూస్తూ ఉంటారు బుజ్జి నాని కన్నా ఇటువంటి అన్ని పేర్లు పెట్టి పిలుస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది అలాగే పేర్లలో కూడా పెట్టుకున్న పేర్లు కాకుండా పేర్లతో ఏది నాని అని చిట్టి అని బుజ్జి అని ఇద్దరు పిల్లలు ఉంటే పెద్ద బుజ్జి చిన్న బుజ్జి చిట్టి అని పెద్ద చిట్టి చిన్న చిట్టి చిన్నోడు బుడ్డోడు ఇటువంటివన్ని అనేక రకాలుగా ఆ పిల్లలకి పాంపర్ చేసే పేర్లు పెట్టి అలా పిలుస్తున్నప్పుడు సహజంగా వాళ్ళు ఏమవుతారు అంటే ఈ మళ్ళీ ఈ ఈ కోవలోకి వస్తూ ఉంటారు వీళ్ళంతా ఏం చేస్తారు సానుభూతిని కోరుకుంటూ ఉంటారు పిల్లల్ని గమనించండి పిల్లలు పరిగెత్తి పరిగెత్తి కింద పడ్డారు అనుకోండి లేసి అటు ఇటు చూస్తారు ఎవరు లేరు అనుకోండి లేసి తొడుపుకొని వెళ్ళిపోతారు ఎవరైనా చూశారు అనుకోండి వెంటనే ఏం చేస్తారంటే ఏడుపు మొదలు పెడతారు వాళ్ళు వచ్చి ఎత్తుకునే దాకా వీళ్ళు లెగరు అంటే వాళ్ళు కన్ఫర్మేషన్ కోరుకుంటున్నారు నన్ను కేర్ తీసుకునే వాళ్ళు ఉన్నారు నన్ను తీసుకోవాలి తీసుకునే వాళ్ళు ఉన్నారు అంటే తీసుకోవాలని కోరుకుంటున్నాడు అలా మనం రెండు మూడు సార్లు చేసిన తర్వాత ప్రతి చిన్నదానికి పెద్దల నుంచి ఒక సానుభూతి తన సహచరుల నుంచి తన యొక్క క్లాస్మేట్స్ నుంచో లేకపోతే తన ఏజ్ గ్రూప్ నుంచి తన సిబ్లింగ్స్ నుంచి కజిన్స్ నుంచి వర్క్ ప్లేస్ లో తన కొలీగ్స్ నుంచి సానుభూతి కోరుకుంటూ ప్రతి దానికి వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఆ క్రమంలో సమాజంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు 18 19 ఇయర్స్ దాటి 20 దాటిన తర్వాత రియల్ లైఫ్ ఎంటర్ అవుతుంది ఈ స్టేజ్ ని ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్ అంటారు ఎరిక్ ఎరిక్సన్ ఎయిట్ స్టేజెస్ ఆఫ్ సైకో సోషల్ డెవలప్మెంట్ అనే ఒక థియరీని ఆయన డెవలప్ చేశారు దాంట్లో ఈ 20 టు 30 ఇయర్స్ ఏజ్ ని ఏమంటారంటే ఐడెంటిటీ సారీ ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్ అంటే రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి అప్పటిదాకా ఎన్నో కలలు కంటాం ఏదో చేసేద్దాం అనుకుంటాం చాలా కష్టపడి చదివి టాపర్ అయిపోయి పెద్ద ఉద్యోగాలు చేసేద్దాము కష్టపడి బిజినెస్ లు చేసి బాగా డబ్బులు సంపాదిద్దాం మంచి పేరు తెచ్చుకున్న సమాజంలో మంచి ఇది తెచ్చుకుంది ఇవన్నీ కలలు అంటున్నాం థియరిటికల్ గా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి కానీ రియల్ లైఫ్ లోకి ఎంటర్ అయ్యేసరికి అవన్నీ వర్క్ అవుట్ కావట్లేదు రకరకాల పాలిటిక్స్ ఉన్నాయి రకరకాల అన్ని ఉన్నాయి నేను అనుకున్నంత ఎఫర్ట్స్ చేయలేకపోతున్నాను చక్కగా చదువుకొని టాపర్ అయ్యి వచ్చాను కానీ ఎయిట్ అవర్స్ ఆఫీస్ లో కూర్చోవడమే నాకు చాలా కష్టంగా ఉంది లేదంటే ఆ కొలీగ్స్ తో హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంది వాళ్ళు ఏదో కామెంట్ చేస్తున్నారు లేదంటే సరిగ్గా చేయట్లేదు అన్నారు స్ట్రెస్ కి గురి చేస్తున్నారు ఇలా నెమ్మదిగా తీస్తే ఎలా అది ఇది అంటున్నారు ఇలా అనేక రకాలైనటువంటి ఆ రియల్ లైఫ్ లో కష్టాలు ఎంటర్ అయ్యేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే తన బాధను వేరే వాళ్ళు అర్థం చేసుకోవాలి అన్న దాంట్లో ఒక ఇంటిమేట్ ఫ్రెండ్ ని కోరుకుంటారు ఇంటిమేట్ ఫ్రెండ్ అంటే చాలా దగ్గర ఉన్నటువంటి స్నేహితురాలు స్నేహితులు ఇప్పటిదాకా ఉన్న ఫ్రెండ్స్ ఏంటి ఎంజాయ్ చేస్తేనే బాగుంది కానీ అట్లా కాదు నిజమైన బాధ నిజమైన బాధ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి ఎందుకంటే జనరేషన్ గ్యాప్ ఉంటది ఇంకా మిగిలింది ఎవరంటే సేమ్ ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి మేల్ ఆర్ ఫీమేల్ వాళ్ళతోనే ఇంటిమసీ ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత అది సహజంగా ఆపోజిట్ సైడ్ అయితే సెక్స్ కింద దారి తీసిన తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకునే అవకాశాలు ఉంటాయి అంటే ఇప్పుడు మనం ప్రేమలు ఈ కాలేజ్ అదే సినిమాల్లో చూసి ప్రేమలు అది చెప్పట్లేదు రియల్ గా ఫ్రెండ్షిప్ ఏర్పడి తర్వాత వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడి సెక్స్ కూడా ఏర్పడొచ్చు పెళ్లి కూడా చేసుకునే అవకాశం వాళ్ళిద్దరి పర్సనల్ బాగుంటే పెళ్లి కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇలా ఆపోజిట్ జెండర్ అయితే సేమ్ జెండర్ అయితేనేమో వాళ్ళు ఫ్రెండ్షిప్ పట్ల కంటిన్యూ అవుతారు ఇక్కడ ఆ అవతల వ్యక్తి చూపించేది ఏంటంటే ఒక విధమైనటువంటి సానుభూతి సహానుభూతికి సానుభూతికి తేడా సహానుభూతి అంటే ఎంపతి ఎంపతీ అంటే మన బాధను కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు కానీ మనల్ని తక్కువగా చూడరు వాళ్ళు ఎక్కువగా చూడరు కానీ సానుభూతిలో సానుభూతి పరిచే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు సానుభూతి కోరుకునే వాళ్ళు చాలా ఇన్ఫీరియర్ అంటే చాలా బలహీనులు అని చూస్తూ ఉంటారు వీళ్ళు కూడా అది కోరుకుంటూ ఉంటారు అలా ఈ ఇంటిమేట్ ఫ్రెండ్ ఏర్పడిన తర్వాత వాళ్ళు సానుభూతి చూపించాలి ఇంటిమేట్ ఫ్రెండ్ అని కోరుకునే క్రమంలో ఈ లవ్ లో అంటే రిలేషన్షిప్స్ లో ఉన్నవాళ్ళు పెళ్లైన కొత్తలో కూడా బాధను తన యొక్క పార్ట్నర్ కి ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్ళ నుంచి రిటర్న్ సానుభూతి సింపతీని కోరుకుంటూ ఉంటారు సో ఆ క్రమంలో కొంత ఒకటి రెండు సార్లు కొత్తలో బాగుంటది కదా బ్రహ్మాండంగా ఉంటది ప్రేమించినప్పుడు చాలా స్వీట్ గా ఉంటది మెల్లమెల్లగా అది చేదుగా వగరుగా ఉప్పగా కారంగా మారుతూ ఉంటది కదా కొత్తలో బాగున్నప్పుడు ఏం జరిగిన ఏంటి బుజ్జి బేబీ ఏదో అంటారు కదా దాంతో చాలా చక్కగా చూసుకుంటాడు అతను చిన్నగా వేలికి దెబ్బ తగిలిన అతను చాలా ఓవర్ గా రియాక్ట్ అయిపోయి అయ్యో ఈరోజు లీవ్ తీసుకో వంట చేయొద్దు నేను ఆర్డర్ చేస్తాను అది ఇది అని చెప్తూ ఎక్కడ లేనటువంటి ప్రేమ కొత్తలో చూపిస్తాడు సో మొదట్లో చిన్నగా దెబ్బ తగిలిన ఆ బాయ్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్ విపరీతంగా రియాక్ట్ అయ్యి ఇక్కడ ఎక్కువ ఈవెన్ ఫీమేల్ కూడా ఆడపిల్ల కూడా పెళ్లైన కొత్తలో పెళ్లై రెండు రోజులే అవుతది అత్తగారు వాళ్ళు ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆయనకి ఇది పడదండి అని నటిస్తూ ఉంటది రెండు రోజులు అయింది అతని దగ్గరికి వచ్చి అమ్మకి 25 సంవత్సరాల నుంచి తెలుసు కానీ ఈయన వచ్చి ఆయన ఇది తినడు కాఫీ తాగడు కాఫీలో షుగర్ ఇంత లేనిది తాగడు ఇటువంటివి అని చెప్తూ ఉంటాడు అలాగే ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయికి విపరీతమైనటువంటి పాంపర్ చేస్తూ సానుభూతి చూపిస్తూ ఉంటారు అది ఒక బెంచ్ మార్క్ ఏర్పడి ఇక అదే ఎక్స్పెక్టేషన్ తోని ఈ ఆడపిల్లలు ఉంటూ ఉంటారు మగపిల్లోడు కూడా అంత కేర్ తీసుకుంటుంది నా భార్య ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు తీరా వచ్చేసరికి ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోతారు అండ్ కొంత బిజీ అయిపోయిన తర్వాత పట్టించుకోవడం కష్టం అవుతూ ఉంటది ఎందుకంటే ఆ అబ్బాయి పని చేయాలి పొద్దున వెళ్తే రాత్రి దాకా అక్కడ బాస్ సతాయిస్తాడు కొలీగ్స్ సతాయిస్తూ ఉంటారు అంత చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అప్పటిదాకా ఈమె అతను ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాను చూసి రాగానే తన ఫ్రస్ట్రేషన్ తో ఇక్కడ టఫ్ చేస్తాడు ఇప్పటిదాకా అత్తగారితోనో ఇంకొకరితోనో ఇంకో ఎవరితోనో కొట్లాడి ఆడపడుచుతోనో లేకపోతే తోడి కోడలతోనో తన సిస్టర్ తోనో సిస్టర్ తన గొప్పలు చెప్తాది తన భర్త ఎంత సంపాదించాడు ఏం కార్లు కొన్నాడు ఇవన్నీ చూపిస్తే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా అతను రాగానే కనీసం వాటర్ తాగుతావా కాఫీ టీ లు ఏమి ఇవ్వకండి అని రాగానే అదే వాళ్ళు కారు కొన్నారంట వీళ్ళు ఇట్లా చేశారంట అట్లా చేశారు ఇవన్నీ చేసేసరికి అతనికి కోపం వచ్చి ఏదో ఒక మాట అడగటము ఈమె మాట అనటం ఇట్లా అడగటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక ప్రతి దగ్గర ఫీమేల్ ఏం కోరుకుంటారు అంటే తన భర్త దగ్గర కానీ లేకపోతే భర్త వల్ల అయిన ఇబ్బందులు గాని బయట సానుభూతిని కోరుకుంటాం సో ఎంతైతే మనం సానుభూతిని కోరుకుంటామో అంత బలహీనులమైపోయి వాళ్ళు నన్ను వాళ్ళు గుర్తించాలి వాళ్ళు గుర్తించకపోతే అమ్మ నాన్న నా బాధను గుర్తించి నాకు సపోర్ట్ గా మాట్లాడాలి లేకపోతే నా సిస్టర్ అన్న సపోర్ట్ గా మాట్లాడాలి ఎవరు లేకపోతే పాత ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉంటారు అతను సపోర్ట్ గా మాట్లాడాలి ఇట్లా ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది మాట్లాడి ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళని ఇప్పుడు భర్త ఏదో అంటే బాయ్ ఫ్రెండ్ అప్పటిదాకా ఉన్నోడు ఎక్కడ లేని సానుభూతి చూపిస్తాడు ఎందుకు తన భార్య కాదు కదా సో నీ భర్త ఇట్లాంటోడు అట్లాంటోడు అది ఇలా అని ఎక్కడ లేనివన్నీ ఉన్నాయి లేని అన్ని కూడా రెచ్చగొడుతూ ఉంటాడు ఈ అమ్మాయి నిజం అనుకుని నిజంగా భర్త మీద ఇంకా రివర్స్ అయిపోతూ ఉంటుంది సో ఇట్లా రకరకాలుగా ఎవరి సానుభూతి కోరుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకు మీకు సానుభూతి చూపిస్తారు మీకు సానుభూతి చూపించడానికి ఈ భూమి మీద ఎవరు పుట్టలేదు ఎవరు సానుభూతి చూపించిన వాళ్ళు ఏదో ఒకటి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు చేస్తూ ఉంటారు అప్పటికి మాత్రం సానుభూతి చూపించొచ్చు కానీ అది ఎమోషనల్ గా కానీ లేకపోతే ఫైనాన్షియల్లీ కానీ సోషల్లి కానీ లేకపోతే ఫిజికల్ గా కానీ ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ తోనే ఫీమేల్ కానీ మేల్ కానీ సేమ్ ఫీమేల్ నుంచి ఫీమేల్ అయినా అంతే తను ఇంకో సపోర్ట్ ఏదో కోరుకుంటూ ఉంటుంది ఈరోజు మీకు సానుభూతి చూపించొచ్చు ఇంకో రోజున ఎక్కడో తనకు అనుకూలంగా మాట్లాడాలని కోరుకుంటుంది ఇట్లా ఏదో ఒక రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసే మీకు వాళ్ళకి తెలియకుండానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సానుభూతి చూపించాలి అనుకున్నప్పుడు అప్పుడల్లా మన జీవితాన్ని తీసుకెళ్లి వేరే వాళ్ళ చేతిలో పెడుతూ ఉన్నాం కాబట్టి మనిషి సానుభూతి కోరుకోవద్దు ఎవరి నుంచి సానుభూతి కోరుకోవద్దు తల్లిదండ్రుల నుంచి కానీ లేకపోతే టీచర్ నుంచి కానీ తన సిబ్లింగ్స్ బ్రదర్ నుంచి కానీ సిస్టర్ నుంచి కానీ బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ వైఫ్ హూ ఎవర్ ఇట్ మే బి ఎవరి నుంచి సానుభూతి కోరుకోవద్దు మీ పని మీరు చేయండి ఇక్కడ ఇబ్బంది అవుతుంది వేరే పని ఏదో చూసుకుని దాంట్లో కొంత మనం శక్తివంతులం అయితే ఇక్కడ కూడా బాగా చూస్తారు ఇప్పుడు మనకి ఇప్పుడు నాకు నా క్లైంట్స్ వస్తారు క్లైంట్స్ ఎందుకు నాతో చాలా రెస్పెక్ట్ గా మాట్లాడుతారు అంటే నేను వీళ్ళు కాకపోతే వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాను కౌన్సిలింగ్ ఒక్కడే క్లైంట్ అనుకోండి వాళ్ళు ఎలా మాట్లాడినా నేను అప్పుడు వాళ్ళకి లొంగి మాట్లాడాల్సి ఉంటుంది ఎందుకు వాళ్ళు నాకు లొంగుతున్నారు బికాజ్ నాకు నువ్వు కాకపోతే 14 మంది క్లైంట్స్ ఉంటారు రైట్ అలా ఒక ప్రొఫెషన్ కాకపోతే ఇంకొక ప్రొఫెషన్ మనం చేయగలము అనేటువంటి ప్లాన్ బి ఎప్పుడైతే ఉంటుందో అంటే ఒకే దాంట్లో మనం ఉన్నాం నేను ఒక సింగర్ ని అనుకుందాం పాటలు పాడతాను పాటలు పాడటం తప్ప నాకు ఇంకేమీ రాదు అనుకోండి అప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్లు కంపోసర్స్ వీళ్ళందరూ ఎట్లా అంటే అట్లా నన్ను ఆడుకుంటారు అలా కాకుండా పాటలు పాడుతాను అవసరమైతే డాన్స్ చేస్తాను లేకపోతే వ్యవసాయం చేయగలుగుతాను లేకపోతే మరొకటి ఏదో చేయగలుగుతాను ఎంతో కొంత నా జీవనానికి నేను ఏదైనా చేసుకోగలను అన్నప్పుడు ఇక్కడ పాటలు పాడే ఆ కంపోసర్స్ ఎక్కువ డామినేట్ చేయలేరు పాటలు పాడటం మాత్రమే వచ్చి కంపోసర్ ఇట్లా చేశాడు అట్లా చేశాడు మానిపులేట్ చేశాడు నన్ను అని ఏడ్చుకుంటా కూర్చుని వేరే ఎవరెవరో సానుభూతి చూపించాలంటే వాడు మళ్ళీ మానిపులేట్ చేస్తాడు కాబట్టి మనిషి ఎప్పుడు కూడా ఎవరి నుంచి సానుభూతి కోరుకోవద్దు ఎవరు సానుభూతి ఇచ్చినా అది వాళ్ళ స్వార్ధం కోసం ఇస్తారు అదేమి స్వార్ధం ఏమి తప్పు కాదు మనం కోరుకుంటున్నాం వాళ్ళు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి మనకి కాబట్టి ఎవరి నుంచి సానుభూతే కోరుకోవద్దు మీ ఎబిలిటీని పెంచుకోండి ఇంకా మీ సామర్థ్యాన్ని పెంచుకోండి మీరు ఎంత మంచోళ్ళు అనవసరం మనం ఎంతసేపు ఏం చేస్తాం సమాజంలో మంచిగా ఉంటే మంచిగా ఉంటారు సమాజంలో మీరు మంచిగా ఉన్నంత మాత్రం మంచిగా ఉండరు మీరు ఒక బస్సులో వెళ్తున్నారు బస్సుకి ఒక డ్రైవర్ ఉన్నాడు అతను చాలా మంచివాడు కానీ డ్రైవింగ్ రాదు బస్సు ఇస్తారా ఇవ్వరు ఇంకొకడు అంత మంచివాడు కాదు డ్రైవింగ్ బాగా అవ్వచ్చు ఎవరికి ఇస్తారు అప్పుడు డ్రైవింగ్ వచ్చిన వాడికి ఇస్తారు ఇంకొకతను మంచివాడు డ్రైవింగ్ కూడా అవ్వచ్చు అప్పుడు అతన్ని చూసుకో అంటే ప్రయారిటీ ఫస్ట్ దేనికి ఇస్తున్నాం మనము సామర్థ్యానికి సామర్థ్యం లేనటువంటిది నీ మంచితనం వేస్ట్ నేను చాలా మంచి వాడిని నేను కమిటెడ్ గా ఉన్నాను నేను చాలా మంచి దాన్ని కమిటెడ్ గా ఉన్నాను వేస్ట్ భర్తకు బోర్ కొడుతుంది భార్యకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి మంచితనంతో పాటు సామర్థ్యం ఉండాలి సామర్థ్యం ఉంటే డబ్బు సంపాదించడమే కాదు అనేక విషయాల్లో ప్రాబ్లం మనసు వచ్చినప్పుడు సాల్వ్ చేయటం ధైర్యంగా నిలబడటం ఆ వ్యతిరేక మనకి ఆ వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడటం పిల్లలకు అండగా నిలబడటం సమాజానికి అండగా నిలబడటం ఇటువంటి అనేక విషయాల్లో తనకి సామర్థ్యం ఉన్నట్లయితే అప్పుడు ఇతరులు మనకి మన మీద ఆధారపడతారు మనల్ని నమ్ముతారు సామర్థ్యం లేనటువంటి మంచితనం ఉన్నంత మాత్రాన సమాజం మన మీద ఆధారపడ పడదు కాబట్టి మనం నేను మంచివాడిని అయినా నాకేష్ కష్టాలు వస్తున్నాయి నేను ఎంత మంచి చేసినా నన్ను ఇట్లాగే చేస్తున్నారు అని ఏడ్చుకుంటూ సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తాము అట్లా చేయకుండా కేవలం సామర్థ్యం పెంచుకోవడం ఒక్కటే టార్గెట్ మంచిగానే ఉండండి మంచిగా ఉండేది ఎవరో మనతో మంచిగా ఉంటారని కాదు మన పట్ల మనకు గిల్ట్ లేకుండా ఆరోగ్యంగా ఆహ్లాదంగా పాజిటివ్ గా ఉండటం కోసం మనము నా పట్ల నా నేను మంచిగా ఉంటున్నాను అంతే తప్ప ఎవరో మంచోడు అనటం కోసం కాదు కానీ సమాజంతో డీల్ చేసేటప్పుడు మంచితనం పక్కన పెట్టి మీ సామర్థ్యంతో డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటది కాబట్టి సానుభూతిని కోరుకున్న కొద్దీ మనము అక్కడే ఆగిపోతూ ఉంటాము ముందుకు వెళ్ళాలి అంటే సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి సర్ ఇలాగే ఒక ఫీమేల్ అవ్వనివ్వండి మేల్ అవ్వనివ్వండి ఒంటరిగా ఉన్నప్పుడు తనకి ఏదైనా బాధలు అనిపిస్తే ఎవరి దగ్గర అయినా షేర్ చేసుకుంటే ఆ బాధ తగ్గుతుంది అని అంటారు చాలా మంది అలా షేర్ చేసుకోవడం కూడా బలహీనతే అంటారా వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ నాకు ఒక 10 లక్షలు అప్పు ఉంది అనుకోండి మీతో షేర్ చేసుకుంటే ఎంత అప్పు తీరుతది ఒక్క రూపాయి కూడా తీరదు షేర్ చేసుకుంటే ఏమి బాధ తీరదు అప్పటికి టెంపరరీ రిలీఫ్ వస్తది అంతే ఓకే అయితే షేర్ చేసుకోవద్దా అంటే ఎవరితో షేర్ చేసుకుంటాం చాలా ఇంపార్టెంట్ ఉమ్ వాళ్ళు రేపు పొద్దున మనం మానిపులేట్ చేసే అవకాశం ఉంది ఈరోజు మనతో వాళ్ళు మంచిగానే ఉండొచ్చు కానీ పరిస్థితులు మారుతూ ఉంటాయి ఈ బాధ ఎందుకు జరిగింది గతంలో ఎవరితోనో మనం మంచిగా ఉంటే వాళ్ళు మనల్ని ఏదో అవమానించారు ఏదో జరిగింది అంటే గతంలో వాళ్ళని నమ్మితేనే కదా అవును ఈ రోజున వీళ్ళని నమ్మి వీళ్ళతో షేర్ చేసుకుంటాం రేపు పొద్దున పరిస్థితి మారుతుంది మారినప్పుడు వాళ్ళు దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తారో తెలియదు కదా కాబట్టి షేర్ చేసుకుంటేనే నా బాధ తీరుతుంది అనేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉండకూడదు షేర్ చేసుకున్నా చేసుకోకపోయినా కేవలం ఈ ఎమోషన్ ఇది ఎమోషన్ పోతది బాధ ఎక్కువ కాలం ఉండదు మీ శరీరము బాధను బయటికి తోసేస్తది అండ్ ఆనందం కూడా ఎక్కువ సేపు ఉండదు ఆనందం కూడా వెళ్ళిపోద్ది ఎక్కువ ఎప్పుడు ఆనందంగా ఉండే వాళ్ళు ఎవరు ఉండరు ఎప్పుడు బాధలో ఉండటము జరగదు మీరు షేర్ చేసుకోకపోయినా బాధ తగ్గిపోతుంది అయితే మీకు మంచి ఫ్రెండ్ ఉండి అంటే రిలయబుల్ గా ఉండి ఉన్నప్పుడు షేర్ చేసుకోవచ్చు తప్పేమీ లేదు కాకపోతే వాళ్ళు మిస్ యూస్ చేస్తే చేసే అవకాశం లేనప్పుడు మీరు షేర్ చేసుకోవచ్చు రైట్ కానీ షేర్ చేసుకుంటే బాధ పోతుంది అనేది తప్పు టెంపరరీ రిలీఫ్ వస్తది కొంత దానికంటే కూడా బాధలు ఉంటాయి ఎవరికైనా ఉంటాయి నాకు కూడా ఉంటాయి బాధ లేని జీవితం ఉండదు సఫరింగ్ ఉంటుంది సఫరింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ దాన్ని మీరు లైఫ్ ని సపరేట్ చేయలేరు ప్రతి ఒక్కరికి సఫరింగ్ ఉంటుంది సఫరింగ్ మీరు వద్దు అనుకున్నది అప్పుడు ఇంకా ఎక్కువ సఫరింగ్ అవుతుంది సఫరింగ్ ఒక పెయిన్ ఇస్తుంది ఆ సఫరింగ్ వద్దు అంటే నాకు వద్దు అనేది నాతో ఉంటుంది అది ఇంకొక పెయిన్ రైట్ ఇప్పుడు ఒక అమ్మాయి మీతో పాటు ఉంటుంది ఆ అమ్మాయి మీకు మీతో పాటు ఉండటం మీకు ఇష్టం లేదు అనుకోండి పెయిన్ కదా సఫరింగ్ ఏ పెయిన్ సఫరింగ్ వద్దు అనుకుంటున్నాను మళ్ళీ నాతో ఉండొద్దు దాని వల్ల ఇంకొక పెయిన్ అవుతుంది కాబట్టి బాధలు జీవితంలో ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి మీరు ఎంత బాధపడితే అంత మళ్ళీ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి బాధ లేకుండా ఎవరు లేరు ఈ భూమి మీద బాధ లేని వాళ్ళు ఎవరు లేరు మీకంటే నాకంటే ఎక్కువగా అంబాని కొడుకు బాధపడుతున్నాడు తన ఆరోగ్యం బాగోక మీకంటే నాకంటే ఎక్కువగా కూడా సత్యనాథ్ తన కుమారుని కోల్పోయి బాధపడుతున్నాడు రైట్ అమెరికాలో అందరూ హ్యాపీగా ఉన్నారా లేరు అక్కడ గన్లు పెట్టి షూట్ చేసుకుంటున్నారు అండ్ డ్రగ్స్ ఉన్నాయి పోనీ నైజీరియాలో అందరూ ఏడుస్తూ కూర్చుంటున్నారా అక్కడ హ్యాపీగా ఉన్నవాళ్ళు ఉన్నారు ఈ సామాజిక పరిస్థితికి నిజమైనటువంటి ఆనందానికి ఏ సంబంధం లేదు అది మనిషి యొక్క ఆటిట్యూడ్ కి సంబంధించింది సో బాధను యాక్సెప్ట్ చేసినట్లయితే బాధ తగ్గుతుంది బాధ నాకు వద్దు అనుకున్నట్లయితే మరింత పెరుగుతుంది ఉంటుంది ఇప్పుడు వర్షం పడుతుంది అబ్బా వర్షం పడుతుంది వర్షం పడుతుంది తిట్టుకుంటున్నాం అనుకోండి పెయిన్ పెరుగుతుంది వర్షం ఉంటది వర్షాన్ని ఆస్వాదించండి ఆ తర్వాత వర్షం పోయిన తర్వాత ఎండ వస్తే దాన్ని ఆస్వాదించండి చలి వస్తే దాన్ని ఆస్వాదించండి కాబట్టి యాక్సెప్ట్ ద సొసైటీ యాస్ ఇట్ ఇస్ ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేయండి బికాజ్ దట్ ఇస్ ట్రూ మనుషులంతే ఉన్నారు ఉంటారు అదే నిజం రైట్ యాస్ ఇట్ ఇస్ గా యాక్సెప్ట్ చేయండి ఇలా ఉండొద్దు అతను దేవుడు చెప్పడానికి అతను అంతే అతని పరిస్థితి అది అతను ఉన్నాడు మంచో చెడు ఎవరిని రిజెక్ట్ చేయొద్దు ఎవరి మీద ద్వేషం పెంచుకోవద్దు ఇబ్బంది ఉంటే దూరంగా ఉండు ద్వేషించవద్దు రైట్ కాబట్టి ఒకరితో చెప్పుకుంటే బాధ తగ్గదు అంటే టెంపరరీ రిలీఫ్ రావచ్చు తప్ప బాధ ఏమి తగ్గదు అక్కడ కొంత ఎస్కేప్ అవుతున్నాం ఎస్కేప్ అవుతున్నాం తప్ప పూర్తిగా బాధ తగ్గటం అనేది ఒకరికి చెప్పుకోవడం వల్ల అయితే జరగదు ఓకే సర్ అలాగే బాధలు ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఉన్నప్పుడు ఏదైనా వర్క్ లో పడిపోతే బిజీ బిజీ లైఫ్ అనేది చేసుకుంటే గనుక వాటన్నిటికీ దూరం అవ్వచ్చు అంటారు అది మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది అంటారా రెండు ఉన్నాయి ఒకటి ఒకటి బిజీ అయినంత మాత్రాన బాధ పోతది అని ఏం లేదు ఓకే బిజీ లేకపోయినా సరే మనం ఫ్రీగా ఉండాలి అంటే దానికి సంబంధించిన మూల కారణాన్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి కౌన్సిలింగ్ లో అది తెలుసుకుంటాం మనం రెండోది బిజీ అవ్వటం వలన ఏమవుతుంది అంటే బాధ ఉంది కాబట్టి ఏడ్చుకుంటా కూర్చోవడం వల్ల ఫలితం ఏం రాదు బాధ పెరుగుతుంది ఫ్యూచర్ లో దాని బదులు నేను పని చేస్తున్నాను నాకు బాధ ఉంది ఎవరో నన్ను తిట్టారు బాధ ఉంది ఏడ్చుకుంటా కూర్చున్నాను అనుకోండి రేపటికి ఏమవుతుంది ప్రొడక్షన్ లేదు కాబట్టి ఇంకొకడు కూడా తిడతారు నన్ను అలా కాకుండా వాడు తిట్టాడు తిట్టనివ్వండి నేను వచ్చి నా పని చేసుకున్నాను ఈరోజు రేపటికి ప్రొడక్షన్ వచ్చింది రెండో వాడు తిట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి కచ్చితంగా పని చేయండి కానీ మూల కారణాన్ని కూడా హ్యాండిల్ చేసుకోవాలి మూల కారణం హ్యాండిల్ చేయలేదు కాబట్టి ఏడ్చుకుంటూ కూర్చోమనట్లేదు రెండు వైపులా దాన్ని చదువు చేయాల్సినటువంటి అవసరం ఉంటది మూల కారణం మన ఎక్స్పెక్టేషన్ నన్ను ఎవ్వరు తిట్టొద్దు తిడతారు కచ్చితంగా అందరూ మిమ్మల్ని పొగుడుతూ ఉండటం సాధ్యపడదు ఎవరిని పొగడరు ఇతడు మనకు గొప్పవాడు తన భార్య పిల్లలకి అంటే ఆమె ఏం చూస్తుందో అప్పుడు తెలియదు ఒకవేళ ఈ ఇప్పుడైతే మనకు గొప్పవాడు లక్ష్మణుడు భార్యకి నువ్వు పోతే పోయావు నీ భార్యని తీసుకెళ్లి ఆమె ఏదో అమాయకురాలు వస్తుంది నా భర్తని ఎందుకు పట్టుకుపోతున్నావ్ నేనేం తప్పు చేశాను అంటే ఆ రోజుల్లో మనకు తెలుసు ఈ రోజుల్లో అయితే దుమ్మెత్తి పోస్తారు కదా కేసు పెడతారు ఆ కదమ్మా కాబట్టి ఒక కాంటెక్స్ట్ లో పాజిటివ్ అయినంత మాత్రాన ఇంకో అన్ని కాంటెక్స్ట్ లో పాజిటివ్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకరికి నేను మంచివాడిని అయినంత మాత్రాన అందరికీ మంచి అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి డెఫినెట్ గా మనల్ని మాటలు అంటారు అన్నా సరే మీ పని మీరు చేసుకుంటుంటే మాటలు అనే వాళ్ళ యొక్క సంఖ్య కొంత తగ్గుతుంది మొత్తం పోదు ఎప్పటికీ మొత్తం పోదు ప్రపంచంలో అందరిని మెప్పించడం అనేది ఎప్పటికీ మీ వల్ల కాదు థాంక్యూ సార్ చూశారు కదండీ ఇలాంటి మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందు ఉంటాం అంతవరకు సెలవు నమస్తే 

No comments:

Post a Comment