Monday, September 8, 2025

 🛕🍁🛕🍁🛕🍁🛕🍁🛕

🙏 *తిరుమల*
*ఏడుకొండల పరమార్ధం*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺

*1.  వృషాద్రి* 
*2.  వృషభాద్రి* 
*3.  గరుడాద్రి* 
*4.  అంజనాద్రి* 
*5.  శేషాద్రి* 
*6.  వేంకటాద్రి* 
*7.  నారాయణాద్రి*

*ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మ స్థానం లో ఉంటుంది.*

*అందుకనే ఆయన  ఏడుకొండలు పైన ఉంటాడు. ఈ  ఏడుకొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది.* 
*ఆ ఏడుకొండలు సాలగ్రామాలే.* 
*ఆ ఏడుకొండలూ మహర్షులే.* 
*అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే.* 
*తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు.*

*1. వృషభాద్రి -* 
అంటే ఎద్దు. వ్రుశాభానికి ఋగ్వేదం లో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమ శివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములుంటాయి. 
3 పాదాలు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు)

వాక్కు అంటే - శబ్దం..
శబ్దం అంటే - వేదం..
వేదం అంటే - ప్రమాణము..

నా కంటితో చూసిందే నిజమంటే కుదరదు. నిజం కానివి చాలా ఉంటాయ్. 
సుర్యోదయం, సూర్యాస్తమయం అని అంటున్నారు. నిజంగా దాని కన్నా అబద్దం ఇంకోటి లేదు. సూర్యుడికి కదలిక ఏమి ఉండదు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. భూమి తిరగడం మీరు చూసారా. భూమి సూర్యుడికి అభిముఖంగా వెళ్ళినప్పుడు చీకటి. తిరగనది సూర్యుడు. మీ కన్ను భ్రమకి లోనైనెట్టా..లేదా, 
కాబట్టి వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.

*2. వృషాద్రి -* 
అంటే ధర్మం.
ధర్మం అంటే - నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు etc. 
దాని వల్ల ఇహం లోను, పరలోకం లోను సుఖాన్ని పొందుతాడు.

అవి చెయ్యడమే వృషాద్రి ని ఎక్కడం.

*3. గరుడాద్రి -* 
అంటే పక్షి - ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం.

*షడ్ -* అంటే జీర్ణం కానిది. 
ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. 
మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి.

పుట్టినది, 
ఉన్నది, 
పెరిగినది, 
మార్పు చెందినది, 
తరిగినది, 
నశించినది. 

ఇవ్వన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ 6 లేని వాడు భగవానుడు.

*భ* == ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు & అంతా తానే బ్రహ్మాండము అయినవాడు.
*అన్* == ఉన్నవాడు, కళ్యాణ గుణ సహితుడు, హేయగుణ రహితుడు.

అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే *గరుడాద్రి.*

*4. అంజనాద్రి -* 
అంజనం అంటే కంటికి కాటుక.
కాటుక ఎప్పుడు పెట్టుకుంటాం? 
అందానికి, చలవకి.

*కంటికి అందం ఎప్పుడు? -* 
ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. 
ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. 
ఇదంతా పరమాత్మ సృష్టియే.

*అప్పుడు అంజనాద్రి దాటతాడు.*

*5. శేషాద్రి -* 
ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగ ద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీత లో గీత చార్యుడు చెప్పాడు,

*తుల్య నిందా స్తుతిర్ మౌని* 
(శ్లోకం చెప్పారు) 

తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. 
(ఇక్కడ రమణ మహర్షి కొన్ని ఉదాహరణలు గురుంచి చెప్పారు ) 

ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.

*6. వేంకటాద్రి -* 
*వేం :* పాపం, 
*కట :* తీసేయడం. 
కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చి వాళ్ళలా కనవడుతారు. అది మన కర్మ. 

రామ కృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చి వాడు ఒకలా ఉంటారు.

ఆయనకే అర్పణం అనడం & అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం.

*7. నారాయణాద్రి -* 
అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం *నారయానాద్రి.*

*వేంకటాచలం లో  ఏడుకొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు.* 

*ఈ కారణాలు తెలుసుకొని ఏడుకొండలు ఎక్కాలి.*

🛕🍁🛕🍁🛕🍁🛕🍁🛕

No comments:

Post a Comment