Monday, September 8, 2025

 🕉️ *జై శ్రీమన్నారాయణ* 🕉️

*_🌴 ఈ సమస్తము భగవంతునికి చెందినదే. నేడు మనం అనుభవిస్తున్న సకలము అయన ఇచ్చినదే. మరి అయనకు చెందిన దానిని అయనకు అందించేటప్పుడు ఈ సమర్పణలో మనము అయనకు ఏదో ఉపకారము చేసినట్లు గర్వపడడం, డప్పు కొట్టుకోవడం ఎందుకు? భగవంతుని నిమిత్తం సేవ చేయడం గొప్ప అదృష్టం. అలాంటపుడు సేవ చేసిన తర్వాత ఇంత చేసాము, అంత చేసాము అని ఎప్పుడూ గర్వపడకూడదు. చేసిన సేవకు ప్రతిఫలం ఆశించడం కానీ లేదా ఇంకేదో ఇవ్వమని దైవమును అడగడం కానీ చేయకూడదు. సేవను దేవుడు మనకు అప్పజెప్పిన బాధ్యతగా భావించాలి.  ఏదైనా సేవా కార్యం చేసినపుడు అణకువతో , గౌరవంతో గర్వపడకుండా చేయాలి. కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే సేవను పొందిన వ్యక్తి రూపంలో  మన సేవను అంగీకరించినది ఆ భగవంతుడే కదా!.. "🌴_*

No comments:

Post a Comment