Monday, March 16, 2026

 __________________________________

*అడవిలో ఉన్నాను కదా నన్నెవరు గుర్తిస్తారని ఏ పుష్పమూ వికసించడం మానదు... అలాగే నీలో ఉన్న ప్రతిభను ఎవరో గుర్తించడం లేదని నీ పనిని ఆపకు... గుర్తింపు అనేది ఒకరిస్తే రాదు... ఎప్పటికీ నీలోనే ఉంటుంది...!*
*తన లోపల ముత్యాలు, రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవరికీ చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకు చేరతాయి.*

*అలాగే మనం...* *మంచి వాళ్ళమని, గొప్ప వాళ్ళమని ఎవరికీ నిరూపించు కోవలసిన అవసరం లేదు.. సమయం, సందర్భాన్ని బట్టి అదే బయట పడుతుంది మిత్రులారా...!* 

   🌺 *సర్వేజనా సుఖినోభవంతు* 🌺

*"ఒక శక్తివంతమైన స్థితిలో✴️ మనస్సును, బుద్ధిని స్థిరంగా🌈ఉంచడమే నిజమైన ఏకాంతవాసం🧘‍♀️"*          __________________________________

*'​ముందుగా మీ శరీరం కంటే భిన్నమైన చైతన్య శివశక్తి 'ఆత్మను' నేను.. అని మిమ్మల్ని మీరు గుర్తించండి.."*

*"​భృకుటి మధ్యలో మెరిసే చైతన్య శివశక్తి ఆత్మని నక్షత్రం లాగా.. మిమ్మల్ని మీరు ఊహించుకోండి.."*

*"​పరమధామంలో వెలుగుతున్న పరమజ్యోతి శివ తండ్రి నుండి శివ శక్తి కిరణాలు మీపై పడుతున్నట్లు, ఆయన ప్రేమ మిమ్మల్ని ఆవరించినట్లు (చుట్టుముట్టినట్లు) భావించండి.."*

*తరువాత..*

*​"నేను భగవంతుని బిడ్డను, 🔱శివ✴️శక్తిని" అనే ఒక్క ఆలోచనలో స్థిరంగా ఉండండి.."*

No comments:

Post a Comment