Tuesday, December 2, 2025

 🌺🛕🌺🛕🌺🛕🌺🛕🌺

*డిసెంబర్‌, 2025* 
*పండుగలు పర్వదినాలు*/ 
*తిరుమలలో...* 
*డిసెంబర్ నెల విశేష పర్వదినాల తేదీలు*
            ➖➖➖✍️
          
*డిసెంబర్‌ 01 సోమవారం* 
గీతా జయంతి, మోక్షద ఏకాదశి

*డిసెంబర్‌ 02 మంగళవారం* 
ప్రదోష వ్రతం

*డిసెంబర్‌ 03 బుధవారం*  
జ్యేష్ఠ కార్తె

*డిసెంబర్‌ 04 గురువారం* 
పౌర్ణమి, దత్త జయంతి 

*డిసెంబర్‌ 07 ఆదివారం* 
సంకటహర చతుర్థి

*డిసెంబర్‌ 15 సోమవారం*
మూల కార్తె, ఏకాదశి

*డిసెంబర్‌ 16 మంగళవారం*
ధనుర్మాస పూజ, ధనుర్మాసం ప్రారంభం.

*డిసెంబర్‌ 18 గురువారం*
మాస శివరాత్రి

*డిసెంబర్‌ 19 శుక్రవారం*
అమావాస్య

*డిసెంబర్‌ 24 బుధవారం*
క్రిస్మస్ ఈవ్

*డిసెంబర్‌ 25 గురువారం*
క్రిస్మస్

*డిసెంబర్‌ 26 శుక్రవారం*
స్కంద షష్టి

*డిసెంబర్‌ 27 శనివారం*
అయ్యప్ప స్వామి మండల పూజ

*డిసెంబర్‌ 28 ఆదివారం*
పూర్వాషాఢ కార్తె

*డిసెంబర్‌ 30 మంగళవారం*
పుష్య పుత్రాద ఏకాదశి, వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి
-----------------------------------
*డిసెంబర్‌ 2025...*                          
*పౌర్ణమి, ఏకాదశి తిథులు*

*పౌర్ణమి :* 
*డిసెంబర్ 4వ తేదీ* 
*8:38 AM నుంచి* 
*డిసెంబర్ 5వ తేదీ* *4:44 AM వరకు.*

*అమావాస్య :* 
*డిసెంబర్ 19వ తేదీ* 
*4:59 AM నుంచి* 
*డిసెంబర్ 20వ తేదీ* 
*7:13 AM వరకు.*
-----------------------------------
*తిరుమలలో* 
*డిసెంబర్ నెల విశేష పర్వదినాల తేదీలు..*

డిసెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే పర్వదినాలు, విశేష ఉత్సవాల జాబితాను టీటీడీ అధికారులు విడుదల చేశారు. 
ప్రతి నెలలో శ్రీవారికి నివేదించే కార్యక్రమాలు, పండగలు, వివిధ విశేష ఉత్సవాలకు సంబంధించిన జాబితాను సంబంధిత నెల ప్రారంభానికి ముందే విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా డిసెంబర్‌లో నిర్వహించే పండగల జాబితాను విడుదల చేశారు. 

*2వ తేదీన మంగళవారం* 
చక్రతీర్థ ముక్కోటితో డిసెంబర్ నెల విశేష ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు టీటీడీ అధికారులు. 

శ్రీవారి ఆలయంలో... 
*4వ తేదీన గురువారం* 
కార్తీక పర్వ నిర్వహిస్తారు. 
అదే రోజున తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర ఉంటుంది. 

*5వ తేదీన శుక్రవారం* 
తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం కార్యక్రమం జరుగుతుంది.

*16న మంగళవారం నాడు* 
ధనుర్మాసం ఆరంభమౌతుంది. 
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో తిరుప్పావైని వినిపిస్తారు. 
ఈ మాసంలో తిరుప్పావై పాశురాలను పఠిస్తారు. 
ధనుర్మాసం ముగిసేంత వరకూ ఈ పాశురాలు తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణనాన్ని రెట్టింపు చేస్తాయి. 

*19వ తేదీ శుక్రవారం* 
తొందార్పప్పోడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం ఉత్సవం ఉంటుంది. 
అదే రోజున శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమౌతాయి. 

*డిసెంబర్ 29న సోమవారం* 
శ్రీవారి ఆలయంలో చిన్న శాత్తుమొరను నిర్వహిస్తారు.

*30వ తేదీ మంగళవారం నాడు* 
వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. 
శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మొదలయ్యేది ఆ రోజే. (జనవరి 8వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి.) 
అదే రోజున శ్రీమలయప్ప స్వామివారు.. దేవేరులతో కలిసి స్వర్ణ రథోత్సవం మీద ఊరేగుతారు. 

*31న బుధవారం నాడు* 
వైకుంఠ ద్వాదశి ఉత్సవాలు, శ్రీవారి చక్రస్నానాన్ని నిర్వహిస్తారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. 
ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. 
వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు.. 
అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వ దర్శన టోకెన్లను ఆన్ లైన్ లో కేటాయించనున్నారు. 
కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేస్తారు.

నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేది వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం ఉంటుంది. 
మొదటి మూడు రోజులకు వైకుంఠ ద్వార దర్శనాలకు నవంబర్ 27వ తేది ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1వ తేది సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్ సైట్, మొబైల్ యాప్ లో ఏపీ గవర్నమెంట్ బాట్ లో టీటీడీ ఆలయాల విభాగంలో ఎలక్ట్రానిక్‌ డిప్ కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ✍️

------సేకరణ.

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment