Monday, March 16, 2026

 🙏శ్రీ మహాకాళి🙏

దేవియొక్క అనేక రూపాలలో మహాకాళి ఒకటి. లలితా సహస్ర నామాలలో యితర నామాలతో పాటు మహాకాళి కూడ ఉన్నది. మహేశ్వరీ, మహాకాళీ, మహాగ్రాసా, మహాశనా. ఈ సందర్భంలో 'మహాకాళి' నామానికి చెప్పిన వ్యాఖ్యానాలలో ఒకటి ఆమె మృత్యువును కూడ నాశనం చేయగలదని.

పరమేశ్వరుని మహాకాల అని కూడా పిలుస్తాం. మహాకాలుని లేదా పరమేశ్వరుని శక్తిని మహాకాళి అని పిలుస్తారు. కాళియొక్క ఉపాసనను తాంత్రిక గ్రంథాలలో వివరంగా వర్ణించారు. కాళీ ఉపాసన ద్వారా అనేక సిద్ధులు లభిస్తాయి. మహాకవి కాళిదాసు కాళీ ఉపాసకుడని పేరునిబట్టే గ్రహించవచ్చు.

భారతదేశంలో కాశీక్షేత్రాలు చాలాచోట్ల ఉన్నాయి. ఈ క్షేత్రాలలో కాళీమాతను ఆరాధించటం వలన ప్రత్యేక శక్తులు లభిస్తాయి. ఉపాసకునికి శాస్త్రాలలో నమ్మకమూ భక్తీ ఉండాలి. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఆరాధిస్తే ప్రశంస నీయం.

సప్తశతిలో మధుకైటభులనే రాక్షసులను సంహరించిన శక్తి కాళియే అని పేర్కొనబడింది. మహాకాళిని ఆరాధించి అందరూ ఆమె కృపకు పాత్రులగుదురు గాక!

*ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘాన్ శూలం భుశుధ్దం శిరః*
*శంఖం సందధతీం కరై స్త్రినయనాం సర్వాంగ భూషావృతామ్।*
*నీలాశ్మద్యుతి మాస్యపాద దశకాం సేవే మహాకాలికాం*
*యామస్తోత్స్వపితే హరౌ కమల జోహన్తుం మధుం కైటభమ్.*

ఖడ్గం, చక్రం, గద, విల్లంబులు, పరిఘ, శూలం, భూశుండి, శిరస్సు, శంఖం మొదలగు దశవిధములైన ఆయుధములను తన పది చేతులలో ధరించి, మూడు కన్నులు కలిగి, సర్వాంగములందు భూషణములు కలిగి, ఆపాదమస్తకము నీలపు వర్ణముతో దీపించుచు, మధుకైటభులను సంహరించిన, విష్ణు బ్రహ్మాదులచే స్తుతింపబడుతున్న కాళికను సేవించెదను.

No comments:

Post a Comment