Monday, September 8, 2025

 *ప్రేరణ🏹మార్గ*
*మానవత్వం_ఎక్కడో లేదు* !

"పోస్ట్" అంటూ పోస్ట్ మాన్ ఒక ఇంటి తలుపు తట్టాడు.

"వస్తున్నా" అన్న స్వరం నెమ్మదిగా వినిపించింది ఆ ఇంటిలో నుంచి.

 నాలుగు నిమిషాలు అవుతోంది. అయితే ‘వస్తున్నా’ అన్న మనిషి ఆ ఇంటిలో నుంచి బయటికి రానేలేదు.

విసుగు చెందిన పోస్ట్ మాన్ గట్టిగా..అన్నాడు "ఎవరైనా ఉన్నారా? త్వరగా రండి.

ఉత్తరాన్ని తలుపు వద్ద ఉంచండి. నేను వస్తున్నా" అని వినిపించింది.

"అమ్మా, ఈ ఉత్తరము ‘స్పీడ్ పోస్ట్.’ కనుక తప్పనిసరిగా మీ సంతకం ఉండాలి. అలాగా ఉత్తరాన్ని వదిలివేయటం కుదరదు. మీరు త్వరగా రండి బయటకు" అన్నాడు పోస్ట్ మాన్.

దాదాపు ఓ పదినిమిషాల తర్వాత, కోపంలో ఉన్న పోస్ట్ మాన్ ఇంటిలో నుండి వచ్చిన వ్యక్తిని చూసి నిర్ధాంత పోయాడు. నోట మాట రాలేదు. ఎందుకంటే వచ్చిన అమ్మాయికి రెండు కాళ్లు లేవు. 

ఉత్తరాన్ని ఇచ్చి, సంతకం తీసుకున్న తర్వాత ఆ పోస్ట్ మాన్ ఆ అమ్మాయి పరిస్థితి కి చాలా బాధపడుతూ విచారంగా వెనుతిరిగాడు.

ఇలా కొంతకాలం గడిచింది. ఆ ఇంటికి ఏ ఉత్తరం వచ్చినా ఓ పది నిమిషాల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితిని అర్థం చేసుకున్న పోస్ట్ మాన్ అలానే వేచి ఉండేవాడు.

అయితే ఓసారి ఉత్తరాన్ని తీసుకోడానికి వచ్చిన ఆ అమ్మాయి పోస్ట్ మాన్ కాళ్ళ వంక చూసింది. అతను కాళ్లకు చెప్పులు లేకుండా ఉద్యోగం చేస్తున్నట్లు ఆ పాప గమనించింది.

పోస్ట్ మాన్ ఉత్తరాలు ఇవ్వటానికి వచ్చే సమయంలో అతని పాద ముద్రల ను కొలిచింది, అతని పాదాల సైజు తెలుసుకోడానికి!

ఆ అమ్మాయి ఇచ్చిన ప్యాకెట్ లో ఒకజత చెప్పులు ఉన్నాయి. తను ఇంతకాలం ఉద్యోగం చేస్తున్నా ఎవ్వరు తను చెప్పులు లేకుండా నడుస్తున్నాను అని గమనించిన వారే లేరు. అందుకే ఆ అమ్మాయి చేసిన పనికి చలించిపోయాడు.

పోస్ట్ మాన్ ఆ తర్వాత రోజు నేరుగా తన ఆఫీసుకు వెళ్లి తన అధికారితో.. తనను ఆ బీట్ కాకుండా వేరే బీట్ కి మార్చమని వేడుకున్నాడు.

ఓ రోజు పాప ఇలా అంది "అంకుల్, నా నుంచి దయచేసి నా ఈ చిన్న బహుమానం మీరు తీసుకోవాలి. వద్దనవద్దు".

అమ్మాయి 'అంకుల్ మీరు తప్పక తీసుకోవాల్సిందే' అని అనడంతో ఆ బహుమతిని తీసుకుని ఇంటికి వెళ్లి, ప్యాకేజి విప్పి చూశాడు...చూసిన మరుక్షణం అతని కళ్ళ వెంట కన్నీళ్లు ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి .

ఎందుకు అలా అడుగుతున్నావు' అన్నాడు పోస్ట్ మాస్టర్.

అతని కళ్ళల్లో మళ్లీ కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. "సార్ ఇవాళ నుంచి నేను ఆ వీధిలోకి పోస్ట్ డెలివరీ చేయడానికి వెళ్లలేను; 

👉ఎందుకంటే ‘ఆ అమ్మాయి నన్ను చెప్పుల్లేకుండా నడవడం చూసి చెప్పులు బహుమతిగా ఇచ్చింది. కానీ కాళ్లే లేని ఆమెకు నేను కాళ్లు ఎలా ఇవ్వగలను?’

ఇతరుల బాధ, అనుభవంలోని సునితత్వాన్ని అర్థం చేసుకోవాలి. అదే మానవత్వం అంటే. అది లేకుంటే మానవత్వం సంపూర్ణం కాదు.🍁 

No comments:

Post a Comment