Monday, March 16, 2026

 *డబ్బుంటే చాలు ఏమైనా సాధ్యం అనుకోకండి..*

కష్టపడి సంపాదించడం నేర్చుకోండి ...ఒకడి "కడుపు"కొట్టి సంపాదించడం నేర్చుకోకండి 

డబ్బుకు లోకం దాసోహంఅంటారు కొందరుఅదచాలాతప్పు మాట.!               

అందరూ అనుకున్నట్టుడబ్బు మనుషుల్ని మార్చదండి మను షుల్లో ఉన్న నిజస్వరూపాన్ని బయటపెడుతుంది అంతే!

డబ్బుకు లోకం దాసోహంఅం టారు అది చాలాతప్పుమాటండి.లోకంఎప్పుడు డబ్బుకు దాసోహం కాదు లోకులు మాత్రమే! డబ్బుకి దాసోహంఅవుతారు.

కాబట్టి డబ్బులు చూసి మని షి మారిపోయాడు లేదా డబ్బు వచ్చాక మనిషిమారిపోయాడు అని అనుకుంటాం కానీ అది చాలా తప్పు వాడి నిజస్వరూ పాన్ని మాత్రమే డబ్బు బయట పెడుతుంది.

కాబట్టి డబ్బు ఉన్నప్పుడుఒక లాగా లేనప్పుడు మరొక లాగా మనిషి ప్రవర్తించడు.తన దగ్గర డబ్బు ,అధికారం,హోదా ఉన్నప్పుడు ప్రవర్తించే తీరే అసలైన తీరు నిజమైన తీ రు.

వాడి నిజస్వరూపాన్నిమనకు బయట పెట్టడానికే ఆ భగవంతుడు వాడికి డబ్బుని, అధికారాన్ని, హోదాని ఇస్తాడు.

మధ్యంతరశిరి వచ్చినప్పుడు వాడు తనకంటే పెద్ద వాళ్లతో ఎలా ప్రవర్తిస్తున్నాడు, తనకంటే చిన్న వాళ్లతో ఎలనడుచుకుంటున్నాడు..అని చూసి వాడి వ్యక్తిత్వాన్ని పూర్తిగా మనం అ ర్థం చేసుకోవచ్చుఅంచనావేసు కోవచ్చు.

కాబట్టి అలాంటి సమయంలో కూడా నీతిగా, నిజాయితీగా,గర్వం ఉన్నవాడే నిజమైన మనిషి.

కొందరు నిత్యందైవసన్నిధిలో ఉండి భావదారిద్య్రంతో కొట్టు మిట్టాడుతూ భగవదనుగ్రహంచేత ఎంత ధనంసంపానాభోగ లాలసత్వాన ఆశతీరక ఎప్పు డూ పలువురితో నాకు ఏమిధనం ఏమిలేదు ఇని ఏడుస్తూ అ బద్దములాడుతూ పరులను ఓర్వక బతుకుగడుపువాడు బహునీచుడు దుర్మార్గుడు వాని మాటలు విజ్ఞులు పట్టించుకొనరాదు.

అలాంటివారితోటేస్నేహాన్నిఅయినా,బంధాన్ని
అయినా ఏర్పరచుకోరాదు.సత్సీలురు,భగవద్భక్తి సత్య సంభాషణ కరుణ పరహితం కోఱువారి సహవాసము బంధము బంధుత్వమేర్పరుచుకొనుట
 శ్రేయోదాయకము.

No comments:

Post a Comment