*శివుడవో.. మాధవుడవో..*
*'శివస్య హృదయం విష్ణుః, విష్ణోశ్చ హృదయం శివః’... అని శివకేశవుల ఏకత్వం అనుదినమూ సంధ్యావందన మంత్రాల్లో చెప్పుకొంటూ ఉంటారు. శివవిష్ణువుల అభేదమును ఈ మంత్రం తెలుపుతున్నట్లే... హరిహరుడు, రామలింగడు, రామేశ్వరుడు, శంకరనారాయణుడు అనే పేర్లు కూడా ఈ అభేదాన్ని చాటుతున్నాయి. ఒకప్పుడు... 'రామేశ్వ రము' అనే పదం ఏ సమాసానికి చెందినదని దేవతలకు సందేహం వచ్చిందట. వ్యాకరణంలో చెప్పబడిన సమా సాల్లో కర్మధారయం, తత్పురుషం, బహువ్రీహి అనే సమాసాలున్నాయి. రాజసేవకుడు- రాజు యొక్క సేవకుడు. ఇది తత్పురుషం. నల్లకుక్క, నల్లని కుక్క... ఇది కర్మధారయ సమాసం. దండపాణి- చేతిలో దండము కలవాడు. ఇది బహువ్రీహి. దండపాణి అంటే సుబ్రహ్మణ్యుడు. దండపాణి పదంలో లేని అర్థాన్ని చెప్పేది కనుక బహువ్రీహి. ఈ పదానికి ‘బాగా పండే పొలం' అనే అర్థం కూడా ఉంది. నూరు కళ్లాల ధాన్యాన్ని పండించేవాడు* *బహువ్రీహి. సరే, రామేశ్వరం అనేది వీటిలో ఏ సమాసం? తత్పురుషమా? 'రామస్య ఈశ్వరః' అంటే రామునికి ఈశ్వరుడనే అర్థం వస్తుంది. అది శివాధిక్యాన్ని చాటుతుంది.*
*శివధనుర్భంగం చేసిన రాముడు శివుడి కంటే ఏవిధంగా తక్కువ? సర్వలోక శరణ్యుడు రాముడు. అతనికిపైన ఒక ఈశ్వరుడా? ఈ సందేహాలన్నీ తీర్చేవారెవరు? వారు విష్ణువునే అడగదలచి వైకుంఠానికి వెళ్లారు. 'ఇంత చిన్న విషయానికి ఎంత దూరం వచ్చారు? ఆ పదాన్ని చూడగానే తత్పురుషమని తెలుస్తున్నదే' అన్నాడట విష్ణువు. అయినా దేవతలకు సందే హనివృత్తి కాలేదు. ఎందుకంటే, విష్ణువు కల్యాణ గుణపూ ర్ణుడు. ఏదో వినయం చేతనో మొహమాటంచేతనో ఆ విధంగా చెప్పి ఉంటాడని భావించారు. 'విష్ణువుని అడిగాం కదా... పోనీ, ఆ శివుడినే అడుగుదాం. ఆయన ఏం చెప్తాడో' అనుకుంటూ కైలాసానికి వెళ్లారు. వారి సందేహాన్ని విన్న నాగాభరణుడు... ‘ఇందులో సందేహానికి తావేది? రామేశ్వరుడు బహువ్రీహి సమాసమే. రాముడే ఈశ్వరుడుగా కలవాడు రామేశ్వరుడు' అన్నాడట. దేవతలకు ఏమీ తోచలేదు. వేరే మధ్యవర్తిని అడిగి చూద్దామని బ్రహ్మదగ్గరకు వెళ్లారట. వారి సందేహాన్ని విన్న ఆ చతుర్ముఖ బ్రహ్మ... ఈ సమాసం తత్పురుషమూ కాదు, బహువ్రీహీ కాదు... ఇది కర్మధారయం అన్నాడట. 'వీరరాఘవుడు అంటే వీరుడొకడు, రాఘవుడు వేరొకడు అని అర్థమా? ఇదీ అంతే. రామశ్చ అసౌ ఈశ్వరశ్చ రామేశ్వరః అంచేత రామేశ్వర పదం నిస్సందేహంగా కర్మధారయం' అని వివరించాడట. దీన్నే సంక్షిప్తంగా...*
*విష్ణుస్తత్పురుషంబ్రూతే బహువ్రీహిం మహేశ్వరః*
*ఉపయోరప్యతృప్తానా మాత్మభూః కర్మధారయమ్*
*అని చెప్తారు. ఆత్మభూః అంటే బ్రహ్మ. శివవిష్ణువులు ఒకే పరతత్వం అని దేవతలకు బ్రహ్మదేవుడు బోధించినాడని దీని అర్థం.*
*┈┉┅━❀꧁ శివోహం ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
⚜️📿⚜️ 🙏🕉️🙏 ⚜️📿⚜️
No comments:
Post a Comment