Tuesday, June 24, 2025

 2912z;246e1;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀ఆ.స.142.
నేటి...

             *ఆచార్య సద్బోధన*
                 ➖➖➖✍️

*గురుసేవ-గురుశుశ్రూష* 
4 విధాలు. 

*(1) స్థాన శుశ్రూష:-* ```
గురువు ఉన్న ఇంటిని, ఆశ్రమాన్ని, ప్రదేశాన్ని శుభ్రం చేయటం. ఆయన పరిసరాలను శుభ్రం చేయటం.ఆయన వాడే వస్తువులను శుభ్రం చేయటం - (అదీ తప్పనిసరి కర్తవ్యంగా గాక - తనకు అదృష్టవశాత్తు లభించిన అవకాశంగా భావించి)```

*(2) అంగ శుశ్రూష:-* ```
స్వయంగా ఆయన పాదాలొత్తి సేవ చెయ్యటం. ఆయన యొక్క ఆరోగ్య విషయాలను స్వయంగా చూచుకుంటూ తగిన ఏర్పాట్లు చెయ్యటం. ఆయన అవసరాలను కనిపెట్టి ఉండటం.``` 

*(3) భావ శుశ్రూష:-* ```
ఆయన మనస్సులోని భావాలను తెలుసుకుంటూ అందుకనుగుణంగా నడుచుకోవటం. ఆయన కోరకుండానే ఆయన అవసరాలు తీర్చటం.ఆయనకు ఏ లోటూ కలగకుండా చూచుకోవటం. ```

*(4) ఆత్మశుశ్రూష:-* ```
తన మాటలు - చేతలు గురువును నొప్పించకుండా ఆయన నడిచే మార్గంలోనే నడవటం. ఆధ్యాత్మిక చింతనతో ఆయనతో పోటీ పడటం. తన శరీరం - తన ధనసంపదలు - తన మనస్సు సర్వమూ గురువు కోసమేననే భావన బుద్ధిలో దృఢంగా ఉండాలి.✍️```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷```         

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment