Sunday, August 9, 2026

చెడ్డ మనుషుల నుంచి దూరంగా ఉండటం ఎలా? | Powerful Life Lesson

చెడ్డ మనుషుల నుంచి దూరంగా ఉండటం ఎలా? | Powerful Life Lesson

Author Name:Voice Of Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@VoiceOfTeluguofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=wrjcIMQrIzQ



Transcript:
(00:01) [సంగీతం] ఈ సృష్టిలో ప్రతి మనిషికి రోజుకు లభించేది ఖచ్చితంగా 24 గంటలు మాత్రమే. ధనవంతుడికి ఒక నిమిషం ఎక్కువ రాదు పేదవాడికి [సంగీతం] ఓ నిమిషం తక్కువ రాదు. కానీ ఆ 24 గంటల్లో చాలా మంది తమ ప్రశాంతతను విలువైన సమయాన్ని జీవిత లక్ష్యాలను ఎవరికో ఎందుకో కేటాయించి ఉచితంగా పాడు చేసుకుంటున్నారు. రెయింబవళ్ళు కష్టపడి [సంగీతం] సంపాదించిన డబ్బును ఎవరైనా వచ్చి మన జేబులో నుంచి బలవంతంగా లాక్కుంటే మనం ఊరుకుంటామా? నడి రోడ్డులో కూడా నిలబడి గొడవ [సంగీతం] పడతాం.
(00:39) కదా మరి మన మనశశాంతిని మన రోజంతటి మూడ్ ని ఎవరో ఒకరు వచ్చి ఒక్క మాటతో పాడు చేసి వెళ్తూ ఉంటే ఎందుకు నవ్వుతూ వాళ్లకు దాన్ని అప్పగిస్తున్నాం [సంగీతం] ఇక్కడే మనం తెలుసుకోవలసిన అతి పెద్ద జీవిత పాఠం ఉంది. దాన్నే గార్బేజ్ ట్రక్ [సంగీతం] థియరీ అంటారు. డేవిడ్ జే పొల్లే అనే రచయిత చెప్పిన ఈ చిన్న సిద్ధాంతం మన అందరి జీవితాలను మార్చేంత శక్తివంతమైనది.
(01:03) అసలు ఈ గార్బేజ్ [సంగీతం] ట్రక్ థియరీ అంటే ఏంటి తెలుసుకుందాం. మన ఊళ్లలో లేదా నగరాల్లో రోజు పొద్దున్నే ఒక చెత్త బండి వస్తుంది. [సంగీతం] అది వీధి వీధి తిరుగుతూ ప్రతి ఇంటా ఉన్న చెత్తను తనలో నింపుకుంటుంది. ఆ బండి అలా నిండుతూ నిండుతూ చివరికి ఒక [సంగీతం] స్థాయికి చేరుకుంటుంది. దానికి ఇక చెత్తను మోసే ఓపిక ఉండదు.
(01:25) ఎక్కడో ఒక చోట ఖాళీ చేయాలి. అప్పుడు ఆ డ్రైవర్ ఏం చేస్తాడు ఏదో ఒక డంపింగ్ యార్డ్ చూసుకొని అక్కడ ఆ చెత్తనంతటిని [సంగీతం] కుమ్మరించి తేలికపడి వెళ్ళిపోతాడు. ఇక ఇప్పుడు నిజం ఆలోచించండి. ఈ సమాజంలో చాలామంది మనుషులు కూడా సరిగ్గా ఈ చెత్త బండ్లా లాంటి వాళ్లే [సంగీతం] వాళ్ళ జీవితాల్లో బోలెడంత చెత్త ఉంటుంది.
(01:47) ఏంటా చెత్త ఓటమి ఇచ్చిన కోపం కావచ్చు. ఇతరుల ఎదుగుదల చూసి [సంగీతం] కలిగే అసూయ కావచ్చు. చేయలేని పని వల్ల వచ్చే ఫ్రస్ట్రేషన్ కావచ్చు. ఆఫీస్ లోనో ఇంట్లోనో పెరిగిపోయిన స్ట్రెస్ కావచ్చు ఇంకా సాధించలేకపోయాననే అధ [సంగీతం] నిరాశ కూడా కావచ్చు. ఈ చెత్తంతా వాళ్ళ మనసులో బుర్రలో పేరుకుపోయి పేరుకుపోయి [సంగీతం] చివరికి ఆ లోడ్ మోయలేక బుర్ర సగం పాడైపోతుంది.
(02:14) ఆ సమయంలో వాళ్ళకు ఒక డంపింగ్ యార్డ్ కావాలి. తమలో ఉన్న ఆ కసిని కోపాన్ని ఎవరో ఒకరి మీద కుమ్మరించాలి. అలాంటప్పుడు వాళ్ళకు మనం ఎదురయ్యామ అనుకోండి మన మీద ఆ చెత్తను పడేస్తారు. రోడ్డు మీద వెళ్తూ ఉంటే అనవసరంగా హారన్ [సంగీతం] కొట్టి మనల్ని తిట్టే డ్రైవర్ కావచ్చు. ఆఫీస్ లో తన ఇంట్లో కోపాన్ని మన మీద చూపే బాస్ కావచ్చు. మన ఎదుగుదలను తట్టుకోలేక మన వెనుక చిల్లర మాటలు మాట్లాడే బంధువు లేదా స్నేహితుడు కావచ్చు.
(02:40) సోషల్ మీడియాలో ఎలాంటి సంబంధం లేకపోయినా కింద అసభ్యకరంగా కామెంట్ పెట్టే ట్రోలర్ కావచ్చు. వీళ్ళందరూ కూడా నడిచే చెత్తబండ్లు. వీళ్ళు మన మీద చెత్త వేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం? నన్నే అంటావా అని ఎదురుదాడికి దిగుతున్నాం. అంటే వాళ్ళు పడేసిన చెత్తను మనం దేవుడి ప్రసాదంలా చేతులతో పట్టుకొని మన నెత్తి మీద చల్లుకుంటున్నాం.
(03:05) ఆ తరువాత రోజంతా ఆ వాసనను భరిస్తూ నా మూడ్ పాడైపోయింది. నా రోజంతా వేస్ట్ అయిపోయింది అని [సంగీతం] కుమిలిపోతున్నాం. మిత్రమా ఇది ఎంతటి మూర్ఖత్వమో ఒక్కసారి ఆలోచించండి. ఇదే సందర్భంగా ఒక మంచి ఉదాహరణ చెప్తా. రామ్ అనే ఒక కుర్రాడు ఉన్నాడు. చాలా కష్టపడే మనస్తత్వం. ఒక పెద్ద ఐటి కంపెనీలో ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి క్యాబ్ లో వెళ్తున్నాడు.
(03:27) ఆ ప్రాజెక్ట్ గాని ఓకే అయితే అతనికి ప్రమోషన్ వస్తుంది. జీవితం నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. అందుకే చాలా ఉత్సాహంగా ప్రశాంతంగా ఉన్నాడు. క్యాబ్ సరైన లైన్ లోనే వెళ్తోంది. ఇంతలో పక్క సందులో నుంచి ఒక కారు వేగంగా వచ్చి ఎలాంటి సిగ్నల్ లేకుండా రామ్ వెళ్తున్న క్యాబ్ కి అడ్డంగా వచ్చింది. క్యాబ్ డ్రైవర్ సమయస్ఫూర్తితో గట్టిగా బ్రేక్ వేశడు.
(03:48) కారు కొద్ది అంగురాల దూరంలో ఆగింది. రామ్ ప్రాణాలు చేతిలోకి వచ్చాయి. ఒక్క క్షణం ఆలస్యమైన పెద్ద ప్రమాదం జరిగేది. ఇక్కడ తప్పు ఎవరిది పక్క సందులో నుంచి రాంగ్ రూట్ లో వచ్చిన ఆ కార్ డ్రైవర్ ది. కానీ ఆ కార్ డ్రైవర్ ఏం చేసాడో తెలుసా అద్దం కిందికి దించి బయటకు తలపెట్టి గట్టిగా అరుస్తూ రామ్ వైపు క్యాబ్ డ్రైవర్ వైపు చూసి అతి దారుణమైన బూతులు తిట్టడం మొదలు పెట్టాడు.
(04:14) తప్పు తనదే కానీ అరుస్తున్నది కూడా తనే. సాధారణంగా అలాంటి పరిస్థితిలో ఎవరికైనా ఏమవస్తుంది విపరీతమైన కోపం వస్తుంది. రామ్ కూడా సీట్ బెల్ట్ విప్పేసి ఏయ్ తప్పు నీది పెట్టుకొని మమ్మల్నే తిడతావా అని కిందికి దిగి గొడవ పడదాం అనుకున్నాడు. అతని రక్తం మరిగిపోతోంది. కానీ రామ్ ప్రయాణిస్తున్న కార్ ని డ్రైవ్ చేస్తున్న ఆ క్యాబ్ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా చాలా ప్రశాంతంగా ఆ కార్ డ్రైవర్ వైపు చూసి నవ్వాడు.
(04:41) హుందాగా జై ఊపి సారీ భయ్యా చూసుకోలేదు అన్నట్టు సైగ చేసి తన కారును ముందుకు పోనిచ్చాడు. రామ్ కి మైండ్ బ్లాక్ అయింది. క్యాబ్ డ్రైవర్ తో ఏంటి భయ్యా నువ్వు తప్పు ఆడిది నడి రోడ్డు మీద మనల్ని గుద్దేంత పని చేశాడు. పైగా మనల్నే బూతులు తిడుతూ ఉంటే నువ్వు నవ్వి సారీ చెప్తావా వాడి బొక్కలు విరగొట్టాలి గాని అన్నాడు. అప్పుడు ఆ క్యాబ్ డ్రైవర్ వెనక్కి తిరిగి ఓ మాట అన్నాడు.
(05:05) ఆ మాట రామ్ జీవితాన్ని మార్చేసింది. బ్రదర్ చాలా మంది మనుషులు చెత్త బండ్ల లాంటి వాళ్ళు వాళ్ళ బుర్ర నిండా ఫ్రస్ట్రేషన్ కోపం, నిరాశ అనే చెత్త నిండిపోయి ఉంటుంది. ఆ చెత్త మోత ఎక్కువైనప్పుడు ఎక్కడో ఒక చోట దాన్ని కుమ్మరించాలి. ఈరోజు ఆ డ్రైవర్ మనల్ని చూసి ఆ చెత్తను మన మీద పడేయాలని చూశాడు. నేను దాన్ని స్వీకరిస్తే ఆ చెత్త నా బుర్రలోకి ఎక్కుతుంది.
(05:27) ఆ కోపంలో నేను సరిగ్గా డ్రైవ్ చేయలేక ఎక్కడో ఒక చోట యక్సిడెంట్ చేసుకుంటాను. లేదంటే ఆ కోపాన్ని తీసుకెళ్లి [సంగీతం] ఇంట్లో నా భార్య మీదో పిల్లల మీదో చూపిస్తాను. నా ప్రశాంతత పాడవుతుంది. అందుకే వాడు చెత్త పడేయడానికి వస్తే నేను [నవ్వు] నవ్వి బయటకు వచ్చేసాను. వాడి చెత్త వాడి దగ్గరే ఉండిపోయింది. రామ్ కి ఈ మాటలతో గుండెల్లో రైళ్లు పరిగెత్తినంత పని అయింది.
(05:53) ఎంత పెద్ద సత్యం రామ్ ఆఫీస్ కి వెళ్ళాడు. ప్రెజెంటేషన్ అద్భుతంగా ఇచ్చాడు. ప్రమోషన్ కూడా కొట్టాడు. ఒకవేళ ఆ రోజు రామ్ గనుక ఆ రోడ్డు మీద చెత్త బండితో గొడవ పడి ఉంటే అతని మూడ్ [సంగీతం] పాడైపోయేది బీపి పెరిగేది ఆఫీస్ కి ఆలస్యంగా వెళ్ళేవాడు ప్రెజెంటేషన్ సరిగ్గా ఇవ్వలేకపోయేవాడు. ఒక చెత్త మనిషి వల్ల తన జీవిత ఆశయాన్ని చేతులారా పాడు చేసుకునేవాడు.
(06:15) మరి మనం ఎందుకు ఈ చెత్తను స్వీకరిస్తున్నాం? ఆలోచించండి. మన జీవితాల్లో ఎన్నిసార్లు మనం ఆ రామ్ లాగా ప్రవర్తించడం లేదు. ఆఫీస్ లో బాస్ ఏదో ఒక విషయంలో కోప్పడతాడు. అది మన తప్పు కాకపోవచ్చు బాస్ కి తనపై అధికారి దగ్గర చీవాట్లు పడి ఉండొచ్చు అంటే బాస్ దగ్గర ఉన్న చెత్త మన మీద వేశడు. మనమేం చేస్తాం ఆ రోజంతా మూతి ముడుచుకొని కూర్చుంటాం. [సంగీతం] వర్క్ సరిగ్గా చేయం ఆ కోపాన్ని మన జూనియర్స్ మీద చూపిస్తాం.
(06:42) ఇంట్లో ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వస్తాం. భార్య లేదా భర్త ఏదో చిన్న మాట అంటారు. రోజంతా పడ్డ కష్టమంతా ఒక్కసారిగా కోపంగా మారి వాళ్ళ మీద విరుచుకు పడతాం. అంటే బయట నుంచి తెచ్చిన చెత్తను మన పవిత్రమైన కుటుంబం మీద కుమ్మరిస్తాం. సోషల్ మీడియాలో ఎవడో [సంగీతం] ముక్కు ముఖం తెలియని వ్యక్తి మన ఫోటో కిందో మన వీడియో కిందో ఒక నెగిటివ్ [సంగీతం] కామెంట్ పెడతాడు.
(07:05) మనం రోజంతా పనులు పక్కన పెట్టి వాడికి రిప్లై ఇవ్వడానికి 100 రకాల ప్లాన్లు వేస్తాం. వాడు మన జీవితంలో ఏమైనా అన్నం పెడుతున్నాడా? లేదు కదా కానీ వాడి చెత్తను మన బుర్రలోకి వేసుకున్నాం. కాదు మిత్రమా గుర్తుపెట్టుకో ఇతరులు మనపై విసిరే చెత్తను మనం పట్టుకోనంత వరకు ఆ చెత్త వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇదే సందర్భంగా బుద్ధుడికి సంబంధించి ఒక ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం.
(07:30) బుద్ధుడు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఓ వ్యక్తి ఆయనను తీవ్రంగా దూషించాడు. అయితే బుద్ధుడు ప్రశాంతంగా నవ్వుతూ అతని మాటలు విన్నాడు. ఆ వ్యక్తి అలసిపోయి నేను నిన్ను ఇన్ని మాటలు అంటూ ఉంటే నవ్వుతావఏంటి అని అడిగాడు. [సంగీతం] అప్పుడు బుద్ధుడు నువ్వు నా దగ్గరకు ఒక బహుమతి తీసుకొని వచ్చావు. దాన్ని నేను తీసుకోలేదు. ఇప్పుడు ఆ బహుమతి ఎవరి దగ్గర ఉంటుంది అని ప్రశ్నించాడు.
(07:53) దానికి ఆ వ్యక్తి నా దగ్గరే ఉంటుంది అన్నాడు. అప్పుడు బుద్ధుడు [నవ్వు] సరిగ్గా అలాగే నువ్వు ఇచ్చిన తిట్లను నేను తీసుకోలేదు. కాబట్టి ఆ పాపం ఆ కోపం ఆ చెత్త అంతా నీ దగ్గరే ఉంది అన్నాడు. గార్బేజ్ ట్రక్ థియరీ పరమార్థం కూడా ఇదే. మన చుట్టూ ఉన్న సమాజం మొత్తాన్ని మనం మార్చలేం మిత్రమా కానీ చెత్త బండ్లు రోడ్ల మీద తిరుగుతూనే ఉంటాయి.
(08:19) మన ఇంట్లోకి మన మనసులోకి ఆ చెత్త రాకుండా చూసుకునే తాళం చెవి మాత్రం మన చేతిలోనే ఉంది. దానికి ఈ నాలుగు సూత్రాలను పాటిస్తే సరిపోతుంది. ముందుగా నెంబర్ వన్ దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదు. అంటే డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. ఎవరైనా మన మీద అరచినా మనల్ని తక్కువ చేసి మాట్లాడినా అది వాళ్ళ స్థాయికి వాళ్ళ లోపల ఉన్న బాధకు సంకేతం తప్ప మన అర్హతకు సంకేతం కాదు.
(08:45) ఒక మనిషి సుఖంగా ప్రశాంతంగా ఉంటే ఇతరులకు ప్రేమను పంచుతాడు. ఒక మనిషి లోపల అశాంతి అసూయ ఉంటే ఇతరులకు అశాంతినే ఇస్తాడు. వాళ్ళ దగ్గర ఏది ఉంటే అదే కదా మనకు ఇవ్వగలరు. కాబట్టి వాళ్ళు ప్రవర్తించిన తీరు వాళ్ళ సమస్య మన సమస్య కాదు. నెంబర్ టూ ప్రతిస్పందించకండి స్పందించండి డోంట్ రియాక్ట్ జస్ట్ [సంగీతం] రెస్పాండ్ రియాక్ట్ అవ్వడం అంటే ఆలోచించకుండా కోపానికి కోపంతో సమాధానం ఇవ్వడం రెస్పాండ్ అవ్వడం అంటే పరిస్థితిని అర్థం చేసుకుని తెలివిగా అడుగు వేయడం ఎవరైనా మనతో గొడవకు వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగండి ఊపిరి [సంగీతం] తీసుకోండి మనసులో అనుకోండి ఓహో ఈ చెత్తబండి
(09:24) నిండిపోయింది. ఇప్పుడు నా మీద కుమ్మరించడానికి చూస్తూ [సంగీతం] ఉంది. నేను దీనికి స్థలం ఇవ్వను అని నవ్వి పక్కకు తప్పుకోండి. నెంబర్ త్రీ నవ్వి ముందుకు సాగిపోండి. వేవ్, స్మైల్ అండ్ మూవ్ ఆన్ చెత్తబండి ఎదురైనప్పుడు [సంగీతం] మనం ఏం చేస్తాం ముక్కు మూసుకొని అది దాటిపోయే వరకు ఆగుతాం. అంతేగాని ఆ బండి వెనకాలే పడతామా? ఆ [నవ్వు] మిత్రమా జీవితం కూడా అంతే.
(09:48) నెగిటివ్ మనుషులు ఎదురైనప్పుడు వాళ్ళకు ఒక చిన్న నవ్వు నవ్వి మనసులోనే దేవుడా వాళ్ళకు మంచి బుద్ధినివ్వు అని కోరుకొని మన పని మనం చూసుకోవాలి. మన సమయం చాలా విలువైనది. దాన్ని చిల్లర గొడవలకు వేస్ట్ చేసుకోకూడదు. ఇక నంబర్ ఫోర్ మనం చెత్తబండిలా మారకూడదు. డోంట్ బికమ్ ఏ గార్బేజ్ ట్రక్ ఇది అన్నింటికంటే ముఖ్యమైనది.
(10:12) మనం ఇతరుల గురించి మాట్లాడుతున్నాం సరే మన సంగతి ఏంటి? మనం కూడా ఒక్కోసారి చెత్తబండిలా మారిపోతున్నామా మన ఫ్రస్ట్రేషన్ ని మన ఓటములను మన కోపాన్ని అమాయకులైన మన పిల్లల మీదో భాగస్వామి మీదో వర్కర్స్ మీదో చూపిస్తున్నామా రోజు రాత్రి పడుకునే ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు నేను ఎవరి మీదైనా నా చెత్తను పడేసానా ఒకవేళ పడేసి ఉంటే సారి [సంగీతం] చెప్పాలి.
(10:34) మన మనసును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ధ్యానం చేయాలి మంచి పుస్తకాలు చదవాలి. మన లక్ష్యం మీదే దృష్టిని పెట్టాలి. మిత్రమా ఈ ప్రపంచంలో గొప్ప విజయాలు సాధించిన ఏ ఒక్కరు ఇతరుల మాటలకు విమర్శలకు లొంగిపోయిన వాళ్ళు ఆగిపోయిన వాళ్ళు కాదు సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేయడానికి గ్రౌండ్ లోకి దిగినప్పుడు స్టేడియంలో వేల మంది తిట్టే వాళ్ళు విమర్శించేవాళ్ళు అయితే సచిన్ ఎప్పుడైనా బ్యాట్ పక్కన పడేసి వాళ్ళతో గొడవ పడ్డాడా లేదు ఆ చెత్తను పట్టించుకోలేదు తన సమాధానం మాటలతో కాదు సెంచరీస్ తో చెప్పాడు.
(11:08) అబ్దుల్ కలాం గారిని ఎందరో విమర్శించారు. ఆయన ప్రయోగాలను ఎందరో ఎగతాలి కూడా చేశారు. ఆయన ఆ విమర్శల చెత్తను పట్టించుకొని ఉంటే భారతదేశానికి మిసైల్ మ్యాన్ లభించేవాడా మన జీవితంలో [సంగీతం] మనం ఏదైనా ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నప్పుడు కచ్చితంగా మన చుట్టూ వందలాది చెత్త బండ్లు తయారవుతాయి. నువ్వు ఇది చేయలేవు [సంగీతం] అని ఒకడు అంటాడు నీకేం వచ్చని అంత బిల్డప్ అని ఇంకొకడు వెటకారం చేస్తాడు.
(11:35) మన కష్టాన్ని కాదని మన అదృష్టాన్ని వేలెత్తి చూపిస్తారు. వీళ్ళందరూ మన గమనాన్ని ఆపడానికి వచ్చిన చెత్త బండ్ల లాంటివారే మనం వాళ్ళతో గొడవ పడడానికి రోడ్డు మీద నిలబడితే మన గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేం. మిత్రమా మన సమయం పరిమితమైనది. మనకున్న శక్తిని మన కలలను నిజం చేసుకోవడానికి దాన్ని వాడుకోవాలి. మన ఆలోచనలను ఒక కొత్త వ్యాపారం పెట్టడానికి ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి మన కుటుంబానికి మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ఉపయోగించుకోవాలి.
(12:07) [సంగీతం] మిత్రమా! జీవితాన్ని మార్చే ఓ చిన్న ప్లాన్ చెప్పనా? ఈ రోజు నుంచే ఈ క్షణం నుంచే ఒక నియమం పెట్టుకుందాం. నా మనసు ఒక పవిత్రమైన దేవాలయం. అందులోకి ఎవరి చెత్తను నేను రానివ్వను. నా ప్రశాంతతను, నా అనుమతి లేకుండా ఎవ్వరూ నాశనం చేయలేరు. ఈ మాటను ప్రతి పూట గుర్తు తెచ్చుకుందాం. ఎవరైనా మన దగ్గరకు వచ్చి అనవసరమైన డ్రామా ఆడినా మనల్ని రెచ్చగొట్టాలని [సంగీతం] చూసినా వాళ్ళ వంక చూసి మనసులో అనుకుందాం.
(12:34) పాపం చెత్త ఎక్కువైపోయింది అని ప్రశాంతంగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోదాం. మనం ఎప్పుడైతే ఇతరుల నెగిటివిటీని పట్టించుకోవడం మానేస్తామో మనలో ఒక కొత్త శక్తి పుడుతుంది. మన మనసు తేలిక అవుతుంది. మన ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మన పనిలో వేగం పెరుగుతుంది. మిత్రమా ఆఖరిగా ఒక్క మాట చెత్తను వదిలేద్దాం. ప్రశాంతతను కౌగలించుకుందాం.
(13:00) విజయం వైపు [సంగీతం] దూసుకుపోదాం. ఇది రాసి పెట్టుకో. హాయ్ దిస్ ఇస్ రాణ మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు పాజిటివ్ విషయాలని వినండి [సంగీతం] తోటివారితో పంచుకోండి.

No comments:

Post a Comment