Thursday, January 29, 2026

నీలో ఇవి లేకుండా చూసుకో🌹నీలో ఈ 10 ఉన్నాయా,ఉండాలా చెక్ చేసుకో🌹kanthrisa

నీలో ఇవి లేకుండా చూసుకో🌹నీలో ఈ 10 ఉన్నాయా,ఉండాలా చెక్ చేసుకో🌹kanthrisa

 https://youtu.be/Ya9IiEe9HnI?si=c5QbRh0ugkUCLOaD


https://www.youtube.com/watch?v=Ya9IiEe9HnI

Transcript:
(00:00) ఈ మధ్య అనుకోకుండా ఒక పుస్తకం దొరికింది. ఆ పుస్తకం పేరు అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అని సో ఆ పుస్తకం రాసిన గ్రంథకర్త డాక్టర్ పి భానుమతి గారు ఎంఏ పిహెచ్డి చేశారట ఆవిడ ఎవరో నాకు తెలియదు కానీ ఈ పుస్తకం నన్ను చాలా ఆకర్షించింది దానిలో ఉన్న కాంటెక్స్ట్ గాని చెప్పిన విధానం గాని ఆ దాంతో పాటు ఎన్నో ప్రశ్నలకు ఇందులో సమాధానాలు ఉంది.
(00:35) అవి చాలా అంటే ఎలాంటి వ్యక్తికైనా అర్థం చేసుకునే విధంగా సమాధానాలు ఇచ్చారు ఆవిడ. ఇది పూర్తిగా అద్వైతం అనే ఒక ఆ జీవితం యొక్క మూల అవగాహన చుట్టూ తిరిగే పుస్తకం ఇది. సో ఈ పుస్తకంలో ఉన్న దాదాపు 127 ప్రశ్నలు వాటికి జవాబులు పక్కన పెడితే భగవద్గీత భారతీయత అని ఆ రాసినటువంటి ఒక ఉపోద్గాతం దాంట్లో శ్రీకృష్ణ పరమాత్మ ఆ తర్వాత అర్జునుడు వాళ్ళ మధ్య జరిగినటువంటి సంవాదం ఆ వాళ్ళ యొక్క మానసిక స్థితి తర్వాత ఆధ్యాత్మికత యొక్క ఆ ఏమిటది ఇట్లాంటివన్నీచాల చాలా కూలంకశంగా శాస్త్రోక్తంగా చెప్పిన సందర్భం కనిపించింది నాకు అయితే ఈరోజు నేను చేస్తున్న ఈ చిన్న టాక్ ఆ పుస్తకంలోని 14వ
(01:27) పేజీలో ఉన్నటువంటి ఒక యువత లేదా ఒక మనిషి బలహీన మనస్కుడు అవ్వడానికి కారణం ఏమిటి అని ఒక 10 రీజన్స్ అన్నమాట దానికి కూడా ఆధారం ఆ భగవద్గీత అని తెలుస్తున్నది కాబట్టి ఎలాంటి వ్యక్తి అయినా ఒక వీక్ మైండ్ అనడానికి లేదా జీవితంలో మిజరీని గాని సఫరింగ్ ని గాని ఎక్స్పీరియన్స్ చేయడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఈ రచయిత ఒక 10 అంశాల్ని సూచించింది.
(02:01) ఆ 10 అంశాల గురించి ఊరికే చిన్న వ్యాఖ్య చేద్దామని ఈ టాక్ చేస్తున్నాను. సో ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ 10 అంశాలు నేను క్రాస్ చెక్ చేసుకుంటే ఈ 10 అంశాలు నేను నాలో లేకుండా చూసుకున్నాను. అని తెలిసి చెప్తున్నాను. ఇది వేరే వాళ్ళకి సంబంధించిన విషయం కాదు వేరే వాళ్ళ దృష్టిలో మీరు ఎట్లా ఉంటారు అన్నది అది వాళ్ళ నిర్ణయం కానీ మనం మనకి మనం వ్యక్తిగతంగా ఎట్లా ఉంటాం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ 10 అంశాలు ఏమిటి ఒకసారి ఊరికే చదువుతాను ఆ తర్వాత ఒక్కొక్క దాని గురించి శ్రద్ధగా మాట్లాడుకుందాం కొంచెం కొంచెమే సో ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి సో మొదటిది
(02:42) రానిదాన్ని కోరటం వచ్చిన దాన్ని వద్దనటం రెండో రెండవది పక్కవారితో మనల్ని పోల్చుకొని వారిది సుఖజీవనమని మన జీవితం దుఃఖ భాజనం అని అనుకోవడం మూడవది భ్రమలో బతుకుతూ భ్రమగా గుర్తించకపోవడం నాలుగవది ఆత్మవంచన చేసుకొని తమను తామే తక్కువ వారమని చిన్నబుచ్చుకోవడం ఐదవది కోరికల మూలాలను గుర్తించకపోవడం నివారణకు ప్రయత్నించకపోవడం ఆరవది జీవితాన్ని అస్తిమితంగా అలక్ష్యంగా ఆశయ రహితంగా స్వార్థపూరితంగా తయారు చేసుకోవడం ఏడవది చిన్న చిన్న విషయాలకి కోపం విసుగు తెచ్చుకొని ఆవేశంగా ప్రతిస్పందించడం ఎనిమిదవది లంచగుండితనం దొంగతనం అసాంఘిక కార్యక్రమాలకు ప్రలోభాలకు అతి సులువుగా
(03:26) లొంగిపోవటం తొమ్మిదవది నిష్పక్షపాత నిర్ణయం తీసుకోకపోవటం 10వది జీవితంలో సవాళ్లను ఎదుర్కొందలేక చౌకబారు పద్ధతుల ద్వారా వాటి నుంచి తప్పించుకొని పారిపోవాలనుకోవటం అనుకున్నవి సాధించలేకపోతే ఆత్మహత్యలు చేసుకోవటం ఇట్లా తయారవుతున్నారు అని అర్జునుని పిరికి మనసును నిపం పెట్టి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడని సో అది చాలా ఏళ్ల క్రితం కొన్ని శతాబ్దాల క్రితం చెప్పినప్పటికిని ఇప్పటికి ఎందుకు రెలవెంట్ గా ఉంది అంటే దానికి కారణం అందులో ఉన్నటువంటి ఆ ఉద్ధరేదాత్మ ఆత్మానాం అంటే ఎవరి జీవితాన్ని ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి అంటే వేరే కారణాల చేత
(04:10) కార్యకారణాల చేత వచ్చిపోయే విషయాల మీద చుట్టుపక్కల వాళ్ళ ప్రవర్తన చేత నీ జీవితం ఉంది అనుకుంటే ఎప్పటికీ నువ్వు జీవితంలో ఆనందంగా ఉండేటువంటి అవకాశం లేదనేది ఇందులో స్పష్టంగా సో ఇప్పుడు మొదటిది చూద్దాం రానిదాన్ని కోరటం వచ్చిన దాన్ని వద్దనం నిదన్న ఒక టాక్ చేశను ఇంటు ద వైల్డ్ అనే సినిమా గురించి మాట్లాడుతూ అందులో ఏంటి ఉన్నది నచ్చదు లేనిది కావాలనిపిస్తుంది.
(04:35) సో మన జీవితంలో మనకంటూ ఒక పరిధి ఉంది అవునున్నా కాదన్నా ఆల్రెడీ మన జీవితంలో ప్రకృతిపరంగా పొందినవి ప్రాపంచిక పొందినవి ఎన్నో ఉన్నాయి. మనం వాటిని విస్మరిస్తాం మన మైండ్ విస్మరిస్తుంది. ఏదైతే లేదో అది కావాలి కావాలి కావాలని ఒక తాపత్రయం ఏర్పడుతుంది. ఒక చిన్న కథ విన్నా నేను ఇది చాలాసార్లు చెప్పున్నాను.
(05:03) ఒక తల్లి పిల్లవాడు ఇద్దరు రోడ్డు మీద వెళ్తున్నారట. అప్పటికే భోజనం చక్కగా ఉండి పెట్టింది ఆ పిల్లవాడు సంతృప్తి చెందాడు కానీ రోడ్డు మీదకి రాగానే ఒక ఆపిల్ పండు అమ్మేవాడు కనిపించాడు. నాకు ఆపిల్ పండు కావాలని ఏడుస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పింది ఆల్రెడీ తిన్నావు కదరా ఇప్పుడు ఆపిల్ పండు అక్కర్లేదంటే లేదు నాకు కావాలి అన్నాడు. చాలా గొడవ పడ్డ తర్వాత చుట్టుపక్కల వాడితో పిల్లవాడే కదమ్మా ఆపిల్ పండు ఇప్పించాను అంటే ఇప్పించింది.
(05:30) ఇప్పించిన తర్వాత దాంతో సంతృప్తి చెందక నాకు మరొక ఆపిల్ పండు కావాలని ఏడ్చాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ ఉంది ఒకటి తిను ఉంది కదా దాన్ని తిను అంటే లేదు నాకు ఇంకొటి కావాలని మళ్ళీ కథ కాబట్టి ఇంకొకటి కూడా అయిపించింది కానీ తల్లికి నచ్చలేదు. ఎందుకంటే చక్కటి భోజనం వండి పెట్టిందంతా నిష్ఫలం అయిపోయింది. సంతృప్తి లేని జీవితం వీడిది అనుకుంది.
(05:49) ఇప్పుడు మూడో ఆపిల్ పండు కావాలని నేరుస్తున్నాడు. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా హర్షించలేదు. కానీ ఏదేమైనా నాకు కావాలని పట్టుపడితే ఇక విధి లేక తల్లికి ఏదో పని ఉంది వెళ్ళాలి కాబట్టి వీడు రాకపోతే కష్టం కాబట్టి ఆ మూడో ఆపిల్ పండు కూడా ఇప్పిస్తే అది ఎక్కడ పెట్టుకోవాలో తెలియలే సో ఆ రెండు ఆపిల్ పండ్లని రెండు చేతులో పట్టుకొని వాటిని చాతి ఆనించుకొని ఆ మూడో ఆపిల్ పండుని పైన పెట్టమని చెబితే ఆ పైన పెట్టగానే నవ్వాడు ఎందుకంటే తన మనసు శాంతించింది.
(06:16) ఇప్పుడు ఇలా ఒక్క అడిగేసలోపు ఆ పైన ఉన్న ఆపిల్ పిండు జారి ఆ బుడదలు పడిపోయింది. అప్పుడు ఆ పిల్లవాడు తన చేతిలో ఉన్న రెండు ఆపిల్ పళ్ళని నీళ్లక వేసుకొట్టి ఆ బురదలో పడ్డ ఆపిల్ పండు కోసం ఏడుస్తున్నాడట అంటే వచ్చిన దాన్ని విస్మరించడం తన దగ్గర లేని దాన్ని కోరుకోవడం వల్ల మనిషి ఒక బలహీన మనసుగా మారతాడు అనేది దాని సారాంశం. తర్వాత పక్కవారితో మనల్ని పోల్చుకో రెండవది వారిది సుఖ జీవితం అని మనది దుఃఖ జీవితం అని అనుకోకూడదు.
(06:51) సో కృష్ణమూర్తి గాని ఈ జీవితంలో ఆధ్యాత్మికతను ప్రబోధించిన వాళ్ళందరందరూ ఈ చిన్న విషయాన్ని చెప్పారు డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడీ సో నిన్ను నువ్వు చూసుకో నిన్ను నువ్వు ప్రశ్నించుకో నీ ప్రవర్తన ఎలా ఉంది నీ మాటతీ ఎలా ఉంది అనేదానికి నీవే ఒక గీట్రాక నిన్నటికి ఈరోజుకి నీలో ఒక సహజమైన పరివర్తనకు ద్వారాన్ని ఓపెన్ చేయ అంతేగని పక్కవాడితో పోల్చుకున్నాం అనుకో వాడు ఏ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఒక సెలబ్రిటీ లా ఉండాలని అనుకున్నావ్ ఒక టెండూల్కర్ కావాలనుకున్నావ ఎప్పటికి అవుతావ్ ఎందుకంటే అతను పుట్టిన సందర్భం అతని చుట్టూ ఉన్న డబ్బు అతనికి సహకరించిన
(07:25) సమాజం అతని పరిస్థితులు అతనికి జన్మతః ఉన్న రిసోర్సెస్ అతని శరీర సౌష్టం ఇవన్నీ కలిసి ఒక వ్యక్తిగా తయారయ్యాయి. ఒక వ్యక్తిగా మార్చాయి. ఇప్పుడు అది దాన్ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం అనుకోండి మన జీవితంలో అట్లా అవ్వలేము మన జీవితంలో ఏది అవ్వాలనుకున్నామో అది అవ్వలేము. అందుకని పక్కవారితో పోల్చుకోకూడదు.
(07:46) ఇప్పుడు నేను కూడా జీవితాన్ని అర్థం చేసుకునే 10 తేలికైన మాటల్లో పోల్చుకోవద్దు అండ్ ఒపీనియన్స్ క్రియేట్ చేసుకోవద్దు అట్లాగే జడ్జ్ చేయొద్దు అని చెప్తున్నాను. దానికి కారణం ఏమిటి దానివల్ల యు బికమ్ వీక్ మూడవది భ్రమల్లో బతుకుతూ భ్రమగా గుర్తించకపోవడం ఇది చాలా అత్యంత ముఖ్యమైన అంశంగా నా అబ్జర్వేషన్ లో తెలుస్తుంది చాలా మందికి ఏదో భ్రమ ఉంటది బట్ ఆ విషయం కూడా వాళ్ళకి తెలియదు. వేరేవాళ్ళు చెబితే వినరు.
(08:13) ఇప్పుడు నేను ఆ చాలామందికి చెప్పే ప్రయత్నం చేసింది నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే వాడికి ఎంత చెప్పినా అర్థం కాదది కాలం వల్ల తను తెలుసుకోవాల్సిందే అందుకని ఏవైతే భ్రమలు ఉన్నాయో రకరకాల భ్రమలు ఉంటాయి. ఆ ఇప్పుడు నేను గ్రేట్ అని ఒక భ్రమ ఉంటది. మా కులమే గొప్పది అని ఒక భ్రమ ఉంటది. ఇట్లాంటివేవో మనుషు క్యారీ చేస్తున్నాడు.
(08:45) దానికోసం పాకలాడుతూ ఉంటాడు. సో అది భ్రమ అని గుర్తిస్తే గుర్తించడమే భ్రమ వెళ్ళిపోతుంది అన్నమాట. సో నాలుగవది ఆత్మవంచన చేసుకొని తమను తామే తక్కువ వారమంచింది పుచ్చుకోవడం సో ఈ ప్రకృతిపరంగా ప్రాపంచికంగా నీకు ఉన్నదే దాన్ని నువ్వు గుర్తించకపోగా వేరే వాళ్ళతో పోల్చుకొని అట్లా బాధపడడం అనేది కూడా కరెక్ట్ కాదనేది ఒకటి ఐదవది అత్యంత శక్తివంతమైనది ముఖ్యమైనది ముఖ్యమైనది కోరికల యొక్క మూలాలను గుర్తించకపోవడం వాటి నివారణకు ప్రయత్నించకపోవడం సో మనసు అనేది దేన్ని పడితే దాన్ని కోరుతది దాని స్వభావం అది మరి ఆ కోరినవన్నీ మన జీవితంలోకి వస్తాయి
(09:21) అంటే దాదాపు 90% మంది 90 శాతం కోరికలు నెరవేరవు ఒకడికి హీరో అవ్వాలి ఉండొచ్చు ఒకడికి ఒక పెద్ద కంపెనీ పెట్టాల ఉండొచ్చు లేదా ఒక ధనిక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉండొచ్చు లేదా పొడుగు పెరగాల ఉండొచ్చు కోరిక ఏదైనా కోరొచ్చు మా ఊర్లో అందరికంటే నేనే ఫేమస్ అవ్వాలని కోరుకోవచ్చు ఈ ప్రపంచంలో అందరూ నన్నే గుర్తించాలని కోరుకోవచ్చు బట్ కోరిక కోరడం చాలా చిన్న విషయం ఆ కోరిక కోరిన తర్వాత అది నేను నెరవేర్చుకునే సామర్థ్యం గాని రిసోర్సెస్ గానీ ఆ శరీర మనోధర్మాలు గాని తనకు ఉన్నాయా అటువంటి అవగాహన ఉందా క్రాస్ చెక్ చేసుకోవాలి. లేదా ఆ కోరికని ఆ కోరే
(10:01) విధానాన్ని ఆ కోరే వైకరిని నివారించుకోవాలి లేకపోతే జీవితం నరక ప్రాయంగా మారుతుంది. తర్వాత ఆరవది అత్యంత ముఖ్యమైనది జీవితాన్ని అస్తిమితంగా అలక్ష్యంగా ఆశయరహితంగా స్వార్థపూరితంగా తయారు చేసుకోవడం ఇది కూడా ఆ కన్సిస్టెంట్ గా పని చేయకపోవడం ఈరోజు ఒక పని మీద ఆసక్తి ఐదారు రోజులు కొనసాగించడం మళ్ళీ ఏదో కార్యకారణం చేత ఆ ఆసక్తిని కోల్పోవడం మళ్ళీ ఇంకొక దాన్ని పట్టుకోవడం సో లైఫ్ అంతా వృధా అయిపోయిందని ఆ నిరాశ పడడం నీకు సాధ్యమైంది నీకు చేయాలి నువ్వు చేయాలన్న స్పృహ కలగకపోవడం వేరే వాళ్ళలాగా చేయాలని తొందర పడటం తర్వాత తర్వాత అనుకున్న సమయం
(10:38) కంటే తక్కువ సమయంలో చేయాలని ఉబ్బలాట పడటం అలా అవ్వకపోతే తను తాను నిందించుకోవడం ఇదంతా తప్పు అందుకని మొట్టమొదట చదవాలనుకునేవాడు చదవడం తర్వాత ముందు ఎంతసేపు చదవాలనుకుంటున్నాడో అంతసేపు కూర్చోవాలి. అట్లా ఒక వన్ మంత్ కూర్చున్న తర్వాత కూర్చోవడం అలవాటది. కూర్చోవడం అలవాటయిన తర్వాత ఒక వన్ మంత్ ఏదో ఒకటి చదువు ఆ తర్వాత నువ్వు చదవవలసింది చదివేటువంటి ఒక మానసిక ఆకాశం అనేది ఏర్పడుతది.
(11:04) సో అందుకని ఏదో ఒక చిన్న జీవితానికి ఒక సహజమైన లక్ష్యం ఉండాలి అది నీ పరిధిలో ఉండాలి దాన్ని నిరంతరం కొనసాగించాలి. అవి ఒక గృహిణి తను ప్రతిరోజు ఇల్లును క్లీన్ పెట్టుకోవడం గాన లేకపోతే ఒక క్లీన్ చేసేవాడు వీధిని క్లీన్ చేయడం గాన ఉద్యోగ ధర్మంలో కాకుండా వ్యక్తిగత ఆసక్తితో వ్యక్తిగత ధర్మాన్ని నిర్వర్తించేటువంటి ఒక కళ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ.
(11:27) అందుకని కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. తర్వాత దేని పట్ల అధికమైన ఆ ప్రేమ గాని లేకపోతే అంతులేని వైరాగ్యం గాని పనికిరాదు. ఒకదాన్ని ఎంచుకున్న తర్వాత ఇష్టా ఇష్టాలకు అతీతంగా దాన్ని కొనసాగించేటువంటి ఒక మానసిక పరిపక్వత ఉండాలి. తర్వాత ఏడవది చిన్న చిన్న విషయాల యొక్క కోపం విసుకు తెచ్చుకొని ఆవేశంతో ప్రతిస్పందించడం కోపం రావడం తప్పు కాదు.
(11:49) కానీ ప్రతిదానికి కోపపడడం ప్రతిదానికి వాదులాడడం ప్రతిదానికి వితండవాదం చేయడం అంత ఆరోగ్యకర లక్షణం కాదు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వే ఒక ఐలాండ్ గా మారిపోతావు రాను రాను నీ వయసు పెరుగుతున్న కొద్ది నీ సమక్షంలోకి ఎవరు రారు అదే సంకేతం అందుకని కాస్త పట్టు వేడుపు ఉండాలి. నువ్వు చెప్పిందే వినాలనుకోకుండా ఎదురు వ్యక్తి చెప్పేది కూడా నువ్వు విను ఆ తర్వాత ఇది సమాజానికి సంబంధించింది లంచగుండితనం గాన దొంగతనం గాన అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం గాన ప్రలోభాలకు లోకం గాన ఇట్లాంటి ఒక వీక్ మైండ్ ఉండడు సులువుగా లొంగిపోవడం నేను చాలాసార్లు
(12:21) ఇంటర్నెట్ లో చూస్తాను యూత్ అంతా కలిసి హటాత్తుగా ఏదో అనిపిస్తది మన భారత జాతీయ పతాకాన్ని నీళ్లకి తొక్కుతారు ఒక వీడియో చేస్తారు కానీ తర్వాత రిపర్కాషన్స్ ఎట్లా ఉంటాయి అని ఆలోచించరు. ఏదో ధర్ణ జరిగింది అటాతగా ఎవడు అంటాడు రాయేసి కొడదాం రా అంటాడు రాయేసి కొడతారు అది సిసిీ కెమెరాలో పడుతుందని తెలియదు పడ్డ తర్వాత కుటుంబానికి ఆ అతనికి అతని చదువుకి అతను చేసే పనికి అంతా అది ఆటంకంగా మారిపోతది.
(12:45) ఆ తర్వాత ఎంత విలుపించినా కూడా ఆ సమయాన్ని వెనుక్కి తీసుకురాలేవు ఆ సంఘటన నుంచి నువ్వు బయటికి రాలేవు. సో చాలామంది మనల్ని మనిపులేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. స్పృహ లేకపోతే లొంగిపోవడం ఉంటదిన్నమాట. ఇప్పుడు కొందరు ఏదో ఒక జూదనలో పడడం గానీ లేకపోతే దుర్వ్యసనాలు అలవాటు చేసుకోవడం గాన అది వేరే వాళ్ళ మనిపులేషన్ వల్ల లొంగి ఇక చివరికి అది లేకపోతే జీవితం లేదు అనే పతన స్థాయికి చేరుతారు.
(13:15) సో ఇది కూడా ఆలోచించుకోండి. తర్వాత నిష్పక్షపాత నిర్ణయం తీసుకోకపోవడం తొమ్మిది. ఇప్పుడు స్వాపర భేదాలు ఉండకూడదు ఆధ్యాత్మికతలో ఎందుకంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నది ఒక సాదాసిద్ధ జీవితం కాదు ఒక అత్యుత్తమ ప్రమాణంతో ఈ సమాజంలో గాని వ్యక్తిగతంగా గాని ప్రకృతికి అనుసంధానంగా గాని ఎట్లా జీవించాలి బాధ్యతల్ని కర్తవ్యాలని ఎట్లా విస్మరించకుండా వాటి మధ్య ఉంటూ సామరస్యం పోకుండా ఎట్లా జీవించాలిఅనే కాంటెక్స్ట్ కాబట్టి ఏదనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అన్బయాస్డ్ గా ప్రిజుడిస్ లేకుండా నిష్పక్షపాతంగా తీసుకోవాలి. దాని పర్యవసానలు ఏదైనా కూడా
(13:50) భవిష్యత్తులో దాని యొక్క ఆ రిజల్ట్ అనేది చాలా బాగుంటుందనేది అనుభవం చెప్తున్నది. తర్వాత అత్యంత ముఖ్యమైనది లాస్ట్ ది 10వది సో జీవితంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి సొల్యూషన్ వెతక్కుండా ఏదో ఒక చౌకబారు పద్ధతిలో సమాధానాన్ని వెతుక్కొని దాని వల్ల సమయాన్ని వృధా చేసి డబ్బు వృధా చేసి చివరికి నువ్వు అనుకున్నది మేనిఫెస్ట్ కాలేదని బాధపడి తర్వాత అట్లా ప్రాణం త్యాగం చేసి అట్లా కుటుంబాన్ని నష్టం చేసి అట్లా ఒక నిరాశ నిస్పృహలోకి ఎంటర్ అవ్వడం అనేది నేను దాదాపు అడప దడప చాలా మంది నా దగ్గరికి వచ్చి నప్పుడు వాళ్ళ మాటలు విని అర్థం చేసుకున్నది.
(14:29) సో అది రాంగ్ ఆటిట్యూడ్ ఏదైనా సమస్య రావచ్చు పెద్దది గాని చిన్నది గాని దాన్ని నువ్వు చూడు చేయగలవా అందుకే నేను ఒక చిన్న కాన్వర్సేషన్ చేశాను అందులో ఏం చెప్పాను సమస్య వచ్చినప్పుడు మూడు సందర్భాలు ఉంటాయి నీకు ఆ సమస్యను నువ్వు సాల్వ్ చేయగలిగితే చెయ్యి ప్రశాంతంగా. రెండవది ఆ సమస్యను వేరే వాళ్ళు చేయగలరు అని తెలిస్తే వాళ్ళకి అప్పచెప్పు. లేదా వాళ్ళతో కలిసి పని చెయ్.
(14:51) మూడోది సమస్యకు సాల్వేషన్ లేదు లేదా పరిష్కారం లేదని తెలిస్తే ప్రశాంతంగా ఉండు దీనికి పరిష్కారం లేదని చెప్పు. ఏ విధంగా చూసినా కూడా నీకు ప్రశాంతత దెబ్బ తినకుండా ఈ మూడు సందర్భాల్లోను మనిషి ప్రవర్తించొచ్చు. కానీ మనం ఏం చేస్తాం అన్కాన్షియస్ గా ప్రామిస్ చేస్తాం. ఛాలెంజ్ చేస్తాం. ఆ తుడగొడతాం. ఆ తర్వాత కాలం గడుస్తున్న కొద్ది అది బరవైపోతది.
(15:14) చుట్టుపక్కల వాళ్ళు అంటారు నువ్వే కదా చెప్పింది అంటారు. ఇప్పుడు చెప్పిన దాన్ని సారి చెప్పే ఆ హ్యూమిలిటీ లేని కారణంగా ప్రతిదాడి చేస్తాం ఒక మాట జారుతాం ఇలా ఇలా ఇలా ఇలా జీవితమంతా ఆ నరక ప్రాయంగా మారిపోతుంది. సో ఈ ఈ పుస్తకంలో చాలా చక్కటి విషయాలని భగవద్గీతని ఆధారం చేసుకొని చెప్పారు ఇది ప్రపంచంలో ఎవడైనా ఈజీగా అర్థం చేసుకోవచ్చు భగవద్గీత మత గ్రంథం కాదు అదొక మనిషిని ఒక సహజంగా జీవించేటువంటి అన్ని ఆస్పెక్ట్స్ లో జీవించే విధంగా స్ఫూర్తిని ఇచ్చే లేదా అవగాహన ఇచ్చేటువంటి ఒక ధర్మ గ్రంథం అది అందులో ఫస్ట్ శ్లోకంలోనే ఉంటది ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేదాన్ని
(15:55) కాస్త మారిస్తే క్షేత్రే క్షేత్రే ధర్మ కురు అని అంటే ఏ ఏ క్షేత్రంలో నువ్వు ఉంటావో ఆ ధర్మాన్ని నువ్వు ఆ పరిపూర్ణంగా పాటించు అని ఒకవేళ కుటుంబంలో ఉంటే కుటుంబ ధర్మాన్ని పాటించు ఆఫీస్ లో ఉంటే ఆఫీస్ ధర్మాన్ని పాటించు రోడ్డు మీద ఒక పౌరుడిగా ఉంటే పౌరుడు ధర్మాన్ని పాటించు ఒక దేవాలయంలో ఉంటే ఒక భక్తుడి యొక్క ధర్మాన్ని పాటించు పోలీస్ స్టేషన్ లో ఉంటే అక్కడ ఉండవలసిన ధర్మాన్ని పాటించు ప్రకృతిలో ఉంటే ఆ ధర్మాన్ని పాటించు సో ఎక్కడ ఏ ధర్మాన్ని పాటించాలో అంటే ఆ క్షేత్రం అంటే ఏ ప్రాంతంలో ఉన్నావు ఎవరి సమక్షంలో ఉన్నావు అని గుర్తిస్తే అప్పుడు
(16:28) ఏ ధర్మాన్ని పాటించాలన్న స్పురణ కలుగుతుది. సో ప్రతి మనిషి ఒకే ధర్మాన్ని పాటించడం అంటూ సనాతన ధర్మం అనేది రకరకాల ధర్మాలని నీలో మేలుకొలిపేటువంటి ఒక ప్యాకేజ్ అది జస్ట్ సనాతన ధర్మం పాటిస్తున్నా అంటే కుదరదు. సో నీ అన్ని ధర్మాలను పాటిస్తే అప్పుడు అది సనాతన ధర్మం అవుతది. సో ఇప్పుడు నేను ఒక పుస్తకం కూడా రాస్తున్నాను దీని మీద ఎలాబరేట్ గా ఒక విమర్శనాత్మక విశ్లేషణాత్మకమైనది ఇట్ మే టేక్ టైం బట్ ఏదేమైనా ఈ పుస్తకంలో ఉన్న అన్ని ప్రశ్నలు సమాధానాలు అన్నీ కూడా నేను ఒకసారి చదివి ఉన్నాను దీని మీద ఒక సిరీస్ ఆఫ్ టాక్స్ చేసుకోవచ్చు. సో వినేవాళ్ళకి
(17:05) చాలా ఉపయుక్తంగా ఉంటది అని నాకు అనిపిస్తున్నది. చూద్దాం ఎలా వెళ్తుందో సో ప్రస్తుతానికి ఇంతే నేను సంక్రాంతి పండగ గురించి హరిపురం వెళ్తున్నా ఆ 17వ తారీకు వరకు అక్కడే ఉంటాను. అందుకని పుస్తకాలు ఎవరన్నాకాసడాఇన్ ద్వారా గనుక కొనుక్కుంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వెయిట్ చేయండి అంతే నేను చెప్పాలనుకున్నది తర్వాత సంక్రాంతిని చక్కగా సెలబ్రేట్ చేసుకోండి ఆ మనసులో ఉన్న కల్మశాలు కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా భోగి మంటల్లో ఇసిరేయండి అవి అట్లా కాలి దగ్దమైపోని బేసికల్లీ చేయవలసింది అది దాంతో పాటు చుట్టుపక్కల వాళ్ళతో ఎవరికైనా విభేదాలు ఉన్నా సే సారీ అండ్ మళ్ళీ ఒకసారి ఒక మాట
(17:45) కలపండి ఆ సరే ఎక్కువ మాట్లాడకపోయినా మనసులో ఒకరి పట్ల మనకున్న ద్వేషాన్ని గాని భేదాన్ని గాని తీసేసి జీవితాన్ని సరళతనం చేసుకుంటే బాగుంటదని చెప్తూ సలహా కాకుండా నేను పాటిస్తాను అని చెప్తూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నా అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి భానుమతి గారు రాసిన పుస్తకం నిజంగా చాలా బాగుంది. ఇది ఎవరనా మీరైతే చదవండి.
(18:09) దీంట్లో చాలా విషయాలు ఉంది. అంటే ఇట్స్ ఏ కండెన్స్డ్ వర్షన్ ఆఫ్ ఆ వాస్ట్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ అవర్ సనాతన ధర్మ అండ్ భగవద్గీత తర్వాత అద్వైతం శంకరుల అద్వైతం దీనికి సంబంధించిన ఒక కూలంకశ వ్యాఖ్యానం ఖచ్చితంగా ఉంది ఇందులో తర్వాత ఇది ఒక పిహెచ్డి తీసి లాగా ఉంది. ఇదేదో ఒక ఊరికే సరదాగా మాట్లాడిన మాటలతో ఆ నిక్క కూర్చి చేసిన సంకలనం లాగ కాకుండా ఒక వ్యక్తి అనుభవించి ఆ అనుభవాన్ని గురువు ద్వారా తెలుసుకొని ఆ గురువును గౌరవిస్తూ ఆ తర్వాత చెప్తున్నది ఆచరిస్తూ చెప్పినట్టుగానే ఉన్నది.
(18:48) అందుకని ఇక్కడి నుంచే ఈ పుస్తకం రాసిన డాక్టర్ పి భానుమతి గారికి శిరసు నమస్కారం చేస్తూ అట్లాగే జగద్గురు శ్రీ ఆదిశంకరుల వారు అట్లాగే ఎందరెందరో మనిషిని నిలబెట్టాలన్న ఒక చిన్న నిష్కామ కర్మ చేసి ఎందరో జీవితాల్ని పావనం చేసి అట్లా వాళ్ళకున్న జీవితాన్ని కృతకృతులు అయ్యే విధంగా చేసినటువంటి అందరికీ నేను ఇక్కడి నుంచే నమస్కారం చేస్తున్నాను.

No comments:

Post a Comment