🕉️ *జై శ్రీమన్నారాయణ🕉️*
*_🌴హితము కోరుకొనువారు ఎల్లప్పుడూ మంచి మార్గము గుండా ప్రయాణించడానికి పూన్కోవాలి. ప్రయాణించే దారి రాళ్ళు, రప్పలు, ముండ్లతో నిండి ఉన్నప్పటికీ కూడా మంచి మార్గమునే అనుసరించాలి. మార్గము సుందరముగా ఉన్నది కదా అని చెడు మార్గమును అనుసరించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దు. నీవు ప్రయాణించే మార్గము సరైనది, మంచిది అయినపుడు భగవంతుడే నీ మార్గమును శుభ్రం చేస్తాడు. నీ ప్రయాణములో ఎదురయ్యే అన్ని ఆటంకములు ఆయనే సరిచేస్తాడు. నీ ప్రయాణాన్ని సులభతరం, సురక్షితం చేస్తాడు.. కనుక కఠినమైనది అయిననూ మంచి మార్గమునే అనుసరించు. చెడు మార్గమున పోవలెననే ఆలోచన రానీయకు..🌴_*
No comments:
Post a Comment