భార్యాభర్తల బంధం -- అనుబంధం.
***********
💞
ఒక ముసలావిడ వాళ్ళ ఆయనతో రోజూ కాఫీ డబ్బా మూత తీయిస్తుండటం చూసిన పక్కింట్లోకి కొత్తగా
పెళ్లయిన ఓ అమ్మాయి ఉండబట్టలేక అడిగింది .
బామ్మ గారు..!! మీరు రోజూ తాతగారితో ఇలా కాఫీ డబ్బా మూత ఎందుకు తీస్తున్నారు ?మీరే తీసుకోవచ్చు కదా .!అన్నది..అప్పుడు బామ్మ ఇలా చెప్పింది..
మూత తీయడం పెద్ద కష్టం కాదమ్మా..! నేనే తీయగలను.. కానీ, నా చేత కావడం లేదు.. మీరు తీసి ఇవ్వండి అన్నప్పుడు ఆయన కళ్ళల్లో నేను బలశాలిని అనే నమ్మకం కనబడుతుంది.. నా భార్యకు అని నేనే నన్నే నమ్ముకుంది అనే ప్రేమ కనబడుతుంది.. వయసు పెరిగినా ఇంకా నా వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంది అనే ఆత్మవిశ్వాసం కనబడుతుంది.. ఈ భూమికి భారంగా లేను నేను అనే సంతోషం కనబడుతోంది.. అందుకే ప్రతిరోజు ఇలా చేస్తాను అన్నారు బామ్మ గారు..
నిజమే కదండీ.!మనిషి నా వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనుకున్నప్పుడు కృంగిపోయి, కృశించి పోతారు.. అలా కాకుండా చిన్నచిన్న విషయాల వల్ల వారిని ఉన్నంతవరకు సంతోషంగా ఉంచొచ్చు కదా..!!
హైమవతి మట్టెగుంట..
తెనాలి
No comments:
Post a Comment