Wednesday, June 25, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*రామాయణంలో విశ్వామిత్రుడు రామునికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడని మందరికీ తెలుసు... ఆ కొన్నిటి వివరాలు తెలుసుకుందామా మరి...*

*విశ్వామిత్రుడు రాముడికి తను ఇచ్చే అస్త్రాల వివరాలు ఇలా చెప్పాడు. ‘దేవ, రాక్షస, గంధర్వ, ఉరగ మొదలైన వారిని యుద్ధ రంగంలో జయించే ఈ దివ్యాస్త్రాలని నీకు ఇస్తాను.*

*ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం, ఇంద్రాస్త్రం, వజ్రాస్త్రం, శివ శూలం, బ్రహ్మ శిరోస్త్రం, బ్రహ్మాస్త్రం, ఐషికాస్త్రం ఇంకా నిప్పులు కక్కే మోదకి, శిఖరి అనే గదలు, ధర్మపాశం, కాలపాశం, వారుణపాశం, వారుణాస్త్రాన్ని ఇస్తాను. రామా! ఇంకా శుష్కం, ఆర్ద్ర అనే రెండు పిడుగులని, పైనకాస్త్రం, నారాయణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం, హయశిరస్సాస్త్రం, క్రౌంచాస్త్రం, ఇంకా రెండు శక్తులని నీకు ఇస్తాను. రాక్షసులు ధరించే* *కంకాళం, కపాలం, కంకణం అనే మూడు ముసలాలని కూడా ఇస్తాను. వైద్యాధరం అనే మహాస్త్రం, నందన ఖడ్గం, నిద్ర కలిగించే, నిద్ర తొలగించే గాంధర్వ, మానవాస్త్రాలని, సౌరాస్త్రాన్ని, దర్పణ, శోషణ, సంతాపన, విలాపనాస్త్రాలని, మదనాస్త్ర, మోహనాస్త్రాలని ఇస్తున్నాను. తీసుకో. తామస, సౌమనాస్త్రాలు, సంవర్థాస్త్రం, వౌసలాస్త్రం, సత్యాస్త్రం, మాయాధర్మాస్త్రం, తేజః ప్రభాస్త్రం, శిశిరాస్త్రం, సుదామనాస్త్రం, శితేషువు బాణం, మానవాస్త్రాలని తీసుకో. రామా! ఇష్టం వచ్చిన రూపాలని ధరించే, బలమైన ఈ ముప్పై ఒక్క అస్త్రాలు అన్నిటినీ వెంటనే తీసుకో’*

*'విశ్వామిత్రుడు ఆ అత్యుత్తమమైన అన్ని అస్త్రాలని రాముడికి ఉపదేశించాడు. ఏ అస్త్రాలని పరిపూర్ణంగా స్వీకరించడం దేవతలకి కూడా అసాధ్యమో అలాంటి అస్త్రాలు అన్నిటినీ విశ్వామిత్రుడు రాముడికి ఇచ్చాడు. ఆ అస్త్ర మంత్రాలు రాముడ్ని సేవించాయి. రాముడు ఆ అస్త్రాలని స్వీకరించాక అస్త్ర దేవతలు అందరూ రాముడికి నమస్కరించి ఇలా చెప్పాయి.'రామా! మేమంతా నీ దాసులం’ రాముడు చేత్తో ఆ అస్త్ర దేవతలని తాకి ఆజ్ఞాపించాడు. ‘నా జ్ఞాపకంలో ఉండండి’ దేవతలు వెళ్లాక రాముడు విశ్వామిత్రుడితో చెప్పాడు.‘ఓ మునివర్యా!మీరు నాకు మూడు చక్రాలని, మూడు గదలని, మూడు పాసాలని ఇచ్చారు. దాంతో నేను ఈ అస్త్రాల ద్వారా దేవతలు కూడా ఎదిరించలేని వాడిని అయ్యాను. ఈ అస్త్రాల ఉపసంహారం కూడా తెలియచేయండి’ విశ్వామిత్రుడు ఆ పద్ధతిని కూడా ఉపదేశించాడు.* 

*'రామా! అలాగే. ఉపసంహారాలతోపాటు దృశాశ్వుని కొడుకులు, ప్రకాశించినవి, కామరూపం కలవి అయిన సత్యవంతం, సత్యకీర్తి, ధృష్టం, రభసం, ప్రతిహారతరం, పరాన్ముఖం, అవాగ్ముముఖం, లక్షాక్షం, విషమం, దృఢనాభం, సునాభం, దశాక్షం, శతవక్త్రం, దశశీర్షం, శతోదరం, పద్మనాభం, మహానాభం, దుందునాభం, సునాభం, జ్యోతిషం, కృశనం, నైరాశ్యం, విమలం, యోగంధరం, హరిద్రం, దైత్యం, ప్రశమనం, సార్చిర్మాలి, ధృతి, మాలి, వృత్తిమంతం, రుచిరం, పితృసౌమనసం, విధూతం, మకరం, కరవీరకరం, ధనం, ధాన్యం, కామరూపం, కామరుచి, మోహం, ఆవరణం, జృభకం, సర్వనాభం, సంతానం, వరణం అనే అస్త్రాలని కూడా ఇస్తున్నాను. వాటిని తీసుకో. నువ్వు వీటిని తీసుకోడానికి అర్హత గలవాడివి. నీకు క్షేమం అవుగాక!’ రాముడు సంతోషించి ఆ నలభై ఐదు అస్త్రాలని స్వీకరించాడు. ఆ అస్త్ర దేవతల్లో కొందరు ఎర్రగా కాలిన బొగ్గులా, కొందరు పొగలా కొందరు సూర్యచంద్రుల్లా ఉన్నారు. దివ్యమైన దేహాలు గల ఆ అస్త్ర దేవతలు కూడా ప్రత్యక్షం అయి, వినయంగా చేతులు కట్టుకుని రాముడితో ఇలా అన్నారు. ‘ఓ నరశ్రేష్ఠుడా! ఏం చేయాలో ఆజ్ఞాపించు’ ‘మీరు నా మనసులో మెదలుతూ పని పడ్డప్పుడు నాకు సహాయం చేయండి. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు వెళ్లండి’ రాముడు చెప్పాడు. వారంతా రాముడికి ప్రదక్షిణం చేసి వెళ్లిపోయారు.*

*ఇవండీ మన రాములోరికి ఆ మునిసాములోరు ఇచ్చినవి... ఇంకా ఉన్నాయేమో... ఉంటే ఉండొచ్చుమరి... నాకింతే తెలిసాయి...*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴

No comments:

Post a Comment