Monday, March 16, 2026

 *ఈ పరాభవ నామ సంవత్సరములో 12 రాశుల వారు పాటించవలసిన, పూజించవలసిన ఆయా దేవతలకు సంబంధించిన నియమాలు.....*

1) *👉మేష రాశి వారు:*

శనివారం, సోమవారం నియమాలు పాటించాలి. శివాలయం లో రుద్రాభిషేకం హనుమాన్ ప్రదక్షిణలు చెయ్యాలి...

2) *👉 వృషభ రాశి వారు:*

మంగళవార నియమాలు పాటించాలి రాహువు కు సంబంధించిన దానాలు పూజలు చెయ్యాలి....

3) *👉 మిధున రాశి వారు:*

అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ నరగోష ఎక్కువగా ఉండును శివాలయ సందర్శనం మేలు కల్గును.....

4) *👉 కర్కాటక రాశి వారు:*

మంగళ, శనివార నియమాలు పాటించి శివాలయ సందర్శనం మంచిది.....

5) *👉 సింహా రాశి వారు:*

మంగళ, గురు, శనివార నియమాలు పాటించి రుద్రాభి షేఖం , సంవత్సరం పాటు శివ పంచాక్షరి జపం, హనుమాన్ ప్రదక్షిణ తదితర పూజలు శ్రేయస్కరం.....

6) *👉 కన్య రాశి వారు:*

మంగళ, గురు వార నియమాలు పాటించి శివాలయ ప్రదక్షిణలు, అభిషేకాలు శ్రేయస్కరం.....

7) *👉 తుల రాశి వారు:*

నరగోష అధికమవును కావున మంగళ, శనివార నియమాలు పాటిస్తూ శివాలయ సందర్శనం శ్రేయస్కరం.....

8) *👉 వృశ్చిక రాశి వారు:*

మంగళ, శనివార నియమాలు పాటిస్తూ, రాహు గ్రహ పూజలు దానాలు, శివపంచాక్షరి మంత్ర జపం రోజు చెయ్యడం శ్రేయస్కరం....

9) *👉 ధనస్సు రాశి వారు:*

నరఘోష తో పాటు, శని ప్రభావం ఉండుట వలన శని, మంగళ వార నియమాలు పాటిస్తూ శివాలయ సందర్శనం, హనుమాన్ ప్రదక్షిణ, శివనామ స్మరణ శ్రేయస్కరం....

10) *👉 మకర రాశి వారు:*

సోమ, మంగళవార నియమాలు పాటిస్తూ రాహు, కుజ గ్రహాల దానాలు, పూజలు చేస్తు హనుమాన్ ప్రదక్షిణలు శ్రేయస్కరం....

11) *👉 కుంభ రాశి వారు:*

శని, మంగళ వార నియమాలు పాటిస్తూ శని, రాహు గ్రహాలకు సంబంధినవి దానాలు, పూజలు శివాలయ సందర్శనలు, హనుమాన్ ప్రదక్షిణలు శ్రేయస్కరం.....

12) *👉 మీనా రాశి వారు:*

శని, మంగళ వార నియమాలు పాటిస్తూ శని, రాహుగ్రహ దానాలు పూజలు చేస్తూ శివాలయ సందర్శనం, హనుమాన్ ప్రదక్షిణ శ్రేయస్కరం....

*🙏నోట్:- మొత్తానికి ఈ సంవత్సరం 12 రాశుల వారు పరాభవం చెందకుండా ఉండడానికి అన్ని రాశుల వారు ప్రతిరోజూ ఒక్క రాగి చెంబుడు నీళ్ళు శివుని పై పోసి శివ పంచాక్షరి మంత్రం జపిస్తే శుభప్రదం...*

   *శుభం - భూయాత్*

**ఆధ్యాత్మిక కుటుంబం 4*                                                 

No comments:

Post a Comment