. *ఈ జన్మకు సార్థకత ఏమిటి?*
🏵🙏జై శ్రీమన్నారాయణ🙏🏵
మనకు వచ్చే మృత్యువు అనేది ఫోటోగ్రాఫర్ లాంటిది కాదు, మనం రెడీగా ఉన్నపుడు మాత్రమే తీసుకుపోవడానికి!
అది నిత్యం మనతోనే ఉంటున్నది....
సమయం వచ్చినప్పుడు దాని పని అది చక్కగా చేసుకుపోతుంది.
*'నావి'* అనుకున్న ఈ సంపదలు, భూములు, భవనాలు, భార్య బిడ్డలు, బంధుమిత్రులు ఎవరూ కూడా మనలను మృత్యువు నుండి కాపాడలేరు.
ఇవేవీ మనతో వచ్చేవి కావు కూడా , కనుక వీరి నిమిత్తం మనం మంచిని విడువకూడదు, చెడుపైపు మరలకూడదు...
నేడు మనం చేసిన ప్రతీ తప్పుకు మరణాంతరం దేవుని ముందు ఒంటరిగా నిలబడి సమాదానం చెప్పవలసి ఉంటుంది...
నేడు మనం చేసుకున్న పుణ్య, పాప కర్మలే అప్పటి మన సాక్ష్యాలు...
కనుక నిజముగా ఆత్మోద్ధారణ కోరుకొనువారు పాప ఫలితాలనిచ్చే హింసాది పాపకర్మలకు దూరముగా ఉండాలి.
పుణ్య ఫలితాలను ఇచ్చే పరోపకారాలు, *మాధవసేవగా సర్వప్రాణిసేవ* సమాజ సేవలు చేస్తుండాలి, మనోశుద్ధి కొరకు భగవంతుని స్మరిస్తుండాలి. ఎందరెందరో మహనీయులు తరించిన. మార్గాన్ని అనుసరించాలి
*భగవంతుడు చూపిన మార్గంలో నడచుకోవడము వలనే జన్మకు సార్థకత చేకూరుతుందన్న సత్యంను గ్రహించి ఆ దివ్యమార్గంలో నడచుకోవాలి...*
*🌹ఓం నమో వేం కటేశాయా🌹*
*సమస్త లోకా సుఖినోభవంతు*
💠 *జైశ్రీమన్నారాయణ. *
No comments:
Post a Comment