*ఆచార్య సద్బోధన*
➖➖➖
సకల మంత్రాలలోకెల్ల అత్యంత గొప్పది ‘దేవుడున్నాడు’ అనే మంత్రమే గొప్పది.
దేవుడున్నాడు అనే విశ్వాసం లేకయే ఎన్ని పూజలు, మంత్రములు పఠించిననూ ప్రయోజనము ఏమీ ఉండదు.
ఏ పని చేసినా, ఎక్కడున్నా దేవుడు మనతో ఉన్నాడు అని మనం గుర్తుంచుకుంటూ ఉండాలి.
దినమంతా దీనినే భావిస్తూ ఆచరిస్తూ ఆనందిస్తూ మరి కొంతమందికి ఈ ఆనందాన్ని అందిస్తూ ఉండాలి.
దేవుడున్నాడు అనే విశ్వాసం వలన దైవప్రీతి, పాపభీతి అభివృద్ది అవుతాయి.
ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనే దైర్య సాహసాలు కలుగుతాయి.
అన్ని మంత్రాలలోకెల్ల ఇదే అత్యంత శక్తివంతమైనది. ఇట్టి విశ్వాసం మనకు బ్రహ్మాస్త్రం వలె పనిచేస్తుంది.
దేవుడున్నాడు, దేవుడున్నాడు, దేవుడున్నాడు అని నిత్యమూ స్మరించడం వలన తాదాత్మ్యభావం కలిగి దైవ సాక్షాత్కారం కూడా పొందవచ్చు.``
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
No comments:
Post a Comment