Monday, March 16, 2026

 *ఏ సమయం లో అబద్దం చెప్పడం తప్పు, పాపం కాదు అని శాస్త్రం చెప్తోంది*


వారిజాక్షులందు,
వైవాహికములందు
ప్రాణవిత్తమాన భంగమందు
చకిత గోకులాగ్ర
జన్మరక్షణమందు
బొంకవచ్చు నఘము
పొందదధిప " - పోతన భాగవతం

పోతన భాగవతంలోనిది ఈ పద్యం, ప్రత్యేక పరిస్థితుల్లో అబద్ధం చెప్పడం పాపం కాదని చెబుతూంది.

స్త్రీల విషయంలో, పెళ్ళిళ్ళలో, ప్రాణ-ధన-గౌరవాలు పోయేటప్పుడు, మరియు ఆవుల రక్షణ కోసం అబద్ధం చెప్పినా అది పాపం కాదని ఈ పద్యం యొక్క అర్థం.

బలిచక్రవర్తి వామనుడికి దానం ఇచ్చేముందు శుక్రాచార్యులు " అవసరమయినప్పుడు అబద్దం ఆడడంలో తప్పులేదు " అని తెలియచేసారు. కాని బలిచక్రవర్తి ఆయన మాటను వినలేదు.

భారతంలో " అశ్వత్థామ హతః ( కుంజరః ) " అని అనమంటే ధర్మరాజు మొదట ఒప్పుకోలేదు. కాని అందరూ అలా అనడం తప్పు కాదు అంటే సరే అని అనేస్తారు.

అమ్మ కూడా పిల్లల క్షేమం దృష్టిలో ఉంచుకుని కొన్నిసార్లు చిన్న చిన్న అబద్ధాలు ఆడవలసి వస్తుంది. తప్పు కాదు. మాట్లాడేటప్పుడు కుటుంబ గౌరవం, క్షేమం, సమాజహితం దృష్టిలో పెట్టుకోవాలి.

ఆశయం పెద్దదయినప్పుడు కొన్ని చిన్న చిన్న దోషాలు కలుగుతూ ఉంటాయి. ధర్మరక్షణ కోసమే అయినా కురుక్షేత్రంలో ఎందరో అమాయకులు మరణించారు, అకారణంగా ఎందరో విధవలయారు, పిల్లలు అనాధలయారు.

అందుకని ఆశయం ఏమిటీ అన్నదీ ముఖ్యమే. అది సనాతనధర్మం, దేశ రక్షణలకోసమయితే, సంకల్పం మంచిదయితే కొంచెం మినహాయింపు పొందవచ్చు.
ఇది శాస్త్రం చెప్పిన విషయం కాదు. శాస్త్రం అలా చెప్పదు. చెబితే అది శాస్త్రం.         *ఆధ్యాత్మిక కుటుంబం 4*                                                 

No comments:

Post a Comment